»   » ఆ విషయమే హీరోయిన్‌గా చేసింది.. ‘సెకండ్’ అంటే బాధపడను.. సీరత్ కపూర్ (ఇంటర్వ్యూ)

ఆ విషయమే హీరోయిన్‌గా చేసింది.. ‘సెకండ్’ అంటే బాధపడను.. సీరత్ కపూర్ (ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవడ్ సినీ పరిశ్రమలోకి తొలుత కొరియోగ్రాఫర్‌గా అడుగుపెట్టింది. రణ్‌బీర్ కపూర్ నటించిన రాక్‌స్టార్ చిత్రంలో భాగమైంది. ఆ తర్వాత ఊహించిన పరిస్థితుల్లో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస చిత్రాల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నది. తాజాగా టచ్ చేసి చూడు చిత్రంలో రవితేజతో జతకట్టింది.. ఈ చిత్రం ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సీరత్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడింది... అది మీకోసం

 కొరియోగ్రాఫర్‌గా సినీ పరిశ్రమకు వచ్చిన మీరు నటిగా ఎలా మారారు?

కొరియోగ్రాఫర్‌గా సినీ పరిశ్రమకు వచ్చిన మీరు నటిగా ఎలా మారారు?

దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ నర్గీస్ ఫక్రీ నటించిన రాక్‌స్టార్ చిత్రానికి అసిస్టెంట్ కోరియోగ్రాఫర్‌గా పనిచేశాను. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలిచిత్రానికే స్టార్ డైరెక్టర్, హీరోతో పనిచేయడం గొప్ప అనుభవం. అప్పుడు నేను హీరోయిన్ అవుతాను అని అనుకోలేదు.

హీరోయిన్ అవకాశం ఎలా వచ్చింది?

హీరోయిన్ అవకాశం ఎలా వచ్చింది?

నాకు హీరోయిన్ అవకాశం వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. వాస్తవానికి ఓ సినిమా ఆడిషన్‌కు నా ఫ్రెండ్ వెళ్లాల్సి ఉంది. కానీ ఆమెకు అనారోగ్యానికి గురికావడంతో నేను వెళ్లాల్సి వచ్చింది. నా ఫ్రెండ్ జుత్తు కూడా నాలానే ఉండటంతో ఓ ఎక్సీపీరియెన్స్ ఉంటుంది అని నేను ఆ ఆడిషన్స్‌కు వెళ్లాను.

రన్ రాజా రన్ అవకాశం ఎలా వచ్చిందంటే..

రన్ రాజా రన్ అవకాశం ఎలా వచ్చిందంటే..

నేను ఆడిషన్స్‌కు వెళ్లిన సమయంలోనే రన్ రాజా రన్ సినిమా కోసం హీరోయిన్ ఆడిషన్స్ జరిగాయి. నేను ఆడిషన్స్ వెళ్లడంతో వారు నన్ను చూసి ఇంప్రెస్ అయ్యారు. ఆ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. నేను యాక్టింగ్‌లోకి ప్రవేశించడం ప్లాన్ లేకుండా జరిగిపోయింది. రన్ రాజా రన్ సినిమా జరిగేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. అప్పుడే యాక్టింగ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని డిసైడ్ అయ్యాను.

నటిగా మారిన తర్వాత సినిమాలకు కొరియోగ్రఫీ చేశారా?

నటిగా మారిన తర్వాత సినిమాలకు కొరియోగ్రఫీ చేశారా?

హీరోయిన్‌గా మారిన తర్వాత నేను ఏ సినిమాకు కూడా కొరియోగ్రఫీ చేయలేదు. చేయాలని ఉంది. కానీ అవకాశం రాలేదు. ఒకవేళ ఆ అవకాశం వస్తే నేను నా ప్రతిభను ఉపయోగించుకొంటాను. నేను డ్యాన్స్ చేసే పాటకే స్వయంగా కొరియోగ్రఫీ డిజైన్ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది.

 మీ ఫ్యామిలీది డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్.. మీరు ఏలా సినిమాల్లోకి వచ్చారు..

మీ ఫ్యామిలీది డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్.. మీరు ఏలా సినిమాల్లోకి వచ్చారు..

మా నాన్నగారు హోటల్ బిజినెస్‌లో ఉండేవారు. మా అమ్మ ఎయిర్‌హోస్టెస్. సినిమా పరిశ్రమతో డైరెక్టగా పరిచయాలు లేకపోయినా మా నాన్నకు వృత్తిపరంగా పరోక్షంగా సంబంధాలు ఉండేవి. మా నాన్నకు నటుడు రాజ్‌పాల్ యాదవ్ మంచి స్నేహితుడు. నన్ను చూసి మీ అమ్మాయిని హీరోయిన్ చేయమని ఎప్పడూ అడుగుతుండేవాడు. కానీ మానాన్న పెద్దగా ఆసక్తి చూపేవాడు కాదు.

 బాలీవుడ్ సినిమా తర్వాత అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా?

బాలీవుడ్ సినిమా తర్వాత అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా?

రన్ రాజా రన్ సినిమా తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటున్నాను. మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను. ఇక హిందీ భాషలో నటించే విషయంపై ఇప్పుడిప్పుడే దృష్టిపెడుతున్నాను. స్క్రిప్టులు వినడం ప్రారంభించాను. నా అభిరుచికి తగినట్టుగా ఉండే పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. మంచి క్యారెక్టర్ లభిస్తే నేను నటించడానికి సిద్ధం.

 టాలీవుడ్‌లో మీకు ఎలాంటి స్పందన వస్తున్నది?

టాలీవుడ్‌లో మీకు ఎలాంటి స్పందన వస్తున్నది?

టాలీవుడ్‌లో నా జర్నీ చాలా వండర్‌పుల్‌గా ఉంది. రన్ రాజా రన్ తర్వాత నాకేం కావాలో తెలియదు. వరుసగా సినిమాలు చేసుకొంటూ వస్తున్నాను. ఇప్పుడిప్పుడే నేను పాత్రల ఎంపికపై దృష్టిపెడుతున్నాను. డిఫరెంట్ రోల్స్‌లో నటించే విధంగా ప్లాన్ చేసుకొంటున్నాను. రాజు గారి గది2, ఒక్క క్షణం తర్వాత నా యాక్టింగ్‌కు మంచి ప్రశంసలు లభించాయి. ఫ్యాన్స్ నాకు మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు.

 సెకండ్ హీరోయిన్‌గా నటించడంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?

సెకండ్ హీరోయిన్‌గా నటించడంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?

కొన్ని సినిమాల్లో నాది సెకండ్ హీరోయిన్‌గా నటించాను. రన్ రాజా రన్‌లో సింగిల్ హీరోయిన్‌గా చేశాను. టైగర్, కొలంబస్ చిత్రాల్లో నా ప్రాధాన్యం ఉన్న పాత్రలే. తాజాగా రిలీజైన ఒక్క క్షణంలో కూడా నాది సెకండ్ హీరోయిన్ పాత్ర అయినప్పటికీ సినిమా కథ అంతా నా చుట్టే తిరుగుతుంది. క్యారెక్టర్ బాగా ఉంటే నాది సెకండ్ హీరోయిన్ పాత్ర అనేది పట్టించుకోను.

టాలీవుడ్‌లో మీ కెరీర్‌ సంతృప్తికరంగా ఉందని భావిస్తున్నారా?

టాలీవుడ్‌లో మీ కెరీర్‌ సంతృప్తికరంగా ఉందని భావిస్తున్నారా?

ఇప్పటి వరకు రన్ రాజా రన్, టైగర్, కొలంబస్, రాజగారి గది2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు, సురేష్ ప్రొడక్షన్‌లో ఓ చిత్రంతో కలిపి మొత్తం ఏడు సినిమాల్లో నటించాను. సినిమా సినిమాకు నటన పరంగా పరిణితి చెందుతున్నాను. అందుకే పెద్ద సినిమాల్లో స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కుతున్నది.

 తెలుగు భాషా సమస్యను ఎలా అధిగమిస్తున్నారు?

తెలుగు భాషా సమస్యను ఎలా అధిగమిస్తున్నారు?

యాక్టింగ్‌లో గానీ, సినిమా పరిశ్రమలో భాష అసలు సమస్యే కాదు. రన్ రాజా రన్ నుంచి టచ్ చేసి చూడు సినిమా వరకు నేను తెలుగులోనే డైలాగ్స్ చెబుతున్నాను. తెలుగు భాష నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నిరంతరంగా కృషి చేస్తున్నాను. ఇప్పటికే నేను 85 శాతం తెలుగును అర్థం చేసుకొంటున్నాను. భాష నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. దాంతో సమస్య రాకుండా చూసుకొంటున్నాను.

English summary
Seerat Kapoor has bagged two back-to-back hits like Raju Gari Gadi2, Okka Kshanam movies. Now she is eying on hat-trick with Touch Chesi Chudu. The actor is playing one of the love interests of Ravi Teja in Touch Chesi Chudu which is hitting the screens on February 2. Directed by Vikram Sirikonda, the film is going to show Ravi Teja in two different phases of his life. Seerat said, “After the screening of Okka Kshanam, many from the audiences have come to me and appreciated me directly. It happened with Raju Gari Gadhi 2 also. I am happy as an actor. It doesn’t mean that I will not work hard. I’ll work much harder.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu