»   » రాజ్ తరుణ్ 'సీ.అ.రా.సి’ ఆడియో డేట్...

రాజ్ తరుణ్ 'సీ.అ.రా.సి’ ఆడియో డేట్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ' చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ 'కుమారి 21 ఎఫ్' చిత్రంతో హ్యాట్రిక్ ను సాధించి క్రేజీస్టార్ గా మారాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు' చిత్రంపై వుంది.

షూటింగ్ ను పూర్తిచేసుకొని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ''ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్ద పీటవేశాం. రాజ్ తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రంతో అర్తన అనే నూతన హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతుంది. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలను భారీఖర్చుతో చిత్రీకరించాం. చిత్రంలో పతాక సన్నివేశాలు హైలైట్ గా వుంటాయన్నారు.


Seethamma Andalu Ramayya Sitralu music launch on 10 January

తప్పకుండా ఈ చిత్రం రాజ్ తరుణ్ సెకండ్ హ్యాట్రిక్ కు శ్రీకారంలా వుంటుంది. జనవరి 10న ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను విడుదల చేసి, జనవరి మూడవ వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు. రాజ్ తరుణ్, అర్తన, రణదీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరలు నటిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్ధాల అశోక్ తేజ,రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: విశ్వ, ఆర్ట్: జేవీ, అడిషనల్ డైలాగ్స్: అనీల్ మల్లెల, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు, కథ-స్కీన్ ప్లే--దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.

English summary
Raj Tarun's Seethamma Andalu Ramayya Sitralu music launch on 10 January.
Please Wait while comments are loading...