Don't Miss!
- News
ఆర్థిక వ్యవస్థ గుట్టుమట్లు బహిర్గతం- కీలక సర్వే: ఇంకొన్ని గంటల్లో..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Love Story: బుల్లితెరపై కూడా లవ్ స్టొరీ రికార్డు.. మొదటి సారి రేటింగ్ ఎంతంటే?
నాగ చైతన్య - సాయి పల్లవి కలయికలో వచ్చిన మొదటి సినిమా లవ్ స్టొరీ ఏడాది భారీగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఫిదా లాంటి బాక్సాఫీస్ అనంతరం దర్శకుడు శేఖర్ కమ్ముల ఎంతో టైం తీసుకుని చేసిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అంతేకాకుండా సాయిపల్లవి నటనకు కూడా ప్రత్యేకంగా సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందాయి. సెన్సిటివ్ అంశాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించిన విధానం చాలా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. సెకండ్ వేవ్ అనంతరం అసలు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ ఏ మేరకు వసూళ్లను అందుకుంటాయనే సందిగ్ధంలో ఉన్న సమయంలో లవ్ స్టోరీ సినిమా మంచి లాభాలను అందుకుంది.
ఒక విధంగా అప్పుడు ఈ సినిమా ఓపెనింగ్స్ అందరిలో ధైర్యాన్ని నింపింది. అసలైతే ఈ సినిమా ఈ ఏడాది మొదట్లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా అనేక సార్లు వాయిదా పడుతూ చివరికి ఈ ఏడాది సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక బుల్లితెర ఆడియెన్స్ నుంచి కూడా సినిమాకు భారీ స్థాయిలో ఆదరణ దక్కింది. ఇటీవల స్టార్ మా లో ఈ సినిమాను మొదటి సారి ప్రదర్శించగా రేటింగ్స్ విషయంలో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం విశేషం.

మొదటిసారి బుల్లితెరపై 18.01 TRP తో సినిమా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇక లవ్ స్టోరీ తో పాటు ఇటీవల శ్రీదేవి సోడా సెంటర్ కూడా మొదటిసారి బుల్లితెరపైకి రాగా ఈ సినిమాకు చాలా తక్కువగా 3.5 TRP దక్కింది. లాభం అనే డబ్బింగ్ సినిమాకు 2.90 టిఆర్పి దక్కింది. లవ్ స్టోరీ సినిమా కేవలం వెండితెరపై కాకుండా బుల్లితెరపై కూడా భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకుని మంచి క్రేజ్ ను అందుకుంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే కాకుండా శేఖర్ కమ్ముల కెరీర్లో కూడా అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా గుర్తింపు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 35.15 కోట్ల షేర్ వసూలు అందుకున్న లవ్ స్టోరీ సినిమా 62.50 గ్రాస్ వసూలు సాధించింది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకు మంచి లాభాలు వచ్చినప్పటికీ మిగతా ఏరియాల్లో మాత్రం నష్టాలు ఎదురయ్యాయి. ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.