»   » ఫిదాకు రాళ్లెత్తిన అంటూ శేఖర్ కమ్ముల ఉద్వేగం.. సాయి పల్లవిపై సెన్సేషనల్ కామెంట్

ఫిదాకు రాళ్లెత్తిన అంటూ శేఖర్ కమ్ముల ఉద్వేగం.. సాయి పల్లవిపై సెన్సేషనల్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాయి పల్లవి, వరుణ్ తేజ్ జంటగా నటించిన ఫిదా చిత్రం సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రశంసల జల్లులో తడిసి ముద్దవుతున్నట్టు తెలుస్తున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం తొలి ఆటకే ఏకపక్షంగా సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధిస్తున్న క్రమంలో శేఖర కమ్ముల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉద్వేగభరితమైన మెసెజ్‌ అందర్ని ఆకట్టుకొంటున్నది.

సుదీర్గ ప్రయాణంలో..

సుదీర్గ ప్రయాణంలో..

ఫిదా చిత్ర విజయానికి రాలెత్తిన చిత్ర యూనిట్‌కు థ్యాంక్స్. ఈ సినిమా నిర్మాణంలో సుదీర్ఘ ప్రయాణం చేస్తూ అండదండలు అందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని అన్నారు. అంతేకాకుండా ప్రతీ ఒక్కరిని పేరు పేరున అభినందించారు. చిత్ర యూనిట్ సభ్యులైన సూరి, సులోచన, కిశోర్, చైతన్య, స్వరూప్‌లపై పొగడ్దలతో ముంచెత్తారు.

తెలంగాణను అద్భుతంగా ..

తెలంగాణను అద్భుతంగా ..

ఇక ఈ చిత్రంలో తెలంగాణను బాగా చూపించావు అని ప్రతీ ఒక్కరు అంటుంటే చాలా సంతోషం వేస్తున్నది. ఆ క్రెడిట్ అంతా సినిమాటోగ్రఫర్ విజయ్ సీ కుమార్‌కే దక్కుతుంది. మార్తాండ్ వెంకటేశ్ ఎడిటింగ్ ఈ సినిమాకు పెద్ద ఎసెట్. శక్తికాంత్ ఈ సినిమాకు చాలా ఫ్రెష్‌గా, విభిన్నమైన మ్యూజిక్ అందించాడు. ఆర్ట్ డైరెక్టర్‌గా రాజీవ్ నాయర్ అద్భుతమైన వర్క్ చేశాడు. జీవన్ బాబు అందించిన రీరికార్డింగ్ అద్భుతం అని శేఖర్ కమ్ముల మరో పోస్ట్ చేశారు.

 సాయి పల్లవి అమోఘం..

సాయి పల్లవి అమోఘం..

సాయి పల్లవి నటనా ప్రతిభ, ఈ సినిమాకు నీవు చూపిన అంకుఠిత దీక్ష గురించి మాటల్లో చెప్పలేను. వరుణ్ పాత్రలో వరుణ్ తేజ్ నటించలేదు... ఆయన జీవించాడు అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. ఇక వరుణ్ తమ్ముడిగా నటించిన అర్యన్ తెరమీద వెలిగిపోయాడు. నీవు ఓ సూపర్ కిడ్ అని అన్నారు.

 తండ్రిగా నటించినందుకు..

తండ్రిగా నటించినందుకు..

సాయిచంద్ గారు తండ్రి పాత్రలో నటించడానికి ముందుకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్యూ. మౌనంగా మీరు కనిపిస్తు తెర మీద నటించిన తీరు స్క్రీన్ మీద అద్భుతంగా పండింది. వరుణ్ అన్నయ్యగా నటించిన రాజా, వదినగా నటించిన శరణ్య, అమెరికా ఆలీగా నటించిన రాజేశ్ బాగా నటించారు. సాయి పల్లవి అత్తగా నటించిన గీతా భాస్కర్ ఇంట్లో మంచి అత్తమ్మగా కనిపించింది. వీరందరూ అద్భుతమైన నటన ప్రదర్శించారు అని శేఖర్ కమ్ముల ఉద్వేగానికి లోనయ్యారు.

మీ అందరి సహకారం మరువలేనిది..

మీ అందరి సహకారం మరువలేనిది..

సూరి నీవు వ్యక్తిగత సమస్యలను అన్నింటిని పక్కన పెట్టి యూనిట్ వెంట నడిచావు. ఈ సినిమాను అధ్భుతంగా రావడానికి నా కోసం పోరాటం చేశావు. సులోచన నీ తల్లిదండ్రులను ఒప్పించి అమెరికా నుంచి వచ్చావు. సాంస్క‌తిక విభేధాల మధ్య ఊగిసలాడావు. అమెరికా సంప్రదాయలను పక్కనపెట్టి ఈ చిత్రానికి విశేషంగా కృషి చేశావు. బాన్సువాడలో షూటింగ్ సందర్భంగా వందల మందిని ఒప్పించి, వారికి యాక్టింగ్ నేర్పించి కిశోర్, స్వరూప్ చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ చిత్రంలో నేటివిటి బాగా పండటానికి చాలా కష్టపడ్డాడు అని శేఖర్ కమ్ముల తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

English summary
Sekhar Kammula get emotional on success of Fidaa. He posted a message about Sai Pallavi, Varun Tej, Saichand etc., Thanks to Raallethina maa TEAM. Who felt for me and stood by the film all through for such a long tiring journey. Thank you.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu