»   »  కూల్ హీరో-కూల్ దర్శకుడు కాంబినేషన్

కూల్ హీరో-కూల్ దర్శకుడు కాంబినేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యుటివితో మూడు సినిమాలు చేయడానికి ఒప్పందం చేసుకున్న మహేష్ బాబు కొత్త తరహా చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే ఒక్కడు, అతడు, పోకిరి, అతిథి సినిమాలన్నీ పక్కా మాస్ చిత్రాలు కావడం, అయినా అవి సూపర్ డూపర్ చిత్రాలుగా నిలవడం విశేషం. అతిథికి ముందు మహేష్ సాధించిన హిట్లకు పులకించిన యుటివి సంస్థ అతిథి సినిమా పంపిణీ హక్కులను సైతం దక్కించుకుంది. మహేష్ తో మూడు సినిమాలు నిర్మించడానికీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అన్నీ సినిమాలు అటో ఇటో తేడాతో మాస్ సినిమాలే కావడంతో మహేషే స్వయంగా పంథాను మార్చుకునే ప్రయత్నంలో పడ్డాడు. ప్రస్తుతం అతిథి సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తోంది. అతిథికి ముందు విడుదలైన హ్యాపీడేస్ సినిమా కూడా అదే తరహాలో నడుస్తోంది. హ్యాపీడేస్ సినిమా రెగ్యులర్ తెలుగు సినిమాలకు భిన్నంగా ఉండి ప్రేక్షకులను అలరిస్తోంది. ఆ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన హ్యాపీడేస్ సినిమా పట్ల తెలుగు సినిమా పరిశ్రమ కూడా ఇపుడు చాలా ఆసక్తిని కనపరుస్తోంది. అందరిలానే మహేష్ కూడా ఆసక్తి కనపరుస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలని ఉందని సిన్సినయర్ చెప్పాడు. యుటివి సంస్థ మహేష్ హీరోగా నిర్మించే చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించే సినిమా కచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. సాఫ్ట్ చిత్రాల సూపర్ దర్శకుడు, యాక్షన్ చిత్రాల హీరో కాంబినేషన్ కోసం అభిమానులు ఆసక్తి కనపరుస్తారనడంలో సందేహం ఏముంది. అయితే ఇద్దరిలో ఉన్న సామ్యత ఏమంటే ఇద్దరూ వ్యక్తిగతంగా చాలా కూల్ గా ఉండడం.

Read more about: mahesh babu sekhar kammula
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X