twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’ వివాదంలో కొత్త ట్విస్ట్.. నరేష్‌కు షాక్.. కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నటుడు!!

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో వివాదం తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. మా ఎన్నికలు జరిగినప్పటి నుంచి, నరేష్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచీ ఏదో రకంగా వార్తల్లో నానుతూనే ఉంది. ఈ వివాదాలు చినికి చినికి గాలివానైట్టు కనిపిస్తోంది. చివరకు అధ్యక్షుడుగా నరేష్‌కు పదవీభంగం కలిగినట్టు తెలుస్తోంది. అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం.

    మొదటి నుంచి గొడవలే..

    మొదటి నుంచి గొడవలే..


    నరేష్ ప్యానెల్, శివాజీ రాజా ప్యానల్ ఎన్నికల్లో నిలబడగా.. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ వంటి పదవుల్లో నరేష్ ప్యానెల్ గెలుపొందింది. మిగతా మెంబర్స్ విషయంలో శివాజీ రాజా ప్యానెల్ సభ్యులే గెలుపొందారు.అయితే అందరూ కలిసి చక్కగా పని చేసుకుంటారని అంతా భావించినా అది జరగలేదు. వారిలో వారికే గొడవలు మొదలయ్యాయి.

    ఏకపక్ష ధోరణి..

    ఏకపక్ష ధోరణి..

    అధ్యక్షుడిగా నరేష్ ఏకపక్ష ధోరణి వహిస్తున్నాడని పలు సందర్భాల్లో జీవితా, రాజశేఖర్, హేమ వంటి వారు బహిరంగంగానే విమర్శించారు. అయితే ఈ గొడవలన్నీ సద్దమణిగేలా సినీ పెద్దలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని తెలుస్తోంది.

    రసాభాసగా మా డైరీ ఆవిష్కరణ..

    రసాభాసగా మా డైరీ ఆవిష్కరణ..


    మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతటి వివాదానికి దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగంలో రాజశేఖర్ రావడం, సభా మర్యాద పాటించకపోవడం, అనంతరం మా చర్యలు తీసుకునే లోపే రాజశేఖర్ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయడం వంటివి జరిగిన సంగతి తెలిసిందే.

    అనంతరం మళ్లీ గొడవలే..

    అనంతరం మళ్లీ గొడవలే..


    కార్యదర్శిగా తన అనుమతి లేనిదో డబ్బులు ఎలా వాడుకుంటారని నరేష్‌పై జీవితా రాజశేఖర్ ఫైర్ అయినట్టు వార్తలు వచ్చాయి. అంతే కాకుండా మా కార్యాలయానికి తాళాలు కూడా వేసుకుని వెళ్లినట్టు వార్తలు హల్చల్ చేశాయి. ఇలా మాలో నిరంతరం కుమ్ములాటలు జరగుతూనే ఉన్నాయి. తాజాగా మరో షాకింగ్ వార్త బయటకు వచ్చింది.

    యాక్టివ్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ..

    యాక్టివ్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ..


    మా అధ్యక్షుడు నరేష్ 41 రోజులు సెలవు పెట్టడం వల్ల డిసిప్లినరీ కమిటీ మరియు ఎక్జిక్యూటివ్ కమిటీ , కలిసి బై లాస్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ అయిన బెనర్జీని యాక్టివ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం జరిగిందని తెలుస్తోంది. ఈ మేరకు ఫిలిం ఛాంబర్ హాల్లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగా స్టార్ చిరంజీవి, మురళీమోహన్ జయసుధ తో పాటుగా యాక్టివ్ ప్రెసిడెంట్ బెనర్జీ, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, హేమ, రాజీవ్ కనకాల, శివబాలాజీ, అనితా చౌదరి , జయలక్ష్మి, కరాటే కళ్యాణి, ఏడిద శ్రీరామ్, రవి ప్రకాష్, టార్జాన్, పసునూరి శ్రీనివాస్, రాజా రవీంద్ర, ఆలీ సురేష్ కొండేటి ,తనీష్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Benerjee As Acting President For Movie Artists Association. Under Disciplinary Action Committee Naresh Sacked As President. Vice President Benerjee Acts As Acting President.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X