»   » 'బాహుబలి' ఓ స్టుపిడ్ సినిమా.. అంటూ

'బాహుబలి' ఓ స్టుపిడ్ సినిమా.. అంటూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'బాహుబలి' చిత్రం మేకింగ్ పరంగానే కాక కలెక్షన్స్ పరంగానూ దేశ,విదేశాల్లో రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఎక్కువ మందికి నచ్చింది కాబట్టే ఈ సూపర్ హిట్ అయ్యింది. ఇంత ఘన విజయం సాధించినా ఈ సినిమాలో ఆ లోపాలు ఉన్నాయి అనేవారు ఉన్నారు కానీ ఏకంగా సినిమాని స్టుపిడ్ అన్నవారు లేరు. తాజాగా సీనియర్ నటి జమున ఈ సినిమా ని స్టుపిడ్ అని వార్తలకు ఎక్కారు.

జమున మాట్లాడుతూ...'నేను సినిమాలు చూడటం మానేసి చాలా కాలమైంది. నా మనుమడి ప్రోద్బలంపై 'బాహుబలి' చూశాను. అదో స్టుపిడ్ సినిమా. సాంకేతిక విలువలు తప్ప సినిమాలో ఏమీ లేదు' అన్నారు జమున.


Senior actress Jamuna finds Baahubali 'a stupid film'

శనివారం ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమండ్రికి వచ్చిన ఆమె లోకల్ మీడియాతో నేటి సినిమాల తీరు తెన్నులు, ఆ రంగంలో తన జ్ఞాపకాలు తదితర అంశాలపై మాట్లాడారు.'బాహుబలి'లో ఒక్క హీరో పాత్ర తప్ప, మిగతా పాత్రల ఎంపిక సరిగా జరగలేదు. అనుష్కను హీరోయిన్‌గా ఎంపిక చేయాల్సింది అని అన్నారామె.


జమున మాట్లాడుతూ.. నా సినీ రంగ ప్రవేశం రాజమహేంద్రవరంలోనే జరిగింది. ప్రముఖ నాటక కళాకారులు గరికపాటి రాజారావు శిష్యురాలిగా 1953లో పుట్టిల్లు చిత్రంతో తెలుగు చిత్రాలకు పరిచయం అయ్యా. తర్వాత ఎందరో మహానుభావులతో కలిసి నటించి దాదాపు 200 వరకు చిత్రాలను పూర్తిచేశా. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నాను అన్నారు.


Senior actress Jamuna finds Baahubali 'a stupid film'

రాజకీయాల గురించి మాట్లాడుతూ... 1989లో పార్లమెంటు సభ్యురాలిగా రాజమండ్రి నుంచీ పోటీచేసి విజయం సాధించటం ఎప్పటికీ మరిచిపోలేను. ఇంటింటికి వెళ్లి నాకు ఓటు వేయండి మీచెంతనే ఉంటూ మీకష్టసుఖాల్లో పాలు పంచుకుంటాను అంటూ అడిగిన నాకు 50 వేలకు పైగా మెజారిటీతో ఓట్లువేసి గెలిపించారు. నామాట ప్రకారం గెలిచాక ఇక్కడే నివాసం ఉంటూ అందరి ఆదరాభిమానాలు పొందా. ఆడపడుచుగా ఆదరించిన రాజమహేంద్రవరం నా పుట్టిల్లుగానే భావిస్తా.


లక్షలు ఖర్చుపెట్టి పదవిని గెలుచుకుని కోట్లు గడించటం నాకు చేతకాదు. నీతిగా, నిజాయతీగా చిన్న మచ్చకూడా లేకుండా పనిచేశాను. ఆ తృప్తి నాకు చాలు. డబ్బు సంపాదనకు రాజకీయాలకు రాలేదు కాబట్టి ప్రజలు ఎంతో నమ్మకంతో ఆనాడు నాకు కట్టబెట్టిన పదవిని న్యాయంగా కాపాడుకుని మంచి పాలన అందిస్తున్నారు. నా ప్రజల కష్టసుఖాల్లో ఇచ్చిన మాటప్రకారం నడుచుకున్నా. నిజాయతీకి మారుపేరు జమున అంటూ ఇక్కడి ప్రజలు ఇచ్చిన అమూల్యమైన బిరుదు నాకు ఎప్పటికీ అద్భుతంగా గుర్తుపెట్టుకుంటూ రుణపడి ఉంటా అని చెప్పుకొచ్చారు.

English summary
Senior actress Jamuna has expressed her feelings on the blockbuster action epic Baahubali film which broke many records in the history of Indian cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu