»   » ప్రగతి, పవిత్రలను చూస్తే జాలేస్తున్నది.. నాగార్జున అంటే ఇష్టం.. సీనియర్ నటి సుధ

ప్రగతి, పవిత్రలను చూస్తే జాలేస్తున్నది.. నాగార్జున అంటే ఇష్టం.. సీనియర్ నటి సుధ

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో అమ్మ పాత్రలకు, వదిన, అక్క పాత్రలకు సీనియర్ నటి సుధ పెట్టింది పేరు. తెలుగు సినిమాల్లో ఆమె పోషించిన పాత్రల కారణంగా సుధ ప్రతీ ఇంట్లో సభ్యురాలిగా మారిపోయారు. మీడియాకు దూరంగా ఉండే సుధ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడారు. పాత్రకు ప్రాధాన్యం లేకపోతే నటించడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే సినిమాల్లో ఎలాంటి ప్రాధాన్యం లేని పాత్రలను అంగీకరించడం లేదని ఆమె తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తల్లి పాత్రలు వేసే వారిని చూస్తే ..

తల్లి పాత్రలు వేసే వారిని చూస్తే ..

ప్రాధాన్యం లేని తల్లి పాత్రలు చేస్తున్న ప్రగతి, పవిత్ర లోకేశ్, తులసి లాంటి వారిని చూస్తే జాలేస్తుంది. కేవలం అవకాశం కోసం ప్రాధాన్యం లేని పాత్రలను వారు చేయడం చూస్తే బాధగా ఉంటుంది. నేను చేసిన పాత్రలు ప్రగతి, పవిత్ర, తులసి చేశారా? హీరోయిన్‌గా ఉన్న నదియా తల్లి పాత్రలు వేస్తున్నది. ఆమెకు ప్రతీ చిత్రం అత్తారింటికి దారేది కాదుగా. వారి వల్ల అవకాశాలు రావడం లేదనడం సరికాదు. కొత్తగా తల్లి పాత్రలు వేస్తున్న వాళ్లు నా పోటీ కాదు అని సుధ చెప్పారు. ఇలా చెప్పడం వల్ల నాకు పొగరు అనుకొంటారు. కానీ అది నాకు కాన్ఫిడెన్స్‌గా ఉంటుంది.

నాగార్జున కోసం..

నాగార్జున కోసం..

శ్రీమంతుడు సినిమా కోసం ఆఫర్ ఇచ్చారు. కానీ నాకు నటించడం ఇష్టం లేక వదులుకొన్నాను. నాగార్జున కోసం నమో వెంకటేశాయ చిత్రంలో నటించాను. కేవలం ఓ పక్కకు నిలబడే పాత్రల్లో కొందరు సినిమాల్లో నటిస్తున్నారు. వారికి ఉండే సమస్యల వాళ్ల అలాంటి పాత్రలు చేస్తు ఉండవచ్చు అని తెలిపారు.

నాగార్జున చాలా క్లోజ్

నాగార్జున చాలా క్లోజ్

నాకు చిరంజీవి ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. కానీ నాకు నాగార్జున ఫ్యామిలీ చాలా క్లోజ్. 1991లో చనిపోయే దశలో ఉండగా నన్ను కాపాడారు. అందుకే నాగార్జున అంటే చాలా ఇష్టం అని సుధ వెల్లడించారు. నాగార్జున సినిమాలో చిన్న వేషమైనా సరే నేను చేస్తాను అని అన్నారు.

ఉదయ్ కిరణ్ మృతిని తట్టుకోలేకపోయాను..

ఉదయ్ కిరణ్ మృతిని తట్టుకోలేకపోయాను..

ఈ మధ్య నాకు సన్నిహితంగా ఉన్న సినీ ప్రముఖులు మరణించడం నన్ను చాలా బాధపడ్డింది. అందులో ఉదయ్ కిరణ్, బాలచందర్ మృతితో తట్టుకోలేకపోయాను. బాలచందర్ మరణించడం చూసి సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడ్చారు. ఉదయ్ కిరణ్ నాకు కొడుకు లాంటి వాడిని. మ్యారేజ్ ఆగిపోయినప్పుడు ఉదయ్ కిరణ్ వచ్చి ఏడ్చాడు. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత అతడ్ని నా కొడుకుగా దత్తత తీసుకొంటే బాగుండేదేమో అని బాధపడ్డాను అని సుధ చెప్పారు.

మీడియా అంటే..

మీడియా అంటే..

మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం నాకు అలవాటు లేదు. సినిమా పరిశ్రమలో కొందరు చెప్పిన విషయాల వల్ల మీడియాకు దూరంగా ఉన్నాను. మీడియా వాళ్లు లేని పోని ప్రశ్నలు అడుగుతుంటారని కొందరు భయపెట్టారు అని సుధ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ పూర్తి భాగం త్వరలో ప్రసారం కానున్నది. ఇటీవల దానికి సంబంధించిన ప్రోమోను ఐ డ్రీమ్ మీడియా విడుదల చేసింది. ఆ ప్రోమోలో ఆసక్తికరమైన విషయాలను ఆమె వెల్లడించారు.

English summary
Senior Actress Sudha known for Mother characters in tollywood. She acted as mother for many tollywood big stars. Sudha Said that Actor Nagarjuna family is very close to her. she expressed grief over Uday Kiran, and director Balachander's death.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu