»   » వద్దని చెప్పినా ఇద్దరూ వినలేదు... సావిత్రి మోసపోయింది, శ్రీదేవి మోసపోలేదు!

వద్దని చెప్పినా ఇద్దరూ వినలేదు... సావిత్రి మోసపోయింది, శ్రీదేవి మోసపోలేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మరణం ఇండియన్ సినీ పరిశ్రమను విషాదంలో నెట్టివేసింది. ఆమె మరణం తర్వాత ఆమె జీవితాన్ని చాలా దగ్గరినుండి పరీశీలించిన పలువురు అతిలోక సుందరికి సంబంధించిన అనేక విషయాలు మీడియాతో పంచుకుంటున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు తన వృత్తిలో భాగంగా అప్పట్లో శ్రీదేవిని కలుస్తుండేవారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.

 శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మ గురించి

శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మ గురించి

శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మ ఆర్టిస్టు అవ్వాలని మద్రాసు వచ్చారు. శ్రీదేవి ఎంత అందంగా ఉండేవారో రాజేశ్వరమ్మ కూడా అంతే అందంగా ఉండేవారు. అప్పట్లో ఆమె సినిమాల్లో గ్రూఫు డాన్సర్‌గా చేసే వారు. ఆ సమయంలో ఆమె ఏదో ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటే మద్రాసులో లాయర్‌గా ఉండే అయ్యప్పన్ ల్ప్ చేశారు. అలా రాజేశ్వరమ్మ-అయ్యప్పన్ మధ్య పరిచయం పెళ్లికి వరకు వెళ్లింది అని పసుపులేటి రామారావు తెలిపారు.

బోని కపూర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంతే ? బంధువులతో శ్రీదేవి గోడు!
రాజేశ్వరమ్మ కూడా రెండో భార్యగానే...

రాజేశ్వరమ్మ కూడా రెండో భార్యగానే...

అయ్యప్పన్ గారికి అప్పటికే మ్యారేజ్ అయి పిల్లలు ఉన్నారు. అయినా రాజేశ్వరమ్మను రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో భార్య అయినా అయ్యప్పన్ గారు రాజేశ్వరమ్మను ఎంతో గౌరవంగా చూసుకునేవారు.... అని పసుపులేటి తెలిపారు.

 శ్రీదేవి అంత పెద్ద ఆర్టిస్టు అయిందంటే కారణం రాజేశ్వరమ్మే

శ్రీదేవి అంత పెద్ద ఆర్టిస్టు అయిందంటే కారణం రాజేశ్వరమ్మే

శ్రీదేవి అంత పెద్ద ఆర్టిస్టుగా ఎదిగిందంటే అందుకు కారణం తల్లి రాజేశ్వరమ్మే. తన కూతురును హీరోయిన్ చేయాలనే చిన్నప్పటి నుండి ఆమె ఆ విధంగా పెంచారు. ఒక తల్లిగా, గైడ్‌గా, పీఆర్వోగా అన్నీ తానై శ్రీదేవిని పెంచారు అని పసుపులేటి తెలిపారు.

శ్రీదేవి చిన్నప్పటి నుండి చాలా సాఫ్ట్

శ్రీదేవి చిన్నప్పటి నుండి చాలా సాఫ్ట్

శ్రీదేవి చిన్నప్పటి నుండి చాలా సాఫ్ట్. షూటింగుల్లో, సెట్స్ లో అరవటం కానీ, కోపంతో బీపీ తెచ్చుకోవడం, గొడవ పడటం లాంటివి ఏమీ చేసేదికాదు. డైరెక్టర్ చెప్పింది చేయడం వెళ్లడం తప్ప సెట్లో ఇతరులతో పిచ్చాపాటిగా మాట్లాడటం లాంటివి కూడా చేసేవారుకాదు. శ్రీదేవి పైకి రావడానికి ఆమె టాలెంటు, అందంతో పాటు వినయవిధేయతలే కారణం... అని తెలిపారు.

 అక్కడికి వెళ్లాకే ఇగో ప్రాబ్లమ్స్

అక్కడికి వెళ్లాకే ఇగో ప్రాబ్లమ్స్

ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నపుడు ఇగో ప్రాబ్లమ్స్ ఉండటం సహజం. శ్రీదేవి అలా ఉండేవారు కాదు. జయప్రద, జయసు చాలా మందితో ఆమె కలిసి చేసింది కానీ ఎవరితో గొడవలు పెట్టుకోలేదు. జయప్రదతో చిన్న ఇగో ప్రాబ్లం హిందీ ఫీల్డుకు వెళ్లిన తర్వాత ఏర్పడింది. తెలుగులో ఉన్నపుడు ఇద్దరూ బాగానే ఉండేవారు. తర్వాత తర్వాత నెమ్మదిగా వారి సమస్య తీరిపోయింది.... అని రామారావు తెలిపారు.

మిథున్ చక్రవర్తితో ప్రేమ నిజమే, కానీ పెళ్లి...

మిథున్ చక్రవర్తితో ప్రేమ నిజమే, కానీ పెళ్లి...

శ్రీదేవి బొంబాయి వెళ్లిన తర్వాత ఆమె మొదట ప్రేమలో పడింది మిథున్ చక్రవర్తితోనే. వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. అయితే వాళ్ల అమ్మ రాజేశ్వరమ్మ వ్యతిరేకించింది. నీ కెరీర్ పాడవుతుంది అని ఆమె గట్టిగా చెప్పడంతో వారి పెళ్లి ఆగిపోయింది. కొంత మంది మిథున్ చక్రవర్తితో పెళ్లి అయిందని అంటుంటారు. నాకు తెలిసి రాజేశ్వరమ్మ చెప్పిన దాని ప్రకారం వారిద్దరికీ పెళ్లి కాలేదు.... అని రామారావు తెలిపారు.

హిందీ రాక చాలా ఇబ్బంది పడింది

హిందీ రాక చాలా ఇబ్బంది పడింది

సౌత్‌లో శ్రీదేవి పాపులర్ అయిన తర్వాత హిందీ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. దీంతో తరచూ బొంబాయికి వెళుతూ వస్తుండేవారు. అప్పట్లో శ్రీదేవికి హిందీ మాట్లాడటం రాదు. వాళ్ల అమ్మగారైన రాజేశ్వరమ్మకు అసలు హిందీ తెలియదు. దీంతో తల్లిని తీసుకుని బొంబాయి వెళ్లడం రావడం, అక్కడ హోటల్ లో ఉండటం లాంటి వాటితో పాటు బాష పరంగా చాలా ఇబ్బంది పడేవారు. అనిల్ కపూర్ తో సినిమా చేస్తున్న సమయంలో ఈ బాధలన్నీ అతడితో చెప్పుకుంది. దీంలో అనిల్ కపూర్ వాళ్ల అన్నయ్య బోనీ కపూర్‌తో మాట్లాడి ఆమె బొంబాయి వచ్చినప్పుడల్లా వాళ్ల సినిమా ఆఫీసులోనే ఉండేలా ఏర్పాటు చేయించారు. అక్కడ శ్రీదేవి కోసం తెలుగు తెలిసిన గైడ్ ను కూడా నియమించారు.... అని పసుపులేటి తెలిపారు.

అలా శ్రీదేవి జీవితంలోకి బోనీ

అలా శ్రీదేవి జీవితంలోకి బోనీ

శ్రీదేవి బొంబాయి వచ్చినప్పుడల్లా తమ ఆఫీసులో ఉంటుండటంతో శ్రీదేవి, బోనీ కపూర్ మధ్య పరిచయం బాగా పెరిగింది. అదే సమయంలో శ్రీదేవికి బోనీ గైడెన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ సినిమా చేయొద్దు, వీరితో చేస్తే ఇబ్బంది పడతారు లాంటి సలహాలు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ ఏర్పడింది. చివరకు అది పెళ్లి వరకు వెళ్లింది. వీరి పెళ్లికి రాజేశ్వరమ్మ ఒప్పుకోలేదు. ఇక్కడ మన తెలుగు ఆర్టిస్టులు కూడా రెండో పెళ్లి వాడిని చేసుకోవద్దని సలహా ఇచ్చారు.... అని పసుపులేటి తెలిపారు.

 సావిత్రి మోస పోయింది, కానీ శ్రీదేవి బెటర్

సావిత్రి మోస పోయింది, కానీ శ్రీదేవి బెటర్

సావిత్రి విషయంలో జరిగినట్లే శ్రీదేవి విషయంలో జరిగింది. అప్పట్లో సావిత్రి కూడా అప్పటికే పెళ్లయిన జెమిని గణేశన్ ను పెళ్లి చేసుకుంటానంటే...రామారావుగారు, నాగేశ్వరరావు గారు వద్దని చెప్పారు. కానీ ఆమె వినలేదు. సావిత్రి, శ్రీదేవి ఇద్దరూ అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. అయితే సావిత్రి అక్కడ మోసపోయింది. ఇక్కడ బోనీ కపూర్ గారు శ్రీదేవిని బాగానే చూసుకున్నారు... అని పసుపులేటి తెలపారు.

 అపుడు శ్రీదేవి చాలా అప్‌సెట్

అపుడు శ్రీదేవి చాలా అప్‌సెట్

తల్లి మరణమే శ్రీదేవిని చాలా కృంగిపోయేలా చేసింది. ఆ సమయంలో చాలా అప్ సెట్ అయ్యారు. తల్లిని ఆమె అంతగా ప్రేమించింది. చిన్నప్పటి నుండి శ్రీదేవికి తల్లి రాజేశ్వరమ్మే అన్నీ చూసుకునేది. సడెన్ గా తన జీవితం నుండి తల్లిదూరం అవ్వడం ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో పూర్తిగా బోనీ కపూర్ మీద ఆధార పడాల్సి వచ్చింది. బోనీ కపూర్ సినిమాలు చేసి నష్టపోతే శ్రీదేవి తన సంపాదించిన ఆస్తులు అమ్మి, తాను మళ్లీ సినిమాలు చేసి ఆదుకోవడం జరిగింది. బోనీ ఫ్యామిలీకి శ్రీదేవి చాలా హెల్ప్ చేసింది. తన ఇద్దరు పిల్లలను తనంత ఆర్టిస్టును చేయాలనేది శ్రీదేవి యాంబిషన్. ఆ విధంగానే ఆమె వారిని పెంచింది... కానీ కూతురును తెరపై చూసుకోకుండానే వెళ్లి పోవడం బాధాకరం అని పసుపులేటి తెలిపారు.

English summary
Senior Journalist Pasupuleti Ramarao revealed some interesting facts about Actress Sridevi and Savitri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu