Just In
- 8 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 17 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 58 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
మహ్మద్ సిరాజ్‌కు నాతో చీవాట్లు తినడం ఇష్టం: టీమిండియా బౌలింగ్ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ నగల వల్లే ఫ్యామిలీలో పెద్ద గొడవ, అన్నీ మూటగట్టుకుని వచ్చేశారు: ఎన్టీ రామారావు డ్రైవర్ లక్ష్మణ్
ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు విడుదలైన తర్వాత రామరావు జీవితంలో బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు ప్రజలకు తెలిశాయి. ఈ క్రమంలో ఎన్టీ రామారావుకు సన్నిహితంగా ఉండే వారు సైతం మీడియా ముందుకు వచ్చి అప్పట్లో జరిగిన పలు విషయాలనుపంచుకునే ప్రయత్నం చేశారు.
ఎన్టీ రామరావు వద్ద చాలా కాలం పాటు డ్రైవర్‌గా పని చేయడంతో పాటు ఆయన చైతన్యరథం నడిపిన లక్ష్మణ్ తాజాగా ఓ ఛానల్‌తో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు జీవితంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురి కావడానికి దారి తీసిన సంఘటనల గురించి వివరించారు.

ఎన్టీఆర్ కపటం లేని మనిషి
ఎన్టీ రామారావు కపటం లేని మనిషి, రాజకీయం పెద్దగా తెలియదు. ఆయన అంత పాపులర్ కావడానికి ఆయన స్వభావం కూడా ఓ కారణమని లక్ష్మణ్ తెలిపారు. ఆయన అంత మంచి మనిషి కాబట్టే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు.

మనది కూడా తప్పు ఉన్నది కదా సార్ అన్నాను
అధికారం వచ్చిన కోల్పోయిన తర్వాత పెద్దాయన(ఎన్టీఆర్) ఒకసారి బాబుగారి పాలన ఎలా ఉంది అని అడిగారు. ‘నాకేం తెలుసు సర్' అన్నాను. ‘నువ్వు బయట తిరుగుతావు కదా లచ్చన్నా అందుకే అడిగాను' అన్నారు. ‘ఆయన రాజకీయ చాణక్యుడు సార్, బాగానే చేస్తాడు... మనది కూడా తప్పు ఉన్నది కదా సర్' అని తాను చెప్పినట్లు లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు.

నేను అలా అనడంతో బాధపడ్డారు
‘రావణా సురుడు సీతను తీసుకెళ్లి లంకలో పెట్టుకుని సర్వనాశనం అయిపోయాడు. అలాగే మీరు ఈవిడ(లక్ష్మి పార్వతి)ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పేరు పొగొట్టుకున్నారు సార్' అన్నాను. నేను ఈ మాట అనగానే.. ‘అనండి లచ్చన్నా అందరూ అనండి, మీరు ఒక్కరే అనలేదనుకున్నా.. ఇప్పుడు మీరు కూడా అన్నారు' అంటూ బాధ పడ్డారు. పెద్దాయనకు అధికారం పోయింది, ఆ తర్వాత ఆరోగ్యం పాడైందనే బాధతో తాను అలా అన్నట్లు లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు.

అమ్మగారి నగల విషయంలోనే అసలు గొడవ
లక్ష్మి పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత కుటుంబం అంతా సరే అని అంగీకరించారు. కానీ మా అమ్మ ఎలా ఉందో అలాగే ఉండాలని షరతు పెట్టారు. అసలు గొడవ అమ్మగారి(బసవతారకం) బంగారు నగల విషయంలోనే జరిగిందని లక్ష్మణ్ తెలిపారు.

సొమ్ములన్నీ మూటగట్టుకుని వచ్చారు
ఆ నగలన్నీ అబిడ్స్‌లోని ఇంట్లో ఉండేవి. ఆ ఇల్లు అప్పుడు రామకృష్ణ అండర్లో ఉండేది. ఒకసారి పద లచ్చన్నా అంటూ అబిడ్స్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడికి వెళితే రామకృష్ణ బాబు లేడు బెంగుళూరు పోయారని చెప్పారు. మూడో అంతస్తులో ఉన్న గదికి తాళం వేసి ఉండటంతో తాళం చెవి చేసేవాడిని తీసుకురమ్మంటే తీసుకొచ్చాను. తాళం రెడీ అయ్యాక అతడిని దింపేసి వచ్చేయమంటే వెళ్లాను. నేను తిరిగి వచ్చేసరికి పెద్దాయన తన కండువాలో సొమ్ములన్నీ మూటగట్టుకుని కిందకు వచ్చారు... అని లక్ష్మణ్ తెలిపారు.

మా అమ్మ నగలు ఆవిడకు ఇవ్వమని చెప్పారు
మర్నాడు రామకృష్ణ బాబు విషయం తెలుసుకుని అందరికీ చెప్పడంతో కుటుంబం మొత్తం వాలిపోయింది. పెద్ద గొడవ జరిగింది. మా అమ్మ సొమ్ము ఒక్కటి కూడా ఆవిడకు ఇవ్వమని చెప్పేశారు. అంతకు రెండింతలు తయారు చేసి ఇచ్చుకో కానీ మా అమ్మ నగలు ఇవ్వమని తెగేసి చెప్పారు.

ఈ గొడవలో లోకమ్మ కొట్టింది
అప్పుడే మద్రాసు నుంచి వచ్చిన లోకమ్మ ఈ గొడవలో రఫారఫ్ లక్ష్మీపార్వతి కొట్టేసింది. ఆ సమయంలో సార్‌ను పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు ఏమీ అనలేదు. వారికి అంత ధైర్యం లేదు... అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.

అలా లక్ష్మీ పార్వతి, ఆమె భర్త వచ్చారు
మాకు ఏదైనా టీవీలో ఛాన్స్ ఇప్పించండి. టీవీలో హరికథలు చెబుతామని లక్ష్మిపార్వతి, వీరగంధం సుబ్బరావు వస్తే... దూరదర్శన్‌లో అవకాశం ఇప్పించారు. అలా ఆమె ఎన్టీఆర్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత ఆయన జీవితంలోకి వచ్చిందని లక్ష్మణ్ వెల్లడించారు.

ఆమె వల్లే పిల్లలు, కోడళ్లు అంతా పెద్దాయనకు దూరం అయ్యారు
లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడటమే దండగ. ఆమె వల్లే పిల్లలు, కోడళ్లు అంతా పెద్దాయనకు దూరం అయ్యారు. మొదలే వారు దూరం.. డబ్బు అవసరం ఉంటేనే వచ్చేవారు. ఈవిడ వచ్చిన తర్వాత వారు మొత్తానికి రావడం మానేశారని లక్ష్మణ్ తెలిపారు.