»   » కమల్ బాటలో షారుక్.. సినిమా కథ, పాత్ర తెలిస్తే షాకే.. బడ్జెట్ 150 కోట్లు!

కమల్ బాటలో షారుక్.. సినిమా కథ, పాత్ర తెలిస్తే షాకే.. బడ్జెట్ 150 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందించబోయే ఈ చిత్ర బడ్జెట్ రూ.150 కోట్లు. ఇప్పటికే షారుక్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్‌గా ఖరారైంది. ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు బాలీవుడ్‌లో సంచలనంగా మారాయి.

మరుగుజ్జుగా షారుక్

మరుగుజ్జుగా షారుక్

ప్రయోగాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో షారుక్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షారుక్ ఈ చిత్రంలో మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారట. ఈ చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషనల్ నిర్మించనున్నది.

బడ్జెట్ రూ.150 కోట్లు

బడ్జెట్ రూ.150 కోట్లు

ఇంకా ఈ చిత్రానికి పేరు పెట్టలేదు. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఈ చిత్రం సుమారు రూ.150 కోట్లు ఉండవచ్చు అని దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెలిపారు.

అద్బుతమైన లవ్ స్టోరి

అద్బుతమైన లవ్ స్టోరి

మరుగుజ్జుల కథతో ఈ చిత్రం రూపొందించనున్నాం. ఈ కథలో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ఇది అద్భుతమైన లవ్ స్టోరి. ఇప్పటిలానే షారుక్ సినిమాల్లో మాదిరిగానే పాటలు, డ్యాన్సులు ఉంటాయి. అవి లేకపోతే షారుక్ సినిమాకు అర్థం ఉండదు అని ఆనంద్ రాయ్ మీడియాకు వెల్లడించారు.

రెడ్ చిల్లీస్ సహకారం

రెడ్ చిల్లీస్ సహకారం

గ్రాఫిక్‌కు సంబంధించిన పనుల్లో షారుక్ ఖాన్ సొంత సంస్థ రెడ్ చిల్లీస్ లోని వీఎఫ్ఎక్స్ టీమ్ భాగం కానున్నది. షారుక్ సినీ జీవితంలో ఇంత మొత్తంలో సినిమా నిర్మించడం ఇదే తొలిసారి.

గతంలో మరుగుజ్జుగా కమల్

గతంలో మరుగుజ్జుగా కమల్

గతంలో సినీ తెరమీద మరుగుజ్జు పాత్రలో కమల్ హాసన్ నటించారు. విచిత్ర సోదరులు చిత్రంలో మరుగుజ్జుగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అన్నివర్గాల ప్రజలు ఆదరించడంతో భారీ విజయాన్ని దక్కించుకొన్నది. దాదాపు 20 ఏండ్ల తర్వాత మరోసారి మరుగుజ్జు పాత్రతో సినిమా రాబోతున్నది.

ఇంతియాజ్ అలీ సినిమాలో

ఇంతియాజ్ అలీ సినిమాలో

ప్రస్తుతం ఇంతియాజ్ అలీ దర్వకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ లవ్ స్టోరి చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రాగ్‌లో షూటింగ్ జరుగుతున్నది. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో పూర్తి చేసుకొని ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నది. ఈ చిత్రంలో అనుష్క శర్మ జంటగా నటిస్తున్నారు.

English summary
Filmmaker Anand L Rai gearing with big budget movie with Bollywood badshah Shahrukh Khan. Shah Rukh Khan playing a dwarf and would be produced under the banner of Eros International.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu