»   » అసభ్యంగా,బూతులతో కామెంట్స్ ,సూసైడ్ చేసుకోవాలనిపిస్తోంది, హీరోయిన్ ఆవేదన

అసభ్యంగా,బూతులతో కామెంట్స్ ,సూసైడ్ చేసుకోవాలనిపిస్తోంది, హీరోయిన్ ఆవేదన

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరువనంతపురం: రీసెంట్ గా తెలుగులో ఆర్పీ పట్నాయిక్ హీరోగా 'మనలో ఒకడు' అనే చిత్రం వచ్చింది. అందులో ఆర్పీ ఓ లెక్చరర్ గా కనిపిస్తారు. ఆయన గురించి మీడియాలో ఓ న్యూస్ వస్తుంది. లెక్చరర్ గా ఉన్న ఆయన ఓ స్టూడెంట్ తో అసభ్యంగా బిహేవ్ చేసారని. దాన్ని మీడియా హైలెట్ చేస్తుంది. దాంతో ఆ లెక్చరర్, కెరీర్ జీవితం సర్వ నాశనం అవుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్దితే ఓ నటి కి నిజ జీవితంలో ఎదురైంది.

తమ పేరుతో ఉన్న వేరే నటుల వల్ల హీరోయిన్స్ కు ఒక్కోసారి సమస్యలు ఎదురౌతూంటాయి. వారు ఏదైనా సమస్యల్లో ఇరుక్కూంటే వీరేనేమో అనుకుని జనం, మీడియా పొరబడే అవకాసం ఉంది. ఇప్పుడు మళయాళి నటి అమల రోజ్ కురియన్ కి అదే సమస్య వచ్చింది.

మళయాళ సీరియల్ నటి అమల .. కేరళలలో వ్యభిచారం కేసులో పట్టుబడింది. అయితే అమల వ్యభిచారం కేసులో పట్టుబడింది అని మీడియాలో వార్తలు గుప్పుమనటంతో జనం..అంతా ఈమెను అనుకుంటున్నారట. దాంతో ఆమె నేను కాదు..ఆ పట్టుబడింది వేరే అని వివరణ ఇచ్చుకునే పరిస్దితికి వచ్చింది అమలా రోజ్ కురియన్. దాంతో ఆమె ఈ ఫేస్ బుక్ పోస్ట్ పెట్టింది.

ఈ పోస్ట్ తెలుగు అనువాదం ఏమిటీ అంటే..

నా సూసైడ్ వార్త మీకు కావాలా

నా సూసైడ్ వార్త మీకు కావాలా

ఈ పోస్ట్ లో ఆమె... అమలా రోజ్ కురియన్ సూసైడ్ అనే వార్తను మీరు చూడాలనుకుంటున్నారా అనే హెడ్డింగ్ తో మొదలెట్టింది. డియర్ ఫ్రెండ్స్ ఈ వార్తను మీరు వినటానికి వెయిట్ చేస్తున్నారా. అని సూటిగా ప్రశ్నించింది.

అపార్దం చేసుకోకండి ప్లీజ్

అపార్దం చేసుకోకండి ప్లీజ్

మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన సింపుల్ గర్ల్ ని నేను. కేవలం నేను నా నటన మీద ఇంట్రస్ట్ తోనే ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాను. నన్ను మీరు అపార్దం చేసుకునే వార్తల వల్ల నాలో ఆ ఆసక్తి చనిపోతుంది. దయచేసి అర్దం చేసుకోండి అని ఆ పోస్ట్ లో రాసింది.

వారం నుంచీ నా పరిస్దితి

వారం నుంచీ నా పరిస్దితి

గత వారం రోజులుగా ఈ వార్త వల్ల నాకు సరిగా నిద్ర కూడా పట్టడం లేదు అని ఆమె తెలియచేసింది. నిజానికి అలాంటి సిట్యువేషన్ ఉన్నవారి మానసిక పరిస్దితి అలాగే ఉంటుందనేది నిజం. తనకు సంభందం లేని నింద పడితే ఎవరు మాత్రం తట్టుకోగలరు చెప్పండి.

ఫోన్ వస్తే భయం

ఫోన్ వస్తే భయం

నేను భయపడుతున్నాను..ఏ ఫోన్ కాల్ వచ్చినా, నా స్నేహితుల నుంచైనా, నా కుటుంబ సబ్యుల నుంచైనా అంటూ ఆమె చాలా దీనంగా వేడుకుంది. ఎందుకంటే ఆ ఫోన్ లో వారేమి అడుగుతారో..తాను వివరణ ఎలా ఇచ్చుకోవాలో అనేది చాలా భాధిస్తోంది ఆమెను.

మెసేజ్ లు వస్తూంటే

మెసేజ్ లు వస్తూంటే

నేను గత కొద్ది రోజులుగా వాట్సప్ కూడా ఓపెన్ చెయ్యటం లేదంటే నమ్మరు. అలాగే మెసెంజర్ కూడా. చాలా మంది నాకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతూ వేధిస్తున్నారు. దారుణంగా ఉంది నా పరిస్దితి అందామె.

అదృష్టం బాగుండి

అదృష్టం బాగుండి

అయితే కొద్ది మంది మాత్రం నన్ను నమ్మి , నాకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. మీడియాలోనూ, ఫేస్ బుక్ లోనూ వారు యాక్టివ్ గా నాపై పడిన అనసవరమైన నిందను రూపుమాపేందుకు కృషి చేస్తున్నారు. వారందరికీ ధాంక్స్ అని చెప్పారామె.

ఇష్టం వచ్చినట్లు

ఇష్టం వచ్చినట్లు

ఎవరైతే పొరపాటున నా పేరుని, పోటోని వాడారో వారు ఇప్పటికైనా మేలుకుని ఆ విషయమై న్యాయం చేస్తే బాగుంటుంది. అలాగే నిజంగా వ్యభిచారమో, మరొకటో తప్పు చేసిన వారిని సమాజం, చట్టం శిక్షించినా న్యాయం అంతేకానీ నేను చేయని తప్పుకి నాకు ఈ శిక్షేంటి అన్నారామె.

ఇదే మీ సిస్టర్ కు జరిగితే..

ఇదే మీ సిస్టర్ కు జరిగితే..

నేను చేయని తప్పుకు నేను టార్చర్ అనుభవిస్తున్నాను. నేను ఎవరైతే అసలు నిజం తెలుసుకోకుండా నన్ను టార్గెట్ చేస్తున్నారో వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను..ఇదే పరిస్దితి మీ సోదరికి జరిగితే ఏంటి పరిస్దితి..అసలు నిజం తెలుసుకోవాలని అనిపించదా అని ఆవేదనగా ప్రశ్నించారు.

పేస్ బుక్ ఫ్రెండ్స్ కి ఓ రిక్వెస్ట్

పేస్ బుక్ ఫ్రెండ్స్ కి ఓ రిక్వెస్ట్

దయచేసి ఫేక్ న్యూస్ లు చదివి ఓ నిర్దారణకు రాకండి. సోషల్ మీడియాలో ఉన్న వారందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ కామెంట్లతో నన్ను తూట్లు పొడవకండి. నిజానిజాలు తెలుసుకోండి. నేను కూడా ఇక్కడ ప్రశాంతంగా బ్రతకాలనే అనుకుంటున్నాను అన్నారు.

సీరియల్ నటి కావటంతో

సీరియల్ నటి కావటంతో

దానికి తోడు అమలా రోజ్ కెరీర్ ప్రారంభ రోజుల్లో అనేక మళయాళ సీరియల్స్ లో నటించింది. దాంతో ఖచ్చితంగా ఈ అమలే అని జనం ఫిక్స్ అవుతున్నారట. ఆ సీరియల్ నటి అమల పెద్ద పాపులర్ కాదట. ఒకే పేరు ఉండటం వల్ల వచ్చిన తిప్పలు ఇవి.

ఫొటో కూడా పబ్లిష్ చేసేసి

ఫొటో కూడా పబ్లిష్ చేసేసి

నేను కాదు ..నన్ను తప్పు అర్దం మీరు చేసుకుంటున్నారు అని నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా నమ్మటం లేదట. దానికి తోడు కొన్ని మీడియా సంస్దలు ..ఆ వార్తను ఆమె ఫొటోతో పబ్లిష్ చేసాసి, కథనాలు ప్రచారం చేసాయి. ఇవన్నీ పెద్ద సమస్య అయ్యి కూర్చున్నాయి.

క్లారిఫికేషన్ కోసం

క్లారిఫికేషన్ కోసం

ఇక ఈ విషయమై త్వరలోనే అమలా రోజ్ కురియన్ ఓ మీడియా సమావేశం నిర్వహించి, ఇదీ విషయం అని చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కేరళ సిని పరిశ్రమ వారు సైతం ఆమెకు మోరల్ సపోర్ట్ గా నిలుస్తున్నట్లు సమాచారం. ఏదైమైనా ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన భాధ్యత మీడియాదే.

English summary
"Has Amala Rose Kurian committed suicide? Dear friends, is this the question all are awaiting to hear? I am a simple girl from a middle class family and my passion to act is the reason why I am still in the industry. Its been a week since I haven't properly slept and I am scared to attend to phone calls of my friends and family members [translated from Malayalam]," Amala writes on her Facebook page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu