twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడిపై ఎనిమిది మంది రేప్ ఆరోపణలు.. సెక్స్ కోసం ఏకంగా జర్నలిస్టుపై..

    By Rajababu
    |

    తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలపై ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ మోర్గాన్ ఫ్రీమాన్ వివరణ ఇచ్చారు. షూటింగ్ సమయాలలో ఎవరినీ కూడా నొప్పించలేదు, ఏ అమ్మాయిని కూడా లైంగిక వేధించలేదు అని ఫ్రీమాన్ అన్నారు. తమపై ఫ్రీమాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎనిమిది మంది సినీ ప్రముఖులు ఫిర్యాదు చేయడం తీవ్ర వివాదమైంది. ఆస్కార్ అవార్డు గ్రహీతైన మోర్గాన్ ఫ్రీమాన్‌పై ఆరోపణలు రావడం సినీ వర్గాల్లో చర్చానీయాంశమైంది.

    ఆరోపణలతో కుంగిపోయా

    ఆరోపణలతో కుంగిపోయా

    నాపై ఆరోపణలు రావడంతో కుంగిపోయాను. కన్నుమూసి తెరిచే లోపే 80 ఏళ్ల జీవితం, 50 ఏళ్ల కెరీర్ నాశనం అయింది. వారు చేస్తున్న ఆరోపణలను కూడా పట్టించుకోవాలి. వారి బాధను వినాలనేది నా అభిప్రాయం. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అని ఫ్రీమాన్ అన్నారు.

    జీర్ణించుకోలేకపోతున్నాను

    జీర్ణించుకోలేకపోతున్నాను

    నాపై లైంగిక ఆరోపణలు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. తమాషా కోసం ఈ ఆరోపణలు చేసినట్టు భావించడం లేదు. వీటి వెనుక చాలా తీవ్రమైన సమస్య ఉంది. నా ఆరోపణలపై నిగ్గు తేలాల్సిందే అని ఫ్రీమాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

    ఎవరికీ క్షమాపణ చెప్పను

    ఎవరికీ క్షమాపణ చెప్పను

    నాపై వచ్చిన ఆరోపణలకు సమాధానం లభించేంత వరకు నేను ఎవరికీ క్షమాపణ చెప్పను. నాతో పనిచేసే వారిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నాతో పడుకొంటేనే అవకాశం ఇస్తాను. లేదా పని కల్పిస్తాను అని ఎప్పుడు చెప్పలేదు. నాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు అని మోర్గాన్ అన్నారు.

    కఠిన చర్యలు తప్పవా?

    కఠిన చర్యలు తప్పవా?

    సీఎన్ఎన్ కథనం ప్రకారం.. మోర్గాన్ ఫ్రీమాన్‌పై మహిళా జర్నలిస్టులతోపాటు మరికొందరు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆయనపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. మోర్గాన్‌పై ఆరోపణలు నిజమని తేలితే స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ కఠిన చర్యలు తీసుకొనే అవకాశం ఉంది అని పేర్కొన్నది.

    మోర్గాన్ వ్యవహారం బయటపడింది ఇలా

    మోర్గాన్ వ్యవహారం బయటపడింది ఇలా

    కాగా, మోర్గాన్ ఫ్రీమాన్‌ వ్యవహారాన్ని సీఎన్ఎన్ జర్నలిస్టు బయటపెట్టింది. మోర్గాన్ చేష్టలపై ఆరోపణలు రావడంతో దానిని కవర్ చేయడానికి క్లో మేలాస్ వెళ్లింది. తన వద్దకు వచ్చిన మేలాస్‌ను కిందికి మీదకు ఓ సారి చూసి.. తన శరీరంపై కొన్ని ప్రదేశాల్లో తడిమడంతో అనుమానం మరింత బలపడింది. మాటలతో వేధించడం ప్రారంభించడంతో దానిని వీడియోలో బంధించింది.

    English summary
    Legendary actor Morgan Freeman, who has been accused of sexual harassment by eight women, has said he did not create unsafe work environment and he did not assault women. He said “I am devastated that 80 years of my life is at risk of being undermined, in the blink of an eye.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X