»   » దేముడా... మణిరత్నం సినిమాలో ఈ సెక్స్ సీన్స్ ఏంటి? రొమాన్స్ అంటూ సర్ది చెప్పుకోవటం ఏంటి?

దేముడా... మణిరత్నం సినిమాలో ఈ సెక్స్ సీన్స్ ఏంటి? రొమాన్స్ అంటూ సర్ది చెప్పుకోవటం ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: వినటానికి కాస్త వింతగానే ఉంటుంది. మణిరత్నం సినిమాలో సెక్స్ సీన్స్ అంటే అందరికీ ఆశ్చర్యమే. అయితే మణరత్నం డైరక్ట్ చేస్తున్న చిత్రంలోకి చెందిన మ్యాటర్ కాదు. మణిరత్నం నిర్మిస్తున్న చిత్రంలో సీన్స్ గురించి మాట్లాడేది.

మణిరత్నం డైరక్ట్ చేయగా హిట్టైన చిత్రం హిందీ రీమేక్ గురించి ఇప్పుడు చెప్పుకునేది. ఆ చిత్రంలో సెక్స్ సీన్స్ కట్ చేయకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయని బాలీవుడ్ మీడియా రచ్చ రచ్చ చేస్తోంది.

మణిరత్నం - కరణ్ జోహర్ నిర్మించిన 'ఓకే జాను' సినిమా నుంచి, రీసెంట్ గా ఒక ట్రైలర్ ను వదిలారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్ ను ట్రైలర్ లో చెప్పేశారు. 'ఓకే కన్మణి'తో పోలిస్తే కొన్ని సన్నివేశాల్లో ఘాటు ఎక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అయితే ఆ సీన్స్ తో పాటు మరిన్ని సన్నివేశాలు..సెక్స్ సీన్స్ ని తలిపించేవి ..సినిమాలో ఉన్నాయని,సెన్సార్ పరిధిలో అవి రొమాంటిక్ సీన్స్ గా ముద్రవేసుకుని మన ముందుకు వస్తాయని అంటున్నారు.

అక్కడా హిట్ అవుతుందనే..

అక్కడా హిట్ అవుతుందనే..

పూర్తి వివరాల్లోకి వెళితే...కొంతకాలం క్రితం మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన 'ఓకే కన్మణి' .. తెలుగులో 'ఓకే బంగారం' పేరుతో విడుదలైంది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమాను హిందీలో 'ఓకే జాను' పేరుతో రీమేక్ చేశారు. ఆదిత్యరాయ్ కపూర్ .. శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ సినిమాకి, షాద్ అలీ దర్శకత్వం వహించాడు.

భారీ రొమాంటిక్..

భారీ రొమాంటిక్..

'ఓకే బంగారం'లో లేని రొమాంటిక్ సన్నివేశాలను 'ఓకే జాను'లో భారీగా చూపించారు. ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ ల మధ్య భారీ రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సీన్స్ట్ పైనే దర్శక,నిర్మాతలు పూర్తి హోప్ పెట్టుకున్నారని చెప్తున్నారు. యూత్ ని ధియోటర్స్ కు పదే పదే రప్పించటంలో ఈ సీన్స్ సక్సెస్ అవుతాయని భావిస్తున్నారు.

నాలుగు కట్స్ మాత్రమే..

నాలుగు కట్స్ మాత్రమే..

బాలీవుడ్ మీడియా స్పాట్ బోయ్ ప్రకారం..ఓకే జాను చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమాకు కేవలం నాలుగు డైలాగు కట్స్ మాత్రమే ఇచ్చారు. అన్ని సెక్స్ సీన్స్, కిస్సింగ్ సీన్స్ సినిమాలో అలాగే ఉంచేసారు చెప్తున్నారు.

సెన్సార్ వదిలేసింది

సెన్సార్ వదిలేసింది

ఈ సెక్స్ సీన్స్, ముద్దుల సన్నివేశాలు వదిలేయటం చూస్తూంటే రొమాంటిక్ చిత్రాలకు సిబి ఎఫ్ సి కాస్తంత ఉదాశీనంగా లిబరల్ గా వెళ్తోందని అర్దం అవుతోందని చెప్తున్నారు. ఇది ఓ మంచి పరిణామంగా బాలీవుడ్ అభివర్ణిస్తోంది. రాబోయే రోజుల్లో మరన్ని రొమాంటిక్ సన్నివేశాలకు దర్శకులు స్వేచ్చగా అల్లుకునేందుకు ఈ సినిమా మార్గం వేస్తుందని చెప్తున్నారు.

కథలో భాగం కాబట్టే..

కథలో భాగం కాబట్టే..

అయితే కేవలం ఆ సన్నివేశాలు వదిలేయటానికి కారణం ...సిబిఎఫ్ సి...వాటిని కథలో భాగంగా భావించటమే అని చెప్తున్నారు. ఇంటిమేట్ సీన్స్ ని తొలిగిస్తే సినిమా కథ మొత్తం మారిపోతుందని భావించే పర్మిషన్ ఇచ్చారని, కొన్ని ప్రత్యేక సీన్స్ లో ఆ మాత్రం ఘాటు లేకపోతే సినిమా కథ అర్దమే మారిపోతుందని, అందుకే వదిలేసామని పేరు చెప్పటానికి ఇష్టపడనని ఓ సెన్సార్ సభ్యుడు వ్యాఖ్యానించాడు.

రీమిక్స్ చేసి ..

ముంబై చిత్రంలో సూపర్ హిట్ అయిన హమ్మా ..హమ్మా పాటని ఈ సినిమా కోసం రీమిక్స్ చేసి వినియోగించారు. ఆ పాట ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది.

మహేష్ ట్విట్టర్ లో ..

మహేష్ ట్విట్టర్ లో ..

ఆ మధ్యన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఓకే జాను చిత్రం ట్రైలర్‌ను చూశానని.. పూర్తిగా కనువిందు కల్గించేలా ఉందన్నారు. రవి కె. చంద్రన్‌ పనితనం అద్భుతంగా ఉందంటూ ఆయనకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి భారీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

నిత్యా,దుల్కర్ లాగ..

నిత్యా,దుల్కర్ లాగ..

ఈ సినిమా రీమేక్ కావటంతో అప్పడే పోలికలు మొదలయ్యాయి. నిత్యా, దుల్కర్ లాగ ఈ జంట చేస్తుందా.. మణిరత్నం రేంజిలో ఆ డైరక్టర్ సినిమాలో పీల్ ని పండించాడా..లీడ్ పెయిర్ లో ఆ మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందా వంటి అంశాలు సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి.

ఇదేకీలకాంశం

ఇదేకీలకాంశం

ముంబైలో కార్పోరేట్ సంస్ధలలో పనిచేస్తున్న ఆది,తార పోష్ లైఫ్ ని గడుపుతూంటారు. పెళ్లనే కాన్సెప్ట్ ని నమ్మని వీళ్లిద్దరూ ...అనుకోని పరిస్ధితుల్లో పరిచయమై...ఆ స్నేహం అనతికాలంలోనే ఏకాభిప్రాయాలతో బలపడి...సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్ షిప్)గా రూపాంతరం చెందుతుంది. అయితే తమ భవిష్యత్ కోసం వీరిద్దరూ వేరు వేరు దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్ధితి వస్తుంది. ఈ నేపధ్యంలో వీరు తమ బంధానికి ఫుల్ స్టాప్ చెప్తారా..లేక దాన్ని పెళ్లితో బలపరుచుకుంటారా అనేది కథలో కీలకాంశం.

భావోద్వాగాలే ప్రధానం...

భావోద్వాగాలే ప్రధానం...

ఓకే బంగారంలో ...దర్శకుడు మణిరత్నం కథ కంటే కూడా కథనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.నిజానికే ఇది పాత కథే. ఇందులోనే ప్రేమికుల భావోద్వేగాలను ఒడిసిపట్టి మెప్పించే ప్రయత్నం చేశాడు మణిరత్నం. పది రోజులల్లో విడిపోబోతున్నామనే జంట మధ్య సంఘర్షణను మాత్రం అతికొద్ది సన్నివేశాల్లో బలంగా చూపించాడు. ఆపై పెళ్లితో కథను సుఖాంతం చేశాడు. దీంతో.. సినిమాలో సీన్స్ కనిపిస్తాయే కానీ.. కథ అంటూ ఏదీ కనిపించదు. దీన్ని కొద్దిపాటి మార్పులతో హిందీలోకి తెరకెక్కించారంటున్నారు.

దుల్కర్‌ సల్మాన్‌, నిత్య మీనన్‌

దక్షిణాది భాషల్లో దుల్కర్‌ సల్మాన్‌, నిత్య మీనన్‌ జోడీ మంచి కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆదిత్య-శ్రద్ధ పెయిర్‌ కూడా ఇదే ప్రేమకథతో అభిమానుల మనస్సు దోచుకునేందుకు సిద్ధమవుతోంది.

ఉర్రూతలూగిస్తోంది

ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం, గుల్జార్‌ సాహిత్యంతో మణిరత్నం, కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఓకే జాను' ట్రైలర్‌, పాటలు ఆన్‌లైన్‌ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. దక్షిణాది ‘ఓకే బంగారం' కన్నా కాస్తా ఘాటు ఎక్కువైనట్టు కనిపిస్తున్న ‘ఓకే జాను' ట్రైలర్‌ నెటిజన్లను ఉర్రుతలూగిస్తోంది.

English summary
Ok Jaanu has been granted a U/A certificate with only 4 verbal cuts, keeping all the sex and kissing scenes intact. It seems that CBFC has started making a liberal approach towards romantic films. Having said that, it's a good sign that CBFC has finally understood that such intimate scenes are just a part of the story!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu