»   » పాక్ నటుల ఇష్యూ : రూ. 5 కోట్ల డీల్‌పై షబానా అజ్మీ ఘాటు వ్యాఖ్యలు

పాక్ నటుల ఇష్యూ : రూ. 5 కోట్ల డీల్‌పై షబానా అజ్మీ ఘాటు వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కరణ్ జోహార్ దర్శక నిర్మాణలో ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన 'యే దిల్ ముష్కిల్' అన్ని అడ్డంకులను తొలగించుకుని ఈ నెల 28 గ్రాండ్ గా రిలీజవుతోంది.

యూరీ ఘటన తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణ ఏర్పడటంతో, పాకిస్థాన్ నటులు ఉన్న సినిమాలను ఆడనివ్వమని, ఇకపై పాకిస్థాన్ నటులతో ఎవరూ సినిమాలు తీయొద్దంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్)తో పాటు పలు రాజకీయ పార్టీలు హెచ్చరించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో 'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో పాక్ నటుడు ఫావద్ ఖాన్ కీలక పాత్రలో నటించడంతో సినిమా ఇబ్బందుల్లో పడింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఏ ఆటంకాలు లేకుండా చిత్ర ప్రదర్శణ జరిగేట్టు చూస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు.

Shabana Azmi slams CM Fadnavis for buying 'patriotism for 5 cr'

మరో వైపు మహారాష్ట్రలో సినిమా ఎలాంటి ఇబ్బందిలో విడుదల కాకుండా ఉండేందుకు కరణ్ జోహార్ సీఎం ఫడ్నవీస్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేను కలిసారు. ఇకపై పాక్ నటులతో సినిమాలు చేయబోమని బాలీవుడ్ నిర్మాతల సంఘం తీర్మాణించింది. సీఎం, రాజ్ థాకరేతో చర్చల అనంతరం ప్రస్తుతానికి 'యే దిల్ హై ముష్కిల్' సినిమా విషయంలో మినహాయింపు ఇవ్వాలని, సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో రూ. 5 కోట్లు నికుల సంక్షేమ నిధికి అందజేస్తామని నిర్మాతలు ప్రకటించారు.

మరో వైపు ఇకపై ఎవరైనా పాక్ నటులతో సినిమాలు చేస్తే ఆర్మీ వెల్‌ఫేర్ ఫండ్ కింద రూ.5 కోట్లు ఇవ్వాలని ఎమ్‌ఎన్‌ఎస్ షరతు విధించింది. దీనిపై బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ ఘాటుగా స్పందించారు.

సీఎం ఫడ్నవిస్ సినిమాకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విడుదల చేయించాల్సిందిపోయి ఇద్దరి మధ్య రూ.5 కోట్లు బ్రోకరింగ్ డీల్ కుదుర్చడం ఏమిటని మండిపడ్డారు. సీఎం ఫడ్నవిస్ దేశభక్తిని రూ.5 కోట్లకు కొనుకున్నట్టా? అని నిలదీశారు.

English summary
Veteran actor Shabana Azmi has criticised Maharashtra Chief Minister Devendra Fadnavis, saying he “brokered deal” with Maharashtra Navnirman Sena (MNS) instead of enforcing law and order, amid the row around the release of Karan Johar’s Ae Dil Hai Mushkil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu