Don't Miss!
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- News
ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Shah Rukh Khan Jawan: అంచనాలు పెంచేస్తున్న అట్లీ- షారుక్ ఖాన్ 'జవాన్' టీజర్
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఆయన కుమారుడు డ్రగ్స్ కేసు నుంచి బయట పడడంతో పాటు ఆయన సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఓ వైపు ఆయన పఠాన్ సినిమా పనులు శరవేగంగా జరుగుతుండగా మరోవైపు తాజాగా ఆయన మరో సినిమా టైటిల్ ను ప్రకటించారు.
ఇప్పుడు షారుఖ్ ఖాన్ కొత్త సినిమా జవాన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. అలాగే ఒక వీడియో టీజర్ కూడా విడుదల చేశారు. ఈ వీడియో టీజర్‌లో షారుక్ ఖాన్ లుక్‌ను మేకర్స్ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ చాలా క్యూరియాసిటీని రేకెత్తించగా, షారుఖ్ ఖాన్ లుక్ కూడా చాలా థ్రిల్లింగ్‌గా కనిపిస్తోంది.
ఇందులో షారుఖ్ ఖాన్ ఏదో మిషన్ కోసం రెడీ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. ముఖం మొత్తం దెబ్బలతో, రక్తంతో నిండిపోయి కనిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తను అనుకున్న పనిని పూర్తి చేయడానికి బయలుదేరినట్లు వీడియోలో చూపించారు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, షారుఖ్ గెటప్ మొత్తం అన్నీ కలిపి ఈ వీడియో టీజర్ టెరిఫిక్ గా ఉంది.
ముఖానికి బ్యాండేజ్ కట్టుకుని, తుపాకీతో ఆడుకుంటున్న షారుక్ ఖాన్ లుక్ మదిలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇక ఈ సినిమా కథ ఏంటనేది విడుదల అయితే కానీ ఒక క్లారిటీ రాదూ. ఇక జవాన్ అని పేరు పెట్టారు కాబట్టి ఇది ఆర్మ్ నేపథ్యంలో సాగే సినిమా అని అనుకోవచ్చు. ఇక టీజర్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు మేకర్స్. షారుక్ ఖాన్ నటిస్తున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రం 2023 సంవత్సరంలో జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. బాలీవుడ్‌లో అభిమానులు అందరూ కింగ్‌గా పిలుచుకునే నటుడు షారుఖ్ ఖాన్ చాలా కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇప్పుడు ఆయన అభిమానుల నిరీక్షణకు తెరపడనుంది. షారుక్ ఖాన్ తన ప్రాజెక్ట్‌లను త్వరత్వరగా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
త్వరలో పఠాన్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి ఇతర ప్రాజెక్ట్‌లలో భాగం కానున్నాడు. షారూఖ్ ఖాన్ చివరిసారిగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన జీరో చిత్రంలో కనిపించాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగా పెర్ఫర్మ్ చేయలేదు. ఈ సినిమాలో ఆయనతో పాటు కత్రినా కైఫ్, అనుష్క శర్మ కనిపించారు. ఇప్పుడు షారుక్ కొంత గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.