»   » నా వూపిరిని ఆపగలరు కానీ అంటూ...షారూఖ్, ఎందుకలా అనాల్సి వచ్చింది? (వీడియో)

నా వూపిరిని ఆపగలరు కానీ అంటూ...షారూఖ్, ఎందుకలా అనాల్సి వచ్చింది? (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: మొత్తానికి బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 'రయీస్‌' ట్రైలర్‌ విడుదలైంది. షారుక్‌, చిత్ర యీనిట్ ట్విట్టర్‌ ద్వారా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో షారుక్‌ బిజినెస్‌ గురించి చెప్పిన డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి...హాట్ టాపిక్ గా మారాయి.

Shah Rukh Khan In & As Raees Trailer

ఏ వ్యాపారమైనా మంచి వ్యాపారమే కానీ బిజినెస్‌కి మించిన మతం లేదని రయీస్‌ చెప్పడం ఆకట్టుకుంటోంది. సినిమాలో నవాజుద్దీన్‌ సిద్ధిఖి పోలీస్‌ అధికారి పాత్రలో నటించారు. ఇందులో నవాజుద్దీన్‌ రయీస్‌ని అరెస్ట్‌ చేయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తాడు.

ఈ క్రమంలో నవాజుద్దీన్‌.. 'నువ్వు బిజినెస్‌ అని దేన్నైతే అంటున్నావో దాన్ని మూసేయ్‌. లేకపోతే నీ వూపిరినే ఆపేస్తాను' అంటాడు. ఇందుకు షారుక్‌ 'గుజరాత్‌లో బిజినెస్‌ గాలిలో ఉంటుంది. నా వూపిరిని ఆపగలరు కానీ గాలిని ఆపలేరు కదా సర్‌... సదా మీ సేవలో రయీస్‌' అని షారుక్‌ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.

రాహుల్‌ ఢోలకియా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాకిస్థానీ నటి మహీరా ఖాన్‌ షారుక్‌కి జంటగా నటించింది. రెడ్‌ చిల్లీస్‌ ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గుజరాత్‌కి చెందిన రయీస్‌ ఆలమ్‌ అనే మద్యం వ్యాపారి 1980ల్లో గుజరాత్‌లో చేసిన బిజినెస్‌ గురించి ఈ చిత్రంలో చూపించబోతున్నారు. 2017 జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాహుల్ ఢోలకియా, హరిత్ మెహతా సంయుక్తంగా రాసిన డైలాగులు ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కళ్ళుచెదిరేలా ఉన్నాయి. విశేషం ఏంటంటే.. 50 ఏళ్ల పైబడిన షారుఖ్ ఆ యాక్షన్ సీక్వెన్స్‌లను డూప్స్ లేకుండా చేశాడు.

గుజరాతీ ఫ్లేవర్ ఎక్కువగా నిండిన ఈ ట్రైలర్‌లో మాజీ పోర్న్‌స్టార్ సన్నీలియోన్ తళుక్కుమంది. ఆమె కనిపించినప్పటి నుంచి 'లైలా ఓ లైలా' అనే ఐటెం సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే.. అన్ని ఎలిమెంట్స్‌తో మిక్స్ అయిన ఈ ట్రైలర్ అంచనాలను రీచ్ అవ్వడంలో సక్సెస్ అయ్యింది. ఇక 25వ తేదీన ఈ 'రయీస్'ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.

English summary
The much talked about trailer of the highly anticipated film Raees is out and lives up to everyone's sky rocketing expectation. Shah Rukh Khan looks menacing in the titular character of Raees Aslam, a dreaded smuggler based in Gujarat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu