»   »  ఎంత అగ్ర హీరో అయినా హిట్ లేకుంటే అంతే.... ఈ వయసులో ఆ ప్రయోగం రిస్క్ అవనుందా..!?

ఎంత అగ్ర హీరో అయినా హిట్ లేకుంటే అంతే.... ఈ వయసులో ఆ ప్రయోగం రిస్క్ అవనుందా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న బాద్షా షారూఖ్ ఖాన్ సపరేట్ రూట్ మారుస్తున్నాడు. తన తోటి నటులైన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారు వరుసగా ప్రయోగాలు చేస్తుండటంతో షారూఖ్ కూడా ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు. ఈ మధ్య ఫ్యాన్ చిత్రం తో కాస్త రూట్ మార్చే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అయినా షారూఖ్ మరోసారి ప్రయోగానికి రెడీ అవుతున్నాడు .రాయిస్ మూవీ షూటింగ్లో పాల్గొంటున్న షారూఖ్, ఆ మూవీ పూర్తయిన తరువాత ది రింగ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

ఈ 2 సినిమాలు లైన్లో ఉండగానే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో మరో మూవీ అంగీకరించాడు. తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, రాంజానా లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ఆనంద్, షారూఖ్ ని మరుగుజ్జు పాత్రలో చూపించబోతున్నారట. ఒకప్పుడు వరుస హిట్స్ తో తిరుగులేని హీరో అనిపించుకున్న స్టార్ షారూఖ్. కానీ ఇప్పుడు తన రేంజ్ సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య వచ్చిన ఫ్యాన్ అతి ధారుణమైన పరాజయాన్ని చవి చూసింది. అటు చూస్తే సల్మాన్ అమీర్లు సక్సెల తో దూసుకు పోతున్నారు. సుల్తాన్, దంగల్ లాంటి సినిమాలు వారిని షారూఖ్ నుంచి వేరు చేసి చూపిస్తున్నారి. ఇదంతా చూసి ఇక రొటీన్ సినిమాలతో లాభం లేదని అనుకున్నాడో ఏమో కానీ, ఎవరూ ఊహించని విధంగా ప్రయోగాత్మక రోల్ పోషించేందుకు రెడీ అయ్యాడట!

ఆనంద్ ఎల్ రాయ్

ఆనంద్ ఎల్ రాయ్

దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కి బాలీవుడ్‌లో ఓ ప్రత్యేక ఇమేజ్‌ ఉంది. ఆయన చిత్రాలు సహజత్వానికి చాలా దగ్గరగా నవ్యతతో ఉంటాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'తను వెడ్స్‌ మను', 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' చిత్రాలు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేశాయి. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన పలు చిత్రాలను 'కలర్‌ ఎల్లో' బ్యానర్‌పై నిర్మించారు. ఆయన నిర్మాతగా తాజాగా 'హ్యాపీ భాగ్‌ జాయేగీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే షారూఖ్‌ఖాన్‌ నటించబోయే ఓ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నారు

 వరుస ఫ్లాపులు

వరుస ఫ్లాపులు


అదివరకంటే స్టార్ స్టామినా ఉండేది హీరో కోసమే సినిమా చూసే వారు ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు... కానీ ఇప్పుదా సంఖ్య బాగా తగ్గిపోయింది. వారి టేస్ట్ కు తగ్గట్టుగా స్క్రీన్ మీద కనిపిస్తేనే హీరోలకు హిట్ ఇస్తున్నారు ప్రేక్షకులు. ఈ విషయాన్ని పట్టించుకోకపోతే ఎంత పెద్ద హీరో సినిమానైనా ఈజీగా రిజక్ట్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులు ఫేస్ చేస్తున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కెరీరే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఓ వైపు క్యారెక్టర్స్ ప్రయోగాలు చేస్తున్న ఆమిర్ ఖాన్, మరోసారి కథల్లో కాస్త కొత్తదనం చూపిస్తున్న సల్మాన్ ఖాన్ వందల కోట్ల వసూళ్లు సాధిస్తుంటే, రొటీన్ కథలనే ఎక్కువగా నమ్ముకుంటున్న కింగ్ ఖాన్ మాత్రం ప్రేక్షకులను మెప్పించేందుకు నానా తంటాలు పడుతున్నాడు.

 రాయిస్:

రాయిస్:


ఈ సంవత్సరం 'ఫ్యాన్' మూవీతో ఒక ప్రయోగం చేసినా అది ఆడియెన్స్ అంచనాలను రీచ్ కాలేకపోయింది. ఇక ప్రస్తుతం 'రాయిస్', 'ది రింగ్' అనే సినిమాల్లో యాక్ట్ చేస్తున్న బాలీవుడ్ బాద్ షా, ముందు వచ్చే సినిమాలు కూడా ప్రయోగాత్మకంగానే ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. అదే నేపథ్యం లో ఆనంద్.ఎల్.రాయ్ సినిమాకు సైన్ చేయడం ఆసక్తి రేపుతోంది. షారుఖ్ కొత్త సినిమాకు కమిటవ్వడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా ఇందులో కింగ్ ఖాన్ మరుగుజ్జుగా కనిపించబోతుండటమే అసలు విశేషం.

 విచిత్ర సోదరులు:

విచిత్ర సోదరులు:


దాదాపు మూడు దశాబ్దాల క్రితం 'విచిత్ర సోదరులు' సినిమాలో (హిందీలో అప్పు రాజా) కమల్ హాసన్ కనిపించిన తరహాలోనే ఈ నయా మూవీలో షారుఖ్ కనిపిస్తాడని టాక్. ఎలాంటి పాత్రల్లోనైనా ఇట్టే ఇమిడిపోతాడు కింగ్‌ ఖాన్‌ షారుక్‌. 'ఫ్యాన్‌'లో డబుల్‌ రోల్‌లో మెప్పించిన షారుక్‌ ఈసారి మరో ప్రయోగం చేయబోతున్నాడు మరీ అమీర్ ఖాన్ లా ప్రతీ సినిమా ఒక ప్రయోగం అనుకోని షారూఖ్ అప్పుడప్పుడూ కొన్ని వేశాలేస్తూంటాడు. మై నేం ఈజ్ ఖాన్, ఫ్యాన్ లలో షారూఖ్ చేసిన పెర్ఫార్మెన్స్ ని ఎవరూ మర్చిపోలేం.

ఇంకో కొత్త గెటప్ :

ఇంకో కొత్త గెటప్ :

ఫ్యాన్ కమర్షియల్ గా ఫ్లాప్ అయినా షారూఖ్ నటన మాత్రం మంచి మార్కులే వేయించుకుంది. అదే తరహాలో ఇప్పుడు ఇంకో కొత్త గెటప్ తో రానున్నాడు ఈ కింగ్ ఆఫ్ బాలీవుడ్. ఒకప్పుడు కమల్ హసన్ చేసిన సినిమా తప్ప బాలీవుడ్ లో ఏ స్టార్ హీరో తోనూ ఇలాంటి పాత్ర ఎవరూ చేయించలేకపోయారు. అంతే కాదు కొన్ని సార్లు ఆ పాత్రలో ఉండే కష్టం కూడా వెనకడుగు వేయించింది. 'బంధువా' ఈ రొమాంటిక్‌ డ్రామా చిత్రీకరణను డిసెంబర్‌లో ప్రారంభించి సినిమాను 2018లో డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 గ్రాఫిక్స్ మీద ఆధార పడితే సరిపోదు

గ్రాఫిక్స్ మీద ఆధార పడితే సరిపోదు


అయితే ఈ పాత్ర కోసం కెరవలం గ్రాఫిక్స్ మీద మాత్రమే ఆధార పడితే సరిపోదు. మరుగుజ్జు గా కనిపించాలీ అంటే దానికి తగ్గట్టే శరీర నిర్మాణమూ చూపించాల్సి ఉంటుంది కాబట్టి షారూఖ్ విపరీతంగా బరువు తగ్గాల్సి ఉంటుంది. అంతే కాదు దీని కోసం వేయబోయే మేకప్ ఎక్కువ గంటల పాటు ఉంటే అది ఆరోగ్యం మీద కూదా ప్రభావం చూపే అవకాశం ఉందట. అందుకే ఇన్నాళ్ళూ ఏ స్టార్ హీరో కూడా ఇలాంటి ప్రయోగానికి దూరం గానే ఉన్నారు.

 రిస్క్ తీసుకోవటానికి సిద్దం:

రిస్క్ తీసుకోవటానికి సిద్దం:


అయితే షారూఖ్ మాత్రం ఇప్పుడు రిస్క్ తీసుకోవటానికి సిద్దం అనే అంటున్నాడు. 2018లో సెట్స్ మీదకు వెళ్లబోయే ఈ సినిమాను, అదే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని దర్శకుడు అనౌన్స్ చేశాడు. మొత్తానికి ప్రయోగాలు చేసి ఆమిర్, సల్మాన్‌లతో పోటీ పడాలని ప్రయత్నిస్తున్న షారుఖ్ ఆశలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సిందే.

English summary
The 50-year-old "Dilwale" star will be seen essaying the role of a dwarf in the interesting love story by Anand L Rai's next film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu