»   »  ట్విట్టర్‌లో సెల్యూట్‌ సెల్ఫీని పంచుకున్నాడు

ట్విట్టర్‌లో సెల్యూట్‌ సెల్ఫీని పంచుకున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ తన సెల్యూట్‌ సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఎటువంటి స్వార్థం లేకుండా దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పంద్రాగస్టు సందర్భంగా కొద్ది రోజుల క్రితమే సినీ, క్రీడా ప్రముఖులు ట్విట్టర్‌లో సెల్యూట్‌ సెల్ఫీ అనే కొత్త విధానానికి నాంది పలికిన విషయం తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఉవ్వెత్తిన ఎగిసి,దూసుకుపోతున్న ఫేస్‌బుక్‌ ఓ కొత్త యాప్‌ని ప్రవేశ పెట్టింది. అయితే కేవలం సెలబ్రిటీలకు మాత్రమే ఈ యాప్‌ని వినియోగించుకునే వీలుంటుంది. దాని ద్వారా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు లైవ్‌ వీడియో ద్వారా తామేం చేస్తున్నదీ అభిమానులతో పంచుకోవచ్చు. ఈ కొత్త అప్లికేషన్‌ పేరు 'ఫేస్‌బుక్‌ మెన్షన్స్‌'. 

Shah Rukh Khan Joins The League Of Salute Selfie

దీన్ని భారత్‌లో పరీక్షించడంలో భాగంగా ఫేస్‌బుక్‌ సంస్థ షారుఖ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అలా ఈ యాప్‌ని భారత్‌లో వినియోగిస్తున్న మొదటి సెలబ్రిటీగా ఆయన రికార్డులకెక్కారు. ఇకపై ఈ యాప్‌ ద్వారా ఆయన తన అభిమానులకు లైవ్‌ వీడియోలతో టచ్‌లో ఉండనున్నారు.

తొలివిడతగా 15 వీడియోలు పోస్ట్‌ చేశారు. అందులో షారుఖ్‌ అభిమానులకు తన తదుపరి చిత్రం 'ఫ్యాన్‌' సెట్స్‌ని, చిత్ర యూనిట్ పరిచయం చేశారు. తనని ఫ్యాన్‌గా చూపిస్తున్న ఆస్కార్‌ విజేత అయిన మేకప్‌ మ్యాన్‌ గ్రెగ్‌క్యానమ్‌ని కూడా ఆయన పరిచయం చేశారు.

English summary
Shah Rukh Khan who finished the huge schedule of Dilwale in Bulgaria returned,joined and finished the schedule of Fan. Shahrukh who was enjoying a little vacation from the shootings joined the league of Reliance Groups ‘Salute Selfie’.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu