»   » సినిమా రంగంలోకి షారుక్ ఖాన్ కూతురు కూడా!

సినిమా రంగంలోకి షారుక్ ఖాన్ కూతురు కూడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రస్తుతం ఇండియన్ సినిమా రంగంలో నెం.1 స్థానంలో(ఫోర్బ్స్ కథనం ప్రకారం) ఉన్న షారుక్ ఖాన్ భవిష్యత్‌లో తన సినీ వారసులను కూడా ఇదే రంగంలోకి దింపనున్నారు. ఎందుకంటే వారి పిల్లలు కూడా సినిమా రంగంలోకి రావాలనే కోరుకుంటున్నారు. తన కూతురు సుహానా ఖాన్ భవిష్యత్‌‍లో సినిమా యాక్టర్‌ను అవుతాను అని ప్రకటించడంతో షారుక్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ముంబైలోని ధీరూభాయ్ అంబానీ హైస్కూలులో చదువుతున్న సుహానా ఖాన్ పాఠశాలలోని గర్ల్స్ ఫుట్ బాల్ టీంకు కెప్టెన్. సుహానా ఖాన్ కెప్టెన్సీలో ఆ పాఠశాల టీం ఆజాద్ మైదాన్‌లో జరిగిన MSSA-MI U-14 గర్ల్స్ ఫుట్ బాల్ టోర్నమెంటులో విజేతగా నిలిచింది. తన కూతురు నాయకత్వంలో జట్టు విజయం సాధించడంపై షారుక్ ఖాలా ఆనందంగా ఉన్నాడు.

Shah Rukh Khan's daughter Suhana wants to become an actress

అంతే కాదు, విజయం సాధించిన తర్వాత 13 ఏళ్ల వయసున్న సుహానా ఖాన్ మీడియాతో మాట్లాడుతూ...భవిష్యత్‌లో సినిమా యాక్టర్ అవుతానని వెల్లడించింది. సుహానా ఖాన్ మాట్లాడిన విషయాన్ని పేపర్లో చూసిన షారుక్ ఈ విషయంపై ట్విట్టర్లో స్పందిస్తూ కూతురు సినిమాల్లోకి రావాలనుకోవడం తనకు సంతోషమే అని పేర్కొన్నాడు.

అయితే తాను ముందు బాగా చదువు కోవాలని, చదువు పూర్తయిన తర్వాత వారు వారు ఇష్టపడితే విదేశాల్లో నటనలో శిక్షణ ఇప్పిస్తానని అంటున్నాడు షారుక్. ప్రస్తుతం షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కూడా విదేశాల్లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. భవిష్యత్‌లో ఆర్యన్ హీరోగా బాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు.

English summary
Shah Rukh Khan’s daughter, Suhana Khan in her recent interview has revealed that she wants to become an actor like her father.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu