»   »  సన్నిలియోన్‌ను చూసి.. పరదా చింపేంత పనిచేశారు..

సన్నిలియోన్‌ను చూసి.. పరదా చింపేంత పనిచేశారు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిటీ ఆఫ్ జాయ్ కోల్‌కతాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభిమానులు రెచ్చిపోయారు. రయీస్ చిత్రంలో సెక్స్‌బాంబ్ సన్నిలియోన్ పాట సందర్భంగా షారుక్ ఫ్యాన్స్ స్థానిక జయా థియేటర్‌లో స్క్రీన్ ముందు రచ్చరచ్చ చేశారు. అరుపులు, ఈలలతో సినిమా హాల్‌ లోపల నానా హంగామా సృష్టించారు.

Shah Rukh Khan


80 దశకంలో విడుదలైన ఖుర్బానీ చిత్రంలో లైలా ఓ లైలా అంటూ అలనాటి శృంగార తార జీనత్ అమన్ ఆటపాట కుర్రకారును ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే పాటను రయీస్‌లో సన్నిలియోన్‌తో రీమిక్స్ చేశారు. ఈ పాటకు అనూహ్య స్పందన లభించింది. ఆడియో పరంగానే కాకుండా తెరమీద కూడా సన్నిలియోన్ విశేషంగా ప్రేక్షకులను అలరించింది.

బుధవారం విడుదలైన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి. తొలిరోజే రూ.24 కోట్లకు పైగా వసూలు చేసింది. లాంగ్ వీకెండ్ ఉండటంతో ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశముందని ట్రేడ్ అనలిస్టులు అంచనావేస్తున్నారు.

English summary
Shah Rukh Khan's fans went crazy dancing on Sunny Leone Song of Raees
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu