»   » చూడండి‌: సాటి స్టార్ తో కాలు దువ్వుతూ...ఫస్ట్ లుక్, టీజర్ వదిలాడు

చూడండి‌: సాటి స్టార్ తో కాలు దువ్వుతూ...ఫస్ట్ లుక్, టీజర్ వదిలాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: సల్మాన్ ఖాన్ తాజా చిత్రం సుల్తాన్ ని ...రంజాన్ కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తూ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తేదీన బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ కొత్త చిత్రం 'రాయీస్‌' కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. దాంతో ఇప్పుడు బాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఆ మేరకు షారూఖ్ తన చిత్రం కొత్త పోస్టర్లను తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రానికి రాహుల్‌ ధొలాకియా దర్శకత్వం వహిస్తున్నారు. షారుక్‌తోపాటు ఫర్హాన్‌ అక్తర్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 2016 రంజాన్‌ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. క్రింద షారూఖ్ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్ ఫోటోలు చూడండి.

సల్మాన్ ఖాన్ కు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సల్మాన్ సోదరి అర్పిత వివాహ సందర్భంగా పాతవన్నీ వదిలేసి ఒకటయ్యి...సల్మాన్ తో చేయి చేయి కలిపాడు. కానీ ఇప్పుడు సల్మాన్ కావాలని కాలుదువ్వుతున్నట్లు అవుతోంది.

Shah Rukh Khan’s ‘Raees’ Releases Teaser & Posters,Ups Ante With Salman’s ‘Sultan’

సల్మాన్ నటించబోతున్న 'సుల్తాన్' చిత్రం... షారుఖ్ చిత్రం 'రాయిస్'తో పోటీ పడబోతోంది. 'రాయిస్'ను వచ్చే యేడాది ఈద్ కు షారుఖ్ విడుదల చేయాలనుకుంటుంటే... సల్లుభాయ్ 'సుల్తాన్' కూడా అప్పుడే వస్తుందని యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ చెబుతోంది. ఈ మేరకు టీజర్ ని సైతం విడుదల చేసింది. అది ఇక్కడ చూడండి

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో ప్రక్క సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రం 'సుల్తాన్'లోని క్యారెక్టర్ ఏమిటీ దాని తీరు తెన్నుల్ని రివీల్ చేశాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కబోతున్న 'సుల్తాన్'లో తాను మల్లయోధుడుగా నటిస్తున్నానని చెప్పాడు. అలాగే..., ఇది క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకునే ప్రేమకథా చిత్రమని చెప్పాడు. నవంబర్ లో సెట్స్ కు వెళ్ళ బోతున్న ఈ సినిమా కోసం ఇప్పటి నుండే వర్కౌట్స్ మొదలు పెట్టాల్సి ఉందని, కండలతో పాటు వెయిట్ కూడా బాగా గెయిన్ చేయాలని సల్మాన్ చెప్పుకొచ్చారు.

English summary
Shah Rukh Khan’s Red Chillies Entertainment dropped two posters for his Eid 2016 flick Raees earlier today,Red Chillies has just added a teaser trailer for Raees.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu