»   » మర్యాద గా ఉండండటూ అంటూ ఫ్యాన్స్ ని....

మర్యాద గా ఉండండటూ అంటూ ఫ్యాన్స్ ని....

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : సోషల్ నెట్ వర్కింగ్ సైట్లల్లో ఓ హీరో అభిమానులు మరో హీరో గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టడం ఈమధ్య ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై షారుఖ్‌ ఖాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర నటుల గురించి మాట్లాడుతున్నప్పుడు మర్యాద పాటించాలని తన అభిమానులకు హితవు చెప్పారు.

''ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి వేదికలు మన భావాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు ఉన్నాయి. కానీ ఇతరులను బాధించేలా మన ప్రవర్తన ఉండకూడదు. ఈ విషయంలో నా అభిమానులు పద్ధతిగా ఉండాలని కోరుకుంటున్నా''నని ట్విట్టర్‌లో రాశాడు షారుఖ్‌. గతంలో సల్మాన్‌ ఖాన్‌ కూడా ఈ విషయంపైనే తన అభిమానులను తీవ్రంగా హెచ్చరించాడు.

సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఉవ్వెత్తిన ఎగిసి,దూసుకుపోతున్న ఫేస్‌బుక్‌ ఓ కొత్త యాప్‌ని ప్రవేశ పెట్టింది. అయితే కేవలం సెలబ్రిటీలకు మాత్రమే ఈ యాప్‌ని వినియోగించుకునే వీలుంటుంది. దాని ద్వారా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు లైవ్‌ వీడియో ద్వారా తామేం చేస్తున్నదీ అభిమానులతో పంచుకోవచ్చు. ఈ కొత్త అప్లికేషన్‌ పేరు 'ఫేస్‌బుక్‌ మెన్షన్స్‌'.

దీన్ని భారత్‌లో పరీక్షించడంలో భాగంగా ఫేస్‌బుక్‌ సంస్థ షారుఖ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అలా ఈ యాప్‌ని భారత్‌లో వినియోగిస్తున్న మొదటి సెలబ్రిటీగా ఆయన రికార్డులకెక్కారు. ఇకపై ఈ యాప్‌ ద్వారా ఆయన తన అభిమానులకు లైవ్‌ వీడియోలతో టచ్‌లో ఉండనున్నారు.

Shah Rukh Khan SLAMS Twitter trolls, says they are 'low on vocabulary and status

తొలివిడతగా 15 వీడియోలు పోస్ట్‌ చేశారు. అందులో షారుఖ్‌ అభిమానులకు తన తదుపరి చిత్రం 'ఫ్యాన్‌' సెట్స్‌ని, చిత్ర యూనిట్ పరిచయం చేశారు. తనని ఫ్యాన్‌గా చూపిస్తున్న ఆస్కార్‌ విజేత అయిన మేకప్‌ మ్యాన్‌ గ్రెగ్‌క్యానమ్‌ని కూడా ఆయన పరిచయం చేశారు.

English summary
Taking a stand against online trolling, superstar Shah Rukh Khan has asked his fans to refrain from abusing and deriding other films and actors on social media. It seems the triggering point was the usual fan-war between his and superstar Salman Khan's followers, which was laced with expletives. While the two actors have buried the hatchet, some fans still continue to ridicule them.
Please Wait while comments are loading...