»   » సూపర్ స్టార్ కి మళ్లీ సర్జరీ? మళ్లీ నొప్పి తీవ్రం అయ్యింది, తప్పదు

సూపర్ స్టార్ కి మళ్లీ సర్జరీ? మళ్లీ నొప్పి తీవ్రం అయ్యింది, తప్పదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: తెరపై సూపర్ స్టార్స్ అయినంత మాత్రాన తెర వెనక జీవితం అలాగే ఉంటుందనుకుంటే పొరబడినట్లే. వారికి మనందరిలాగే కష్ట , సుఖాలు అనారోగ్యాలు ఉంటాయి. అయితే తమ ఇమేజ్ కు భంగం వాటిల్లుతుందని వాటికి కొంత గోప్యత పాటించి బయిటకు రానివ్వరు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లలో పాల్గొనే హీరోలకు సర్జరీలు అవుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా ..షారూఖ్ కు ఇదే పరిస్దితి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తీవ్రమోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఏడేళ్లుగా ఎడమ మోకాలిలో తీవ్ర నొప్పితో బాధపడుతున్న షారుక్‌కు 2015లో ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డా.సంజయ్‌ దేశాయ్‌ సర్జరీ చేశారు.

ఆపరేషన్‌ అయినప్పటి నుంచి షారుక్‌ని మోకాలికి క్యాప్‌ పెట్టుకోమని చెప్తే ఆయన వినడం లేదని, అప్పుడప్పుడు మాత్రమే పెట్టుకుంటున్నాడని, యాక్షన్‌ సన్నివేశాలు చేయవద్దంటే చేస్తున్నాడని డాక్టరు ఫిర్యాదు చేశారు.

ఇప్పుడు రయీస్‌ షూటింగ్ లో భాగంగా షారుక్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో నటిస్తుండగా మళ్లీ తీవ్ర నొప్పి మొదలైంది. షారుక్‌ ఇంకా ద రింగ్‌ చిత్రం షూటింగ్‌ పూర్తిచేయాల్సి ఉంది. అందుకని పదినెలల తర్వాత షారుక్‌కి మరోసారి ఆర్థోస్కోపిక్‌ సర్జరీ చేస్తామని దేశాయ్‌ తెలిపారు.

సాధ్యమైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోమని సూచించామన్నారు. ఐదు నెలల క్రితం కూడా తరచుగా గాయాలు అవడంతో తాము ఇంజెక్షన్లు, పెయిన్‌ కిల్లర్స్‌తో చికిత్స చేశామని, ఇప్పుడు ఆ భాగం బాగా దెబ్బతినడంతో నొప్పి ఎక్కువైందని, అది సరిచేయడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్‌ తెలిపారు.

కెరీర్ విషయానికి వస్తే..బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ హీరోగా బుధవారం విడుదలైన 'రయీస్‌' చిత్రం ట్రైలర్‌ రికార్డు సృష్టించింది. విడుదలైన 3 గంటల 35 నిమిషాల్లోనే లక్ష లైక్‌లు పొందిన తొలి సినిమా ట్రైలర్‌గా నిలిచింది. గతంలో సల్మాన్‌ ఖాన్‌ 'సుల్తాన్‌' చిత్ర ట్రైలర్‌ 42 గంటల్లో, ఆమిర్‌ ఖాన్‌ 'దంగల్‌' ట్రైలర్‌ 23 గంటల్లో, సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ 'ఎమ్‌.ఎస్‌. ధోని' 12 గంటల్లో లక్ష లైక్‌లు సాధించాయి.

ఇప్పుడు 'రయీస్‌'.. 'ఎమ్‌.ఎస్‌: ధోని' రికార్డును బ్రేక్‌ చేసింది. అంతేకాదు రెండన్నర నిమిషం నిడివిగల ఈ ట్రైలర్‌ హ్యాష్‌ట్యాగ్‌(రయీస్‌ ట్రైలర్‌) రోజంతా సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

'రయీస్‌' ట్రైలర్‌కు విశేషమైన స్పందన రావడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. యూనిట్‌ సభ్యులు సినిమా కోసం చాలా కష్టపడుతున్నారని, తామంతా చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నామని తెలిపింది. రాహుల్‌ ఢోలకియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డేకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
“I had a minor surgery back then, now I have to undergo a major surgery which takes 11 to 12 months. So I don’t want to take that chance, but I have not had my chance to rehabilitate. As soon as I am done with all my work I will start with my exercises again. It pains when I walk a little or stand for too long. So you see here. This is a metallic knee cap I am wearing for that purpose”Shah Rukh Khan Said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu