»   » ఇండియన్ హీరోల సంపాదన చూస్తే షాకే.... (2017 ఫోర్బ్స్ జాబితా)

ఇండియన్ హీరోల సంపాదన చూస్తే షాకే.... (2017 ఫోర్బ్స్ జాబితా)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 2017 సంవత్సరానికి గాను 'హయ్యెస్ట్ ఎర్నింగ్ ఎంటర్టెనర్స్ ఇన్ ది వరల్డ్' పేరుతో ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ తాజాగా ఓ జాబితా విడుదల చేసింది. ఇండియన్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

టాప్ 100 మందితో కూడిన ఈ జాబితాలో అమెరికన్ రాపర్, ఎంటర్‌పెన్యూర్ సీన్ కోంబ్స్.... 130 మిలియన్ డాలర్లు (రూ. 837 కోట్లు) సంపాదనతో నెం.1 స్థానం దక్కించుకున్నాడు. షారుక్, సల్మాన్, అక్షయ్ ఎంత సంపాదించారో కింద చూద్దాం.

65వ స్థానంలో షారుక్

65వ స్థానంలో షారుక్

100 మందితో కూడిన ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ 65వ స్థానంలో నిలిచాడు. ఈ సంవత్సరం షారుక్ ఖాన్ సంపాదన 38 మిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. అంటే మన కరెన్సీ లెక్క ప్రకారం దాదాపు రూ. 245 కోట్లు. బాలీవుడ్ సినిమాలతో పాటు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఇతర వ్యాపారాల ద్వారా షారుక్ ఈ మొత్తం సంపాదించాడట.

71వ స్థానంలో సల్మాన్

71వ స్థానంలో సల్మాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 100 మందితో కూడిన ఈ జాబితాలో 71వ స్థానంలో నిలిచాడు. సల్మాన్ ఖాన్ సంపాదన 37 మిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ తేల్చింది. అంటే మన కరెన్సీ లెక్క ప్రకారం దాదాపు రూ. 238 కోట్లు.

80వ స్థానంలో అక్షయ్

80వ స్థానంలో అక్షయ్

మరో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌కు 80 స్థానం దక్కింది. అక్షయ్ కుమార్ సంపాదన 35.5 మిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ పేర్కొంది. అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 228 కోట్లు.

మొదటి స్థానం

మొదటి స్థానం

ఈ జాబితాలో అమెరికన్ రాపర్, ఎంటర్‌పెన్యూర్ సీన్ కోంబ్స్.... 130 మిలియన్ డాలర్లు (రూ. 837 కోట్లు) సంపాదనతో నెం.1 స్థానం దక్కించుకున్నాడు.

బియాన్స్ రెండో స్థానం

బియాన్స్ రెండో స్థానం

అమెరికన్ సింగర్ బియాన్స్ ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నారు. ఆమె సంపాదన 105 మిలియన్ డాలర్లు. అంటే మన లెక్క ప్రకారం రూ. 676 కోట్లు.

జెకె రోలింగ్

జెకె రోలింగ్

హ్యరీ పొట్టర్ రచయిత జెకె రోలింగ్ 95 మిలియన్ డాలర్ల సంపాదనతో మూడో స్థానంలో నిలిచారు. మన లెక్క ప్రకారం ఆమె సంపాదన రూ. 612 కోట్లు.

నాలుగో స్థానంలో డార్క్

నాలుగో స్థానంలో డార్క్

ఈ జాబితాలో ఆర్ అండ్ బి మ్యూజీషియన్ డార్క్ 94 మిలియన్ డాలర్ల సంపాదనతో 5వ స్థానం దక్కించుకున్నారు. అంటే దాదాపు రూ. 605 కోట్లు.

క్రిస్టియానో రొనాల్డో

క్రిస్టియానో రొనాల్డో

ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో 93 మిలియన్ డాలర్ల సంపాదనతో టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. అంటే అతడి సంపాదన దాదాపు రూ. 599 కోట్లు.

English summary
Indian superstars Shah Rukh Khan, Salman Khan and Akshay Kumar are among Forbes' annual list of the highest-earning entertainers in the world. The Forbes list of the 'World's Highest-Paid Celebrities of 2017' has been topped by American rapper and entrepreneur Sean Combs, known by his more famous stage name 'Diddy', with earnings of 130 million dollars.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu