»   »  కుర్ర హీరోతో శ్రీదేవి కూతురు రొమాన్స్.. బాలీవుడ్ హీరో వార్నింగ్..

కుర్ర హీరోతో శ్రీదేవి కూతురు రొమాన్స్.. బాలీవుడ్ హీరో వార్నింగ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో ఎంట్రీకి ముందే శ్రీదేవీ కూతురు జాహ్నవి కపూర్ సెలబ్రీటి హోదాలో ముంబై మహానగరంలో హల్‌చల్ చేస్తున్నది. ఇప్పటికే ఓ ఇద్దరితో అఫైర్ నడుపుతున్నట్టు రూమర్లు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్‌తో జాహ్నవి అతిసన్నిహితంగా మెలుగుతుండటం మీడియా కంటపడింది. వారిద్దరూ చేతిలో చేయి వేసుకొని సినిమాలకు, షికార్లు తిరగడం మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ విషయంపై సోదరుడు ఇషాన్‌ను షాహీద్ మందలించాడట.

సోదరుడికి షాహీద్ సలహా

సోదరుడికి షాహీద్ సలహా

షాహీద్ సోదరుడు ఇషాన్ కట్టర్ బాలీవుడ్‌లో ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. మాజిద్ మజీది రూపొందిస్తున్న బియాండ్ ది క్లౌడ్స్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌లో స్థిరమైన స్థానం సంపాదించేంత వరకు ఇతర విషయాలపై దృష్టిపెట్టవద్దని గతంలోనే హెచ్చరించాడట. అయితే ఇటీవల ఇషాన్, జాహ్నవి కలిసి తిరుగుతున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలు షాహిద్ కంట్లో పడ్డాయి. దాంతో మరోసారి ఇషాన్‌కు షాహీద్ క్లాస్ పీకినట్టు సమాచారం.

కరణ్ సినిమాలో జాహ్నవి

కరణ్ సినిమాలో జాహ్నవి

జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నది. కరణ్ జోహర్ నిర్మించేబోయే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2 సినిమాలో జాహ్నవి కపూర్ నటించనున్నది. తన సినిమాలో నటిస్తున్నందున్న పార్టీలు, పబ్‌లకు వెళ్లవద్దని జాహ్నవి దర్శక, నిర్మాత కరణ్ ఓ సారి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఎక్కడపడితే.. అక్కడ..

ఎక్కడపడితే.. అక్కడ..

సోదరుడి మాటను ఇషాన్, మెంటర్ మాటను జాహ్నవి పెడచెవిన పెట్టి వారిద్దరూ కలిసి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. ఈ విషయంపై ఆరా తీసిన షాహిద్.. కెరీర్ విషయంలో కాస్త దృష్టిపెట్టమని సూచించినట్టు సమాచారం. కెరీర్ మొదట్లోనే ఇలాంటి తీరు ఉంటే బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం కష్టమనే సలహాను కూడా షాహీద్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.

కెరీర్‌పై దృష్టిపెట్టు..

కెరీర్‌పై దృష్టిపెట్టు..

బియాండ్ ది క్లౌడ్స్ అనే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు జాహ్నవితో తిరుగవద్దు. వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్ జీవితాన్ని లో ప్రొఫైల్‌లో ఉంచుకొని వ్యవహరించు. ఓ గైడ్‌గా, మెంటర్‌గా మాత్రమే సలహా ఇస్తున్నాను. నీపై ప్రతికూల ప్రచారం జరుగకుండా జాగ్రత్త తీసుకో. ఒకవేళ చేడు ప్రచారం జరిగితే కెరీర్ ప్రమాదంలో పడుతుంది అని ఇషాన్‌కు షాహీద్ సూచించాడు అని ప్రముఖ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

English summary
Reports claim that Ishaan Khattar and Jhanvi Kapoor are seeing each other. Although there is no confirmation to that, the two young starlets have been spotted several times together, only adding more fuel to the fire. Now, this has left Shahid fuming.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu