»   »  కరీనా మాజీ బాయ్ ఫ్రెండ్ పరిస్థితి కట్టేసిన కుక్కలా ఉందట

కరీనా మాజీ బాయ్ ఫ్రెండ్ పరిస్థితి కట్టేసిన కుక్కలా ఉందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో హీరోగా కంటే కరీనా కపూర్ లవర్ గానే బాగా పాపులర్ అయ్యాడు షాహిద్ కపూర్. బెబోతో అఫైర్ ఫెయిల్ అయిన తర్వాత. పూర్తిగా కెరీర్ కే అంకితమైన షాహీద్ పోయిన సంవత్సరమే పెళ్లి చేసుకున్నాడు. మీరా రాజ్ పుత్ అనే సినీ రంగానికి సంబంధం లేని పంజాబీ అమ్మాయిని పెళ్లాడి బిందాస్ గా కాపురం చేసేసుకుంటున్నాడు.

ఈమధ్య కథానాయకుడిగా షాహిద్ కపూర్ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. అయితే.. పర్సనల్ లైఫ్ లో మాత్రం యమ జోరుమీదున్నాడు ఈ బాలీవుడ్ హీరో. అంతా బాగానే ఉంది కానీ మొన్న ఒక సందర్భం లో తన ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడుతూ... ఇప్పుడు తన భార్య తనను పెంపుడు కుక్కలా చేసేసిందని చెప్పడంతో. అందరూ షాక్ ఒక్కసారి షాక్ అయ్యారు.

Shahid Kapoor feels like a dog on a leash post marriage to Mira Rajput

'సింపుల్ గా చెప్పాలంటే.. పెళ్లయ్యాక నా పరిస్థితి కట్టేసిన కుక్కలా ఉంది. నా భార్య చెప్పినట్లుగానే వింటూ.. ఓ పరిధిలో నడుచుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే మంచి భర్తలా మారిపోయా. ఇందుకు కారణం నా భార్య మీరానే' అని చెప్పాడు . అయితే నిజానికి షాహీద్ తన భార్య మీద ఆరోపణ చేయలేదు .. తన వైఫ్ తనను అంత గొప్పగా చూసుకుంటోందని చెప్పడమే అతని ఉద్దేశ్యం.

ఒక పరిధిలోనే నడుచుకుంటూ బాధ్యతగా వ్యవహరించడానికి కారణం తన భార్యేనని షాహిద్ కపూర్ తనదైన శైలిలో వెల్లడించాడు. తమకు పుట్టబోయే బిడ్డ.. పాపైనా, బాబైనా పర్లేదని.. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నాడు. ప్రస్తుతం షాహిద్‌ "రంగూన్‌" చిత్రీకరణ పూర్తి చేసుకుని "ఉడ్తా పంజాబ్‌" ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.

English summary
Shahid Kapoor says post-marriage, he's become like a dog with a collar around his neck.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu