»   »  హీరో పర్శనల్ ఫొటో లైక్స్ రికార్డ్

హీరో పర్శనల్ ఫొటో లైక్స్ రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: సెలబ్రెటీలు ముఖ్యంగా మనం ఆరాధించే హీరో, హీరోయిన్స్ పర్శనల్ లైఫ్ అందరికీ ఆసక్తే. అందులోనూ యూత్ లో క్రేజ్ సంపాదించుకుంటున్న షాహిద్ కపూర్ వంటి వారికి మరీను. వారు ఓ ఫొటోను అలా షేర్ చేస్తే... అలా అందిపుచ్చుకుని షేర్స్, లైక్ లతో ముందుకు తీసుకు వెళ్లిపోతున్నారు...ఫ్యాన్స్. ఒక్కోసారి వారి అభిమానం రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది.

బాలీవుడ్‌ యువహీరో షాహిద్‌ కపూర్‌ తన భార్య మీరా రాజ్‌పూత్‌తో కలిసి దిగిన ఓ ఫొటోని సోమవారం రాత్రి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

❤️

Posted by Shahid Kapoor on 22 November 2015

అది ఎంతగా ప్రచారం పొందిందంటే.. కేవలం 24 గంటల్లోనే దాదాపు 12 లక్షలపైనే లైక్స్‌ని సంపాధించింది. అంతే కాదండోయ్‌ దాదాపు 10 వేలకు పైగా కామెంట్లు కూడా వచ్చాయి. అందులో ఎక్కువ శాతం వారి జంటను మెచ్చుకుంటూ రాసినవే కావడం విశేషం. ఇక దాదాపు 5,700మంది ఈ ఫొటోని తమ స్నేహితులతో పంచుకున్నారు.

Shahid Kapoor's photo in Fb creats record

బాలీవుడ్ లవర్ బాయ్ షాహిద్ కపూర్ ఇటీవల మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో వీరి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. అనంతరం ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది.

తనకంటే పది సంవత్సరాలు చిన్నదైన, ఢిల్లీ గర్ల్ మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడిన షాహిద్ కపూర్.. ప్రతి సినిమా ప్రోగ్రామ్‌కి , చివరకు జిమ్ కు కూడా తన భార్యతోనే వస్తున్నాడు. ర్యాంప్ వాక్‌లోనూ ఆమెతోనే నడుస్తున్నాడు. ఇదంతా స్పెషల్ అపియరెన్స్ కోసమేనని.. ఆమెను హీరోయిన్ చేసేందుకే షాహిద్ కపూర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని బాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.

English summary
Shahid Kapoor shared a photo in FB yesterday. And it now creates record views and likes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu