twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క- కోహ్లీ వివాదం...షాహిద్ కపూర్ కామెంట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆ మధ్య ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లీకి తోడుగా అనుష్క శర్మ కూడా వెళ్ళడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఫెయిల్యూర్‌కు విరాట్ కోహ్లి-అనుష్క శర్మ ప్రేమ వ్యవహారాన్ని పావుగా వాడుకుంది బిసీసీఐ అనే విమర్శలకు వచ్చాయి. ఈ వ్యవహారం కాస్తా గర్ల్ ఫ్రెండ్స్, భార్యలు వెంట రావడం వల్లనే టీం ఫెయిల్యూర్ అయిందనే వాదనకు దారి తీసింది.

    ఈ మొత్తం వ్యవహారంలో అనుష్క శర్మ, కోహ్లిలను బ్లేమ్ అయ్యారు. త్వరలో వారు పెళ్లి చేసుకుంటారని చెప్పడం వల్లనే వారిని అనుమతించామని, ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటగాళ్లతో గర్ల్ ప్రెండ్స్‌ను అనుమతించబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఇలా చేయడం ద్వారా టీం ఫెయిల్యూర్ వెనక ఏదో కొత్త కారణాన్ని చూపే ప్రయత్నం చేసింది బీసీసీఐ.

    Shahid Kapoor Speaks For Virat Kohli-Anushka Sharma

    అయితే బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్....బీసీసీఐ వ్యవహారాన్ని తప్పుబట్టాడు. ఎవరు ఎవరినైనా కలిసే హక్కు ఉంటుంది. బీసీసీఐ వ్యవహారాన్ని తాను అస్సలు సపోర్టు చేయను. కోహ్లి, అనుష్క విషయంలో బీసీసీఐ అనవసర రాద్దాంతం చేస్తోంది. అయితే గర్ల్ ఫ్రెండ్స్, వైఫ్స్ వెంట రావడం వల్ల ప్లేయర్స్ ఫెయిల్ అవుతున్నారనడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించాడు షాహిద్.

    ఎవరి పర్సనల్ లైఫ్ వారికి ఉంటుంది....బీసీసీఐ క్రికెటర్ల పర్సనల్ లైఫ్‌ గురించి నానా యాగీ చేయడం సరైంది కాదు. ఈ విషయంలో తన పూర్తి మద్దతు కోహ్లి, అనుష్కలకే ఉంటుందని షాహిద్ వ్యాఖ్యానించారు.

    English summary
    The Board also proposed to ban the players' wives and girlfriends from meeting the players while on tour. However, Shahid Kapoor who also worked with Anushka completely rejects the supposition and claims that the players' personal lives should not be questioned for the poor performance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X