»   » ఆర్టీఏ ఎఫెక్ట్: షారుక్ ఖాన్ అక్రమ వ్యవహారం వెలుగులోకి!

ఆర్టీఏ ఎఫెక్ట్: షారుక్ ఖాన్ అక్రమ వ్యవహారం వెలుగులోకి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ అక్రమ వ్యవహారానికి పాల్పడిన అంశంలో రూ. 1,93,784 జరిమాన చెల్లించిన అంశం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచార హక్కు చట్టం కింద అనిల్‌ గాల్‌గాలి అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన సమాచారం సేకరించారు.

ప్రభుత్వ స్థలాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా సొంత ప్రజయోజనాలకు వాడుకోవడం అక్రమం మార్గం కిందకే వస్తుంది. అయితే ఈ విషయం తెలిసి కూడా షారూక్‌ ఖాన్ బంద్రాలోని తన నివాసం ‘మన్నత' వద్ద అక్రమంగా ర్యాంప్‌ నిర్మించారు. దీనిపై గతేడాది ఆయనకు మున్సిపల్‌ కార్పోరేషన్‌ నోటీసులు కూడా జారీ చేసింది.

 Shahrukh Khan fined Rs.1.93 lakh for illegal ramp outside ‘Mannat’

వారి నోటీసులను షారుక్ పట్టించుకోక పోవడంతో ఫిబ్రవరి 15న మున్సిపల్‌ అధికారులు ర్యాంపు నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. అనంతరం జరిమానా కూడా విధించారు. ధ్వంసం చేసిన విషయం మీడియా ద్వారా అందరికీ తెలిసినా జరిమాన విసయం మాత్రం జనాలకు తెలియదు.

మరి అక్రమానికి పాల్పడిన షారుక్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై ఆర్టీఏ చట్టం ద్వారా అనిల్ గాల్‌గాని అధికారుల నుండి సమాధానం రాబట్టగలిగారు.

English summary
Shah Rukh Khan has been fined Rs.1,93,784 by the Brihan Mumbai Municipal Corporation for constructing an illegal ramp outside his bungalow 'Mannat' in Bandra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu