»   » డాక్టరేట్ అందుకున్న షారుక్ ఖాన్ (ఫోటోస్)

డాక్టరేట్ అందుకున్న షారుక్ ఖాన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత యూనివర్శిటీ ఎడిన్‌బర్గ్ నుండి గౌరవ డాక్టరేట్ డిగ్రీని అందుకున్నాకు. ఆయన చేస్తున్న మానవతా సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రధానం చేసారు. షారుక్ ఖాన్ కు ఇది రెండో గౌరవ డాక్టరేట్ డిగ్రీ. ఈ సందర్భంగా షారుక్ లుంగీ డాన్స్ తో సందడి చేసారు. శుక్రవారం లండన్ లో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి యూనివర్శిటీకి చెందిన స్టూడెంట్స్, పలు కమ్యూనిటీల గ్రూఫ్ సభ్యులు హాజరయ్యారు. గౌరవ డాక్టరేట్ డిగ్రీ అందుకున్న అనంతరం షారుక్ ఖాన్ పబ్లిక్ లెక్చర్ ఇచ్చారు. భావోద్వేగంతో ఆయన ఇచ్చిన ప్రసంగం సభికులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

‘ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీ నుండి డాక్టరేట్ డిగ్రీ అందుకోవడంతో గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు షారుక్ ఖాన్ వెల్లడించారు. ప్రపంచంలోని ఎంతో గొప్ప మంది ఈ యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వారిలో తనకూ చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను' అన్నారు.

జీవితంలో సాధారణం అంటూ ఏదీ లేదు. అదొక జీవం లేని పదం మాత్రమే. సంతోషకరమైన, విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే కొంత క్రేజీ నెస్ కూడ అవసరమే. కళాకారుడి కన్న కళే ముఖ్యం. మీదైన కళతో మీకు అనుబంధం లేకపోవడమే వెనకబాటు. అందుకే మీదైన కళతో ముందుకు సాగండి. మీరు చేస్తున్న పని మీలో ఉత్సాహాన్ని నింపకపోతే దాన్ని మానేయండి అంటూ షారుక్ ప్రసంగించారు.

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్


బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత యూనివర్శిటీ ఎడిన్‌బర్గ్ నుండి గౌరవ డాక్టరేట్ డిగ్రీని అందుకున్నాకు. ఆ

మానవతా సేవలు

మానవతా సేవలు


ఆయన చేస్తున్న మానవతా సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రధానం చేసారు.

రెండోది

రెండోది


షారుక్ ఖాన్ కు ఇది రెండో గౌరవ డాక్టరేట్ డిగ్రీ.

ప్రసంగం

ప్రసంగం


గౌరవ డాక్టరేట్ డిగ్రీ అందుకున్న అనంతరం షారుక్ ఖాన్ పబ్లిక్ లెక్చర్ ఇచ్చారు. భావోద్వేగంతో ఆయన ఇచ్చిన ప్రసంగం సభికులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

English summary
Shahrukh Khan, one of the most globally known superstars of Bollywood, receives his second honorary doctorate degree at the University of Edinburgh yesterday (October 16, 2015) and it's time for us to celebrate his another mind-blowing achievement in his career.
Please Wait while comments are loading...