»   »  ఎంత ముద్దొస్తున్నాడో ఈ బుల్లి సూపర్ స్టార్ (ఫోటోస్)

ఎంత ముద్దొస్తున్నాడో ఈ బుల్లి సూపర్ స్టార్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్-గౌరీ దంపతులు సర్రోగసీ పద్దతిలో మూడో సంతానాన్ని పొందిన సంగతి తెలిసిందే. మే 27, 2013లో జన్మించిన తమ గారాల బిడ్డకు అబ్ రామ్ అనే పేరు పెట్టారు. ఇటీవలే అబ్ రామ్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.

ఈ సందర్భంగా అబ్ రామ్ మీద ప్రత్యేక ఫోటో షూట్ చేసారు. తాజాగా విడుదల చేసిన ఫోటోల్లో అబ్ రామ్ ముద్దు ముద్దుగా...క్యూట్ క్యూట్‌గా ఆకట్టుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షారుక్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. "When my (little) heart beats, it screams Thug life." Tupac. Thank u all for your wishes of health & life. (sic)" పేర్కొన్నారు.

షారుక్ ఖాన్ కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు ఆర్యన్, కూతురు పేరు సుహానా. షారుక్ తనయుడు ఆర్యన్ ప్రస్తుతం లండన్లో చదువుకుంటున్నాడు. ఆర్యన్ ను తన సినీ వారసుడిగా తీర్చి దిద్దుతున్నాడు షారుక్.

అబ్ రామ్

అబ్ రామ్


అబ్ రామ్ విషయంలో లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించినట్లు అప్పట్లో వివాదం తలెత్తింది.

లింగ నిర్దారణ

లింగ నిర్దారణ


చట్ట విరుద్ధంగా తన బిడ్డ పుట్టకముందే బిడ్డ సెక్స్(ఆడా? మగా?) ఏమిటనే విషయాన్ని తెలుసుకున్నారనే వివాదం కూడా అప్పట్లో చెలరేగింది.

షారుక్ ఖండన

షారుక్ ఖండన


అబ్ రామ్ విషయంలో తాము లింగ నిర్ధారణ పరీక్షలు ఏమీ చేయలేదని షారుక్ స్పష్టం చేసారు.

అందుకే

అందుకే


బిడ్డ నెలలు నిండక ముందే జన్మించాడని, బిడ్డ ఆరోగ్యంపై ఆందోళన కారణంగానే తొలుత తానేమీ మాట్లాడలేకపోయానని షారుక్ ఖాన్ స్పష్టం చేసారు. బిడ్డ పుట్టక ముందు తాము ఎలాంటి సెక్స్ డిటర్మేషన్(లింగ నిర్ధారణ) టెస్టులు చేయించలేదని స్పష్టం చేసారు.

English summary
Shahrukh Khan's youngest son AbRam Khan is certainly one of the most popular celebrity kids in the tinsel town. It was AbRam's birthday yesterday (May 27th) and the little star was trending on social media all day long.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu