»   » ఓరి దేవుడో అంటూ.. తన మరణవార్తపై స్పందించిన షారుక్..

ఓరి దేవుడో అంటూ.. తన మరణవార్తపై స్పందించిన షారుక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ ఖాన్ ఇకలేరంటూ వచ్చిన వార్తలు హిందీ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపాయి. ఫ్రాన్స్‌లో విమాన ప్రమాదంలో షారుక్ దుర్మరణం చెందారని యూరోపియన్ న్యూస్ నెట్‌వర్క్ వెల్లడించిన కథనాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ వార్తలో నిజమెంతా అనే విషయాన్ని షారుక్ సిబ్బందికి స్వయంగా ముంబై జాయింట్ కమిషనర్ ఫోన్ చేసుకోన్నారు. ఆ వార్తలో వాస్తవం లేదని తెలియడంతో అభిమానులను ఊపిరిపీల్చుకొన్నారు. తన మరణంపై వచ్చిన రూమర్‌పై బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్పందించారు.

శుక్రవారం.. బతికి బయట..

థ్యాంక్యూ గాడ్.. ఈ రోజు శుక్రవారం కావడంతో బతికి బయడపట్టాను. విమాన ప్రమాదాన్ని పక్కన పెడితే.. షూటింగ్‌లో మరో ప్రమాదం నుంచి తప్పించుకొన్నాను. ఇంతియాజ్ అలీ చిత్రానికి టైటిల్‌కు సంబంధించిన మరో రూమర్ వార్తల్లో చేరింది అని షారుక్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ఓ ఫోటోను కూడా ట్యాగ్ చేయడం గమనార్హం.

షూటింగ్‌లో పైకప్పు కూలి..

షూటింగ్‌లో పైకప్పు కూలి..

ప్రస్తుతం షారుక్ ఖాన్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ షూటింగ్ సెట్లో పైకప్పు కూలి కిందపడింది. ఆ ఘటనలో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. దాంతో షూటింగ్‌ను వెంటనే వాయిదా వేశారు. వచ్చేవారం నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

షారుక్ సరసన అనుష్క, కత్రినా

షారుక్ సరసన అనుష్క, కత్రినా

ఆనంద్ ఎల్ రాయ్ చిత్రానికి సంబంధించిన మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో షారుక్ పక్కన అనుష్కశర్మ, కత్రినా కైఫ్‌లను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో షారుక్ మరుగుజ్గుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరో రూమర్ వెలుగులోకి..

మరో రూమర్ వెలుగులోకి..

విమాన ప్రమాద వార్త పక్కన పెడితే.. షారుక్, దర్శకుడు ఇంతియాజ్ అలీ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై ఓ రూమర్ జోరుందుకున్నది. ఈ చిత్రానికి ది రింగ్, రెహనుమా, రౌలా అనే పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే చిత్ర నిర్వాహకులు టైటిల్‌పై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో ఆ వార్త రూమర్‌గానే మిగిలిపోయింది.

English summary
Phew..this week had some really weird rumours doing the rounds. Actor Shahrukh Khan became the latest victim of a death hoax when a European news network announced that he was 'killed in a plane crash along with seven others. But the 'Baadshah of Bollywood' knows how to find humour in such strange situations. Finally, here's how he shut all rumours to rest with this one tweet... Thank God, It's Friday SRK wrote on his Twitter handle, "TGIF! Survived the week inspite of a plane crash, fatal accident on sets & yet another title of Imtiaz Ali film!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu