»   »  సూపర్ స్టార్‌కు సర్జరీ, అండగా నిలిచిన ఫ్యాన్స్‌కు థాంక్స్!

సూపర్ స్టార్‌కు సర్జరీ, అండగా నిలిచిన ఫ్యాన్స్‌కు థాంక్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ బాద్షా, సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు సర్జరీ జరిగింది. అయితే అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది చిన్నపాటి సర్జరీ మాత్రమే. ఎడమ మోకాలి నొప్పితో షారుక్ గత కొంత కాలంగా బాధ పడుతున్నారు. ఈ నొప్పి నుండి ఉపశమనం కోసం ముంబైలోని బ్రీంచ్ కాండీ ఆస్పత్రి వైద్యులు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేశారు.

ఈ సర్జరీ అనంతరం...నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా షారుక్ కు వైద్యులు సూచించారు. షారుక్ ఖాన్ ను ఈ నొప్పి గత కొన్ని నెలలుగా బాధిస్తున్న పెద్దగా పట్టించుకోలేదు. నొప్పితోనే షూటింగుల్లో పాల్గొనడంతో అది తీవ్రం అయింది. నడవటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది.

Shahrukh Khan Undergoes Surgery!

ఆయనకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్ర చికిత్స చేస్తే తప్ప కోలుకోవడం కష్టమని నిర్ధరించారు. ఈ మేరకు ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేశారు. షారుక్ ప్రస్తుతం కోలుకున్నారు. శనివారం డిశ్చార్జి చేయవచ్చని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసి షారుక్ అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసారు.

షారక్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో వేలాది కామెంట్స్ వెల్లువెత్తాయి. అభిమానులు తనకు అండగా ఉండటంపై సూపర్ స్టార్ సంతోషం వ్యక్తం చేసారు. ఈ మేరకు వారికి కృతజ్ఞతలు తెలయజేస్తూ ట్వీట్ చేసారు.

English summary
Bollywood superstar Shahrukh Khan on Thursday undergone arthroscopic surgery of the left knee at Breach Candy Hospital in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu