»   » షారుక్ డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడా? రియాల్టీ షో అంతా నాటకమేనా? వివరాలు ఇవిగో..

షారుక్ డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడా? రియాల్టీ షో అంతా నాటకమేనా? వివరాలు ఇవిగో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అరేబిక్ టెలివిజన్ చానెల్ నిర్వహించిన రియాల్టీ షోలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మరణం అంచుల వరకు వెళ్లి వచ్చిన ఘటన అంతా నాటకమేనట. భారీగా డబ్బు ముట్టజెప్పినందునే షారుక్ ఆ విధంగా నటించారనే విషయం తాజాగా మీడియాలో వైరల్‌గా మారింది. ఈజిప్ట్ కమెడియన్ రమేజ్ గలాల్ దుబాయ్ ఎడారిలో నిర్వహించిన రియాల్టీ షోలో షారుక్ బృందం ప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అది ప్రమాదం కాదని, రియాల్టీ షోలో ఓ భాగమని చెప్పడంతో షారుక్ ఆగ్రహం వ్యక్తం చేసి యాంకర్ రమేజ్ గలాల్‌ను పిడిగుద్దులు గుద్దిన సంగతి తెలిసిందే.

షారుక్‌కు భారీగా పారితోషికం

షారుక్‌కు భారీగా పారితోషికం

అల్ ఆలమ్ అనే పత్రిక వెల్లడించిన కథనం ప్రకారం.. పక్కా ప్రణాళికతో రూపొందించిన రియాల్టీ షోలో షారుక్ ఖాన్ నటించినందుకు రూ. 2 కోట్లు (400000 డాలర్లు) ముట్టజెప్పారు. రియాల్టీ షోలో చిత్రీకరించే కథంతా షారుక్‌కు ముందే తెలుసు అని వెల్లడించింది. టెలివిజన్ చానెల్ రూపొందించిన స్క్రిప్ట్ ప్రకారమే షారుక్ ఆ షోను రక్తి కట్టించారు అనేది పత్రిక కథనం సారాంశం.

షారుక్ ముఖంలో భయం లేదే?

షారుక్ ముఖంలో భయం లేదే?

షారుక్ ప్రయాణిస్తున్న వాహనం ఇసుక ఊబిలో కూరుకుపోతుంది. షారుక్‌తోపాటు ఉన్న మహిళ భయంతో అరుపులు, పెడబొబ్బలు పెడుతుంది. అయితే షారుక్‌ ముఖంలో పెద్దగా ఆందోళన కనిపించదు. అప్పుడే కొందరికి అనుమానాలు తలెత్తాయి. ప్రస్తుతం ఈ రియాల్టీ షోకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి.

వివాదాస్పదమైన షారుక్ సెల్ఫీ

వివాదాస్పదమైన షారుక్ సెల్ఫీ

అరబిక్ టెలివిజన్ ఛానెల్‌ రియాల్టీ షోలో నటించిన షారుక్‌తో హోస్ట్ రమేజ్ గలాల్ సెల్ఫీ దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే ఆ సెల్ఫీ షోకు ముందు దిగాడా లేదా షో తర్వాత దిగాడా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ రియాల్టీ షో చూసిన వారు చాలా థ్రిల్‌గా ఫీలయ్యారు. అయితే ఈ కార్యక్రమం అసలు సంగతి తెలిసిన వారు ముక్కున వేలేసుకోవడం పరిపాటైంది. షారుక్, రమేజ్ సెల్ఫీ విషయం ప్రస్తుతం వివాదంగా మారింది.

రియాల్టీ షో గురించి ముందే తెలుసు

రియాల్టీ షో గురించి ముందే తెలుసు

రియాల్టీ షో గురించి షారుక్‌ ఖాన్‌కు ముందే తెలుసు. ముందస్తు ప్లాన్ ప్రకారమే షూటింగ్ జరిగింది. షారుక్ ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా స్క్రిప్ట్‌లో భాగం అని షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్దానీ ధ్రువీకరించారు. అయితే ఈ షో కోసం షారుక్ ఎంత మొత్తాన్ని తీసుకొన్నాడనే విషయంపై మాట్లాడటానికి నిరాకరించారు.

షారుక్‌తో టీవీ ప్రజెంటర్ నెషాన్

షారుక్‌తో టీవీ ప్రజెంటర్ నెషాన్

ఈ షోలో షారుక్‌తో పాటు కనిపించిన మరో మహిళ టీవీ ప్రజెంటర్ నెషాన్. షారుక్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన సందర్భంగా ఆ రియాల్టీ షోలో భాగమైంది. షారుక్‌తోపాటు నెషాన్ ప్రయాణిస్తుండగా వారి వాహనం ఇసుక ఊబిలో కూరుకుపోవడం, ఆ తర్వాత వారి వద్దకు డైనోసార్ రావడం, అనంతరం ఇదంతా రియాల్టీ షోలో భాగమని చెప్పడం బాగా ఆసక్తిని కలిగింది. ప్రస్తుతం రెండు నిమిషాల నిడివి ఉన్న రియాల్టీ షో వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

English summary
According to the news publication Al-Alam, a source revealed that Khan was paid $400,000 (approx Rs 2 crore) to appear on the show. Ramez later posted a selfie with SRK on Twitter, adding fuel to the reports that it was staged. However, it’s hard to say if the selfie was taken before or after the prank. Shah Rukh’s manager Pooja Dadlani confirmed, “Yes, it was staged and Shah Rukh Khan was aware and was acting as if he was angry.” She gave no confirmation on whether the actor was paid to be on the show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu