For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రోడ్డుపై నగ్నంగా శ్రీ రెడ్డి.. అబ్బో! నా వల్ల కాదంటూ షకీలా షాకింగ్ కామెంట్స్

  |

  ఒకప్పటి శృంగార తార షకీలా అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆమె చేసిన శృంగార సినిమాలకు అమితమైన డిమాండ్ ఉండేది. స్టార్ హీరోలకు ధీటుగా ఆమె సినిమాలు విడుదలయ్యేయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శృంగార తారగా తెలుగు, తమిళ భాషల్లో భారీ క్రేజ్ సంపాదించిన షకీలా.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సంచలన తార శ్రీ రెడ్డిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసి హాట్ హాట్ చర్చలకు తెరలేపింది. ఇంతకీ షకీలా ఏమంది? వివరాల్లోకి పోతే..

  కొబ్బరిమట్టలో షకీలా

  కొబ్బరిమట్టలో షకీలా

  సెక్సీ స్టార్‌గా మంచి గుర్తింపు పొందిన షకీలా.. గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. ఇటీవల జరిగిన కొన్ని ఇంటర్వూస్‌లో తన జీవితంలో పడిన కష్టాలు, సొంత అక్క చేతిలో మోసపోయిన తీరు చెప్పి ఆమె ఫాన్స్‌ కళ్ళలో కన్నీరు నింపింది. ఇక తాజాగా అవన్నీ మరిచి మరోసారి 'కొబ్బరి మట్ట' సినిమా ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది షకీలా. ఈ చిత్రంలో కత్తి మహేష్ తో జోడీగా, సంపూ తల్లిగా నటించి మెప్పించింది.

  మరో జన్మంటూ ఉంటే షకీలా గానే పుడతా

  మరో జన్మంటూ ఉంటే షకీలా గానే పుడతా

  సినిమాల పరంగా స్టార్ హీరోలతో పోటీపడిన షకీలా నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. నమ్మిన వారే మోసం చేయడంతో ప్రస్తుతం జీరో పొజీషన్ లో ఉంది. అయితే తాను నమ్మకద్రోహానికి గురైనా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు అని చెబుతోంది షకీలా. పరిస్థితుల్ని చూసి పారిపోయే మనస్తత్వం కాదని, అవమానం జరిగిన చోటే తిరిగి అభిమానం పొందుతా అంటోంది. అంతేకాదు మరో జన్మంటూ ఉంటే మళ్లీ షకీలా గానే పుట్టాలని ఉందని చెప్పి షాకిచ్చింది షకీలా.

  నగ్నంగా శ్రీ రెడ్డి.. కాస్టింగ్ కౌచ్ విషయమై షకీలా

  నగ్నంగా శ్రీ రెడ్డి.. కాస్టింగ్ కౌచ్ విషయమై షకీలా

  తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంటూ మహిళలను మోసం చేసి వదిలేస్తున్నారని గతంలో శ్రీ రెడ్డి సృష్టించిన హంగామా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నది రోడ్డుపైనే బట్టలిప్పి నగ్నంగా నిరసన తెలిపింది శ్రీ రెడ్డి. ఈ నేపథ్యంలో తాజా జరిగిన ఓ ఇంటర్వ్యూలో షకీలాకు కాస్టింగ్ కౌచ్ విషయమై కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

  శ్రీరెడ్డిలా గుడ్డలిప్పుకుని అంటూ సెన్సేషన్

  శ్రీరెడ్డిలా గుడ్డలిప్పుకుని అంటూ సెన్సేషన్

  దీంతో వెంటనే రియాక్ట్ అయిన షకీలా.. తాను శృంగార తారగా నటించినప్పటికీ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని చెప్పింది. కెమెరా ముందు అర్ధనగ్నంగా నటించడానికి తనకెలాంటి ఇబ్బంది లేదని చెప్పిన ఆమె.. పాపం శ్రీరెడ్డిలా గుడ్డలిప్పుకుని రోడ్డుమీద మాత్రం నిలబడలేనని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇది కాస్త హాట్ హాట్ చర్చలకు దారి తీసింది.

  ఎవ్వరినీ వదలని శ్రీ రెడ్డి, షకీలాను మాత్రం వదులుతుందా?

  ఎవ్వరినీ వదలని శ్రీ రెడ్డి, షకీలాను మాత్రం వదులుతుందా?

  దీంతో ఒక్కసారిగా శ్రీ రెడ్డి, షకీలా విషయమై చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటికే తాను టార్గెట్ చేసిన ఏ ఒక్కరినీ వదలకుండా దుమ్ము దులుపుతున్న శ్రీ రెడ్డి.. ఈ కామెంట్స్ చూశాక ఇక షకీలాను మాత్రం వదులుతుందా? అని చెప్పుకుంటున్నారు జనం.

  English summary
  Mahesh Kathi and Shakeela played intresting roles on Kobbari Matta movie. This movie is Sampoornesh Babu's third movie in his career. In latest interview shakeela says about her life and commented Sri Reddy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X