»   » జూ ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ హిట్ ‘శక్తి’ తోనే మొదలు....

జూ ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ హిట్ ‘శక్తి’ తోనే మొదలు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ తో వైజయంతీ మూబీస్ బ్యానర్ పై 'కంత్రీ" దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'శక్తి" చిత్రం ముందుగా అనుకున్నట్టు సంక్రాంతికి రావట్లేదని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకానుంది. గత సంక్రాంతికి 'అదుర్స్" అనిపించుకున్న జూనియర్ ఈ సంక్రాంతికి కూడా 'శక్తి" చూపిస్తాడని ఆశించగా, అప్పటికి ఈ చిత్రం పని పూర్తి కాదని తేలింది. బడ్జెట్ లిమిట్ లేకుండా నిర్మిస్తున్న చిత్రమిదని అశ్వనీదత్ ఘనంగా ప్రకటించుకున్న 'శక్తి" చిత్రం ఆయన అన్నట్టుగానే భారీ లెవల్లో తెరకెక్కుతోంది.

'కంత్రీ", 'బిల్లా" సినిమాలతో కమర్షియల్ గా సేలబుల్ సినిమాలు తీసే దర్శకుడనిపించుకున్న మెహర్ రమేష్ 'శక్తి" చిత్రంతో బిగ్ లీగ్ లోకి చేరతాడని అశ్వనీదత్ గట్టిగా చెబుతున్నారు. తన బ్యానర్ లోనే టాప్ హిట్ గా నిలిచే లక్షణాలు ఈ చిత్రంలో చాలా కనిపిస్తున్నాయని, 'శక్తి" తో జూ ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తాడని ఆయన అంటున్నారు. ఇలియానా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి వైజయంతి ఆస్థాన సంగీతకారుడు మణిశర్మ స్వరాలందిస్తున్నారు. ఇటీవలి కాలంలో మినిమం గ్యారెంటీ హీరోగా మారిన జూ ఎన్టీఆర్ నుంచి చాలా కాలంగా ఎదురు చూస్తోన్న బ్లాక్ బస్టర్ హిట్ 'శక్తి" తోనే సాధ్యమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu