»   » ‘మహానటి’లో అర్జున్ రెడ్డి హీరోయిన్ పాత్ర ఇదే...

‘మహానటి’లో అర్జున్ రెడ్డి హీరోయిన్ పాత్ర ఇదే...

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మహానటి'లో అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పాత్ర ఏమిటి? అనే వివరాలు ఇంత వరకు బయటకు రాలేదు. తాజాగా ఈ పాత్రను హీరో నాని వాయిస్ ఓవర్‌ ద్వారా ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఓ వీడియో విడుదల చేశారు.

  'మహానటి'లో శాలిని పాండే ... సావిత్రి చిన్ననాటి స్నేహితురాలు సుశీల పాత్రలో కనిపించబోతోందట. ''సుశీల... సావిత్రి గారి చిన్ననాటి స్నేహితురాలు. బాల్యంలో బలపడిన బంధం కదా...ఇద్దరూ రాళ్లలో రాగాలు తీశారు, రాధాకృష్ణులుగానూ అలరించారు. మరి మనకు తెలియని సుశీలను మన మనసుకు పరిచయం చేయబోతోంది 'మహానటి'... అంటూ రిలీజైన వీడియో ఆకట్టుకునే విధంగా ఉంది.

  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మహానటి' చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో నటిస్తుండగా దుల్కర్ సల్మాన్ సావిత్రా భర్త జెమినీ గణేశన్‌ పాత్రను పోషించారు. సావిత్రి చిన్నతనం నుండి మహానటిగా ఆమె ఎలా ఎదిగారు అనే విషయాలన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నారు.

  స్టార్ హీరోయిన్ సమంత ఈ మూవీలో జర్నలిస్టు మధురవాణి పాత్ర పోషించారు. ఆమెతో పాటు ఉండే ప్రెస్ ఫోటోగ్రాఫర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. వీరితో పాటు ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న "మహానటి" చిత్రాన్ని దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నాడు. ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

  Shalini Pandey as Susheela in Mahanati movie
  Vijay DevaraKonda Has Signed A New Movie

  ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్.

  English summary
  Here is the Character Intro of Shalini Pandey as Susheela in Mahanati. The greatest story ever told about the greatest actress that ever lived. It is such a privilege to make a biopic of the one and only Mahanati Savitri, an iconic actress we were ever blessed with. Mahanati is an ode to the great soul that etched a special place in all our hearts.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more