»   » ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ మరో ఛాన్స్ కొట్టేసింది

‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ మరో ఛాన్స్ కొట్టేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అర్జున్ రెడ్డి' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన జబల్పూర్ బ్యూటీ శాలిని పాండే మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ తెలుగు సినీ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'మహా నటి' చిత్రంలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.

దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సమంత, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం షాలిని పాండేను ఎంపిక చేసినట్టు సమాచారం.

జమున పాత్రలో శాలిని

జమున పాత్రలో శాలిని

సావిత్రికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు ప్రముఖ నటి జమున. జమున పాత్రలో శాలిని పాండే బాగా సూటవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

చక్రపాణి పాత్రలో

చక్రపాణి పాత్రలో

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. విజయ వాహిని బేనర్ అధినేత చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. తొలినాళ్లలో సావిత్రిలోని టాలెంట్ గుర్తించి, తన సినిమాల్లో నటిగా అవకాశం ఇచ్చిన నిర్మాతల్లో చక్రపాణి ఒకరు. సావిత్రి సినీ జీవితంలోని అతిముఖ్యమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆ పాత్ర సినిమాలో కీలకంగా ఉండనున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌ను ఆ పాత్రకు ఎంపిక చేశారు.

మహానటి

మహానటి

ఈ చిత్రం వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బేనర్లో 'మహానటి' చిత్రం తెరకెక్కుతోంది. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

శాలిని పాండే రియల్ స్టోరీ

శాలిని పాండే రియల్ స్టోరీ

నాన్నను ఎదురించా, పోలీస్ కంప్లయింట్ బెదిరింపు... ‘అర్జన్ రెడ్డి' హీరోయిన్ తన రియల్ లైఫ్ విషయాలు వెల్లడించింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆర్థిక ఇబ్బందులు అబద్దం

ఆర్థిక ఇబ్బందులు అబద్దం

సావిత్రి చివరి రోజుల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొందని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కారు షెడ్డులో గడిపిందనే వార్తలు ఉన్నాయి. అయితే ఈ వార్తలను ఆమె కూతురు స్పందించారు.

రెండు తరాలైనా తరగదు: మహానటి సావిత్రి ఆస్తులపై కూతురు హాట్ కామెంట్!

English summary
Actor Shalini Pandey who made a splash with her debut in Arjun Reddy, may have landed a plum role in Mahanati, a bilingual biopic on legendary southern actor Savitri. source said that, will play actor Jamuna in Mahanati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu