»   » బాహబలి2లో ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పిన పవన్ విలన్

బాహబలి2లో ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పిన పవన్ విలన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 హిందీ వెర్షన్‌లో ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పే అవకాశం రావడంపై నటుడు శరద్ కేల్కర్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 'బాహుబలి కన్‌క్లూజన్‌లో భాగం కావడం గర్వంగా ఉంది. ఈ సినిమాకు పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. రాజమౌళి గారికి కృతజ్ఞతలు. ట్రైలర్ త్వరలోనే వస్తున్నది' అని శరద్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

Sharad Kelkar lent his voice for Prabhas for Bahubali2

గతంలో కూడా బాహుబలి బిగినింగ్‌లో ప్రభాస్ పాత్రకు కూడా ఆయన డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా బాహుబలి2 చిత్రం ఏప్రిల్ 28న విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మార్చి 15న విడుదల కానున్నది. ఆడియో కార్యక్రమాన్ని మార్చి 25న జరిపే అవకాశం ఉంది.

శరద్ కేల్కర్ విలన్‌గా తెలుగు ప్రేక్షకుకులకు సుపరిచితులు. పవన్ కల్యాణ్ చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ప్రతినాయకడి పాత్రను పోషించారు.

English summary
Actor Sharad Kelkar lent his voice for Prabhas for Bahubali2. He tweeted that honoured to be a part of Bahubali the conclusion. Trailer coming soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu