»   »  దాడి ఘటనతో కలిదిలిన సెన్సార్ బోర్డ్.... ‘శరణం గచ్చామి’కి గ్రీన్ సిగ్నల్!

దాడి ఘటనతో కలిదిలిన సెన్సార్ బోర్డ్.... ‘శరణం గచ్చామి’కి గ్రీన్ సిగ్నల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'శరణం గచ్చామి' సినిమాపై కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ బోర్డు నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.

తొలుత ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. సినిమాలో వివాదాస్పదంగా రిజర్వేషన్ల అంశాన్ని ఫోకస్ చేసారని, ఇది శాంతిభద్రతల సమస్యకు కారణం అవుతుందని నిరాకరించారు.

అయితే సినిమా మీద సెన్సార్ బోర్డ్ నిషేదం విధించడాన్ని వ్యతిరేకిస్తూ.... హైదరాబాద్ లో కేంద్ర సెన్సార్‌ బోర్డు కార్యాలయంలపై విద్యార్థి సంఘాల నేతలు వారం క్రితం దాడి చేసారు. ఓయూ జేఏసీ, టీఎస్‌ జేఏసీ, ఎస్టీ తెలంగాణ విద్యార్థి సంఘం నేతృత్వంలో ఆందోళనకారులు ఈ దాడికి పాల్పడ్డారు.

 దాడి ఘటనతో వేగంగా

దాడి ఘటనతో వేగంగా

ఈ దాడి ఘటనతో సెన్సార్ బోర్డ్ వేగంగా కదిలింది. సోమవారం పోలీసు బందోబస్తు మధ్య మరోసారి సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాను వీక్షించారు. యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసారు. ప్రేమ్‌రాజ్‌ దర్శకత్వంలో బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మకు మురళి ఈ చిత్రాన్ని నిర్మించారు.

 జయప్రకాశ్‌రెడ్డితో పాటు రచయిత దేశపతి శ్రీనివాస్‌

జయప్రకాశ్‌రెడ్డితో పాటు రచయిత దేశపతి శ్రీనివాస్‌

నవీన్ సంజయ్‌, తనిష్క్‌ తివారి జంటగా నటించిన ఇందులో పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డితో పాటు రచయిత దేశపతి శ్రీనివాస్‌, బీసీ సంఘం నాయకులు ఆర్‌. కృష్ణయ్య వంటివాళ్లూ కీలక పాత్రలు చేసారు.

 నిర్మాత మురళి మాట్లాడుతూ

నిర్మాత మురళి మాట్లాడుతూ

‘‘డాక్టరేట్‌ పొందిన నేను, ఎంతో పరిశోధనచేసి తయారుచేసిన సబ్జెక్టుతో ఈ సినిమా నిర్మించాను. గత డిసెంబర్‌లో సెన్సార్‌కు పంపితే, జనవరి 2న సెన్సార్‌ సభ్యులు చిత్రాన్ని చూశారు. ఈ సినిమా విడుదలైతే సమాజంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుందనీ, అల్లర్లు చెలరేగుతాయనీ, అందువల్ల సర్టిఫికెట్‌ను నిరాకరిస్తున్నామనీ తెలియజేస్తూ సెన్సార్‌ ఆఫీసర్‌ పంపిన ఉత్తరం అందడంతో షాకయ్యామని, ఇపుడు సెన్సార్ సర్టిఫికెట్ రావడంతో ఆనందంగా ఉందని మురళి తెలిపారు.

 కథేంటి?

కథేంటి?

‘‘ఇది ఓ జర్నలిస్ట్‌ కథ. రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్ల అంశంపై పీహెచ్‌డీ చేయాలనుకున్న అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే ఈ చిత్ర కథాంశం.

English summary
"Sharanam Gacchami" Get U/A certificate. Sharanam Gachchami is the story of Manas, a varsity student who picks reservations as his PhD topic after a friend commits suicide over losing a government job to a lower-caste candidate. While carrying out his research, the student realises why reservations were intr
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu