»   »  'సర్దార్' పై రూమర్స్, చెక్ పెట్టడానికే శరత్ మరార్ ఇలా

'సర్దార్' పై రూమర్స్, చెక్ పెట్టడానికే శరత్ మరార్ ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్ ' రిలీజ్ డేట్ ని ఏప్రియల్ 8 గా గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజుకు వర్క్ ఫినిష్ కాదని, రిలీజ్ అవదని రకరకాల రూమర్స్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ నేపధ్యంలో వాటికి చెక్ పెట్టాలని నిర్మాత శరత్ మరార్ నిర్ణయించుకుని ఈ క్రింద విధంగా ట్వీట్ చేసారు.

పవన్ కళ్యాణ్ హీరోగా, కాజల్ హీరోయిన్ గా రెడీ అవుతున్న చిత్రం సర్థార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శర వేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 8న విడదల తేదీని ఎట్టి పరిస్దితుల్లోనూ తప్పకూడదని పవన్ భావించి వేగం పెంచి, డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు.

తాజాగా అందింన సమాచారం మేరకు ఈ సినిమాకు సంబందించి నెక్స్ట్ షెడ్యూల్ స్విజ్జర్లాండ్ లో జరగనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఇందులో పవన్, కాజల్ పాల్గోననున్నారు.

Sharrath Marar latest tweet about Sardaar Gabbar Singh


ఇక 'సర్దార్ గబ్బర్ సింగ్' కోసం పవన్ కళ్యాణ్ ప్రతీ విషయంలోనూ స్పష్టమైన ప్లాన్ తో వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్, ప్రమోషన్, రిలీజ్ డేట్, ఇలా ప్రతి విషయంలోనూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడంటున్నారు. ముఖ్యంగా చిత్రం రిలీజ్ విషయంలో ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అలాంటి సమయంలో ఇలాంటివి జరగటం మాత్రం ఇబ్బందికరమైన అంశమే.

ఈ చిత్రాన్ని సమ్మర్ కి తీసుకు వచ్చేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోన్నారు. ఈ మేరకు ప్లానింగ్ జరిగినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా సండేస్ తప్ప శెలవు ఇవ్వకుండా...కాన్సర్టేషన్ గా వర్క్ చేయనున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్, రాయ్ లక్ష్మీ ఆడిపాడుతున్నారు. అలాగే కన్నడ భామ సంజన కూడా ఈ మధ్యనే ఈ లిస్ట్ లో చేరింది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

English summary
Sharrath Marar tweet:" #SardaarGabbarSingh, constables,goons & gangs, all working hard for a Blockbuster release on April 8th. #PawanKalyan "
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu