twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాలుగేళ్ల నుంచి హిట్ లేదు.. బ్లాంక్ ఫీలింగ్‌తో ఉన్నా.. శర్వానంద్ ఎమోషనల్

    |

    నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ డైరెక్షన్‌లో టైమ్ ట్రావెల్ ఆధారంగా రూపొందిన మదర్ సెంటిమెంట్ చిత్రం ఒకే ఒక జీవితం. శర్వానంద్, అమల అక్కినేని, రీతూ వర్మ, వెన్నెల కిషోర్, దర్శి నటించిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. థియేటర్లలో వస్తున్న స్పందన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ..

    థ్యాంక్యూ మీట్ ఎందుకంటే?

    థ్యాంక్యూ మీట్ ఎందుకంటే?

    ఒకే ఒక జీవితం సినిమాకు మొదటి నుంచి సపోర్ట్ ఇచ్చినందుకు మీడియాకు థ్యాంక్స్. ఇది సక్సెస్ మీట్ కాదు. మీ అందరికి థ్యాంక్స్ చెప్పడానికి ఏర్పాటు చేసిన ఈవెంట్. మీ అందరికి వ్యక్తిగతంగా థ్యాంక్స్ చెప్పడానికి ఏర్పాటు చేసిన మీటింగ్ ఇది. ఒకే ఒక జీవితం సినిమా రిలీజ్ తర్వాత ఒక రకమైన ఫీలింగ్‌లో ఉన్నాను. ఒక భారాన్ని దించుకొన్న ఫీలింగ్‌తో ఉన్నాను. ఒక బ్లాంక్ మూడ్‌తో ఉన్నాను అని శర్వానంద్ అన్నారు.

    థియేటర్లలో లేచి చప్పట్లు కొడుతుంటే

    థియేటర్లలో లేచి చప్పట్లు కొడుతుంటే

    గత నాలుగేళ్ల నుంచి హిట్ లేకుండా టెన్షన్‌లో ఉన్నాను. హిట్ లేకపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇది హిట్టా? ఎంత కలెక్ట్ చేస్తుందా అనే విషయాలను పట్టించుకోవడం లేదు. ఒకే ఒక జీవితం సినిమా చూసిన తర్వాత థియేటర్లలో ప్రేక్షకులు లేచి చప్పట్లు కొడుతుంటే.. ఇది కదా.. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిందనే ఫీలింగ్ కలిగింది. ఇటీవల కాలంలో ప్రేక్షకులు లేచి చప్పట్లు కొట్టిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. సినిమాకు వెళ్లి ఆ చప్పట్లు వినాలని ఉంది అని శర్వానంద్ పేర్కొన్నారు.

    మీడియా ప్రశంసలతో

    మీడియా ప్రశంసలతో

    ఒకే ఒక జీవితం చూసిన మీడియా వాళ్లు నన్ను గట్టిగా కౌగిలించుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పీఆర్వో వంశీశేఖర్ గాఢం కౌగిలించుకొని సక్సెస్ సందర్భంగా ప్రేమను పంచారు. శర్వానంద్ సక్సెస్ కొట్టాలని మీడియా వాళ్లు అనుకొన్నారు. అదే నాకు సక్సెస్. మంచి సపోర్ట్‌తో ముందుకు నడిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని శర్వానంద్ ఎమోషనల్ అయ్యారు.

    వెన్నెల కిషోర్ గురించి

    వెన్నెల కిషోర్ గురించి

    నేను ఛాన్స్ ఇస్తే వెన్నెల కిషోర్ ఈ పాత్రను చేశాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఎక్కడా కనిపించడు. ఆయన చేసిన పాత్రనే కనిపిస్తుంది. అంత బాగా డిజైన్ చేసిన దర్శకుడు శ్రీ కార్తీక్ అందుకు కారణం. ఆయన మంచి కథలు రాస్తే.. మేము రెడీగా ఉన్నాం. నీకు మంచి భవిష్యత్ ఉంది. ఇంకా మీ ప్రయాణం సుదీర్ఘంగా సాగాలని కోరుకొంటున్నాం అని శర్వానంద్ అన్నారు.

     నిర్మాత ఛాలెంజ్‌గా తీసుకొని

    నిర్మాత ఛాలెంజ్‌గా తీసుకొని

    ఒకే ఒక జీవితం సినిమాకు బిగ్గెస్ట్ పిల్లర్ ప్రొడ్యూసర్. కథను నమ్మి ఈ సినిమా చేసిన నిర్మాతకు ధన్యవాదాలు. హిట్లు, ఫెయిల్యూర్ పక్కన పెడితే.. ఈ సినిమాకు కలెక్షన్లు ఎలా ఉంటాయనేది మాకు తెలుసు. ఈ జర్నీలో మాకు సపోర్ట్‌గా నిలిచిన నిర్మాత ప్రభుకు థ్యాంక్స్. ఈ సినిమాను ప్రేక్షకులే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇంకా మంచి మూవీస్ చేస్తాం. ప్రేక్షకులకు ధన్యవాదాలు అని శర్వానంద్ ఎమోషనల్‌గా ప్రసంగాన్ని ముగించారు.

    English summary
    Actor Sharwanand's Oke Oka Jeevitham released on September 9th. This movie is doing good at box office. Here is the Sharwand's Emotional speech.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X