twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘శ్రీకారం’కు భారీ ఎదురుదెబ్బ: రిలీజ్ రోజే శర్వానంద్ మూవీ లీక్.. ఆ వెబ్‌సైట్లలో డౌన్‌లోడ్ లింక్

    |

    కొన్నేళ్లుగా వరుస పరాజయాలను చవి చూస్తూ ఇబ్బందులు పడుతున్నాడు టాలెంటెడ్ హీరో శర్వానంద్. ఇలాంటి పరిస్థితుల్లో సరైన హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే తాజాగా 'శ్రీకారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మెగాస్టార్ ఆశీస్సులు ఉండడంతో పాటు ఆ అభిమానుల అండదండలు ఉండడంతో ఈ సినిమాపై సినీ ప్రియులంతా దృష్టి సారించారు. ఎన్నో అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. కానీ, ఈ చిత్రం వచ్చిన గంటల వ్యవధిలోనే ఫుల్ మూవీ లీకైపోయింది. ఆ వివరాలు మీకోసం!

     సక్సెస్‌కు ‘శ్రీకారం' చుట్టాలని వచ్చాడు

    సక్సెస్‌కు ‘శ్రీకారం' చుట్టాలని వచ్చాడు

    శర్వానంద్ హీరోగా కిశోర్ రెడ్డి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన చిత్రమే 'శ్రీకారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట దీన్ని నిర్మించారు.టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

    ఆ షార్ట్ ఫిల్మ్ ఆధారంగా తీసిన చిత్రమే

    ఆ షార్ట్ ఫిల్మ్ ఆధారంగా తీసిన చిత్రమే

    కిశోర్ రెడ్డి కొన్నేళ్ల క్రితం 'శ్రీకారం' అనే షార్ట్ ఫిల్మ్ రూపొందించాడు. వ్యవసాయ రంగంలోని సమస్యలపై తీసిన దీనికి మంచి స్పందన వచ్చింది. విమర్శకులు సైతం ప్రశంసించేలా దీన్ని తెరకెక్కించాడు. ఇది చూసిన తర్వాతనే నిర్మాతలు అతడికి అవకాశం కల్పించారు. ఈ ఫిల్మ్ ఆధారంగానే వ్యవసాయం గొప్పదనం చూపించేందుకు అదే టైటిల్‌తో 'శ్రీకారం' సినిమాను తీశాడు.

     అంచనాలకు తగ్గట్లుగా మూవీ బిజినెస్

    అంచనాలకు తగ్గట్లుగా మూవీ బిజినెస్

    'శ్రీకారం' మూవీపై మొదట్లో అంచనాలు లేకున్నా.. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత పరిస్థితి మారిపోయింది. దీంతో శర్వానంద్ కెరీర్‌లోనే తొలిసారి దీనికి భారీగా బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 5.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.40 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటితో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ బిజినెస్ రూ. 17.10 జరిగినట్లు తెలుస్తోంది.

     భారీగా విడుదల.. రెస్పాన్స్ అదే రితిలో

    భారీగా విడుదల.. రెస్పాన్స్ అదే రితిలో

    మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం పలు చిత్రాలతో పాటు 'శ్రీకారం' కూడా విడుదలైంది. మిగిలిన వాటితో పోలిస్తే దీనికి థియేటర్లు ఎక్కువగా లభించాయి. దీంతో భారీ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే దీనికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో పాజిటివ్ టాక్‌తో పాటు రివ్యూలు కూడా అనుకూలంగా వచ్చాయి.

     కలెక్షన్లు ఏ రేంజ్? ఎక్కడ? ఎంతంటే?

    కలెక్షన్లు ఏ రేంజ్? ఎక్కడ? ఎంతంటే?

    ఫస్ట్ డే 'శ్రీకారం' నైజాంలో రూ. 1.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 72 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 54 లక్షలు, ఈస్ట్‌లో రూ. 44 లక్షలు, వెస్ట్‌లో రూ. 27 లక్షలు, గుంటూరులో రూ. 65 లక్షలు, కృష్ణాలో రూ. 23.10 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలు, ఓవర్సీస్‌ రూ. 12 లక్షలు, కర్నాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షలతో మొత్తంగా రూ. 4.29 కోట్లు షేర్, రూ. 7.30 కోట్లు గ్రాస్ రాబట్టింది.

     ‘శ్రీకారం' సినిమాకు భారీ ఎదురుదెబ్బ

    ‘శ్రీకారం' సినిమాకు భారీ ఎదురుదెబ్బ

    భారీ అంచనాలతో విడుదలైన 'శ్రీకారం' సినిమాకు ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తున్నారు. దీంతో ఈ వీకెండ్‌లో బ్రేక్ ఈవెన్‌ను చేరుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇది విడుదలైన కొద్ది గంటల్లోనే ఫుల్ మూవీ బయటకు వచ్చేసింది. దీని వల్ల సినిమా కలెక్షన్లకు దెబ్బ పడే ప్రమాదం ఏర్పడింది.

    రిలీజ్ రోజే బయటకొచ్చిన శ్రీకారం మూవీ

    రిలీజ్ రోజే బయటకొచ్చిన శ్రీకారం మూవీ

    పైరసీని ప్రోత్సహించే కొన్ని వెబ్‌సైట్లు 'శ్రీకారం' ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్‌ను గురువారమే ఆన్‌లైన్‌లో పెట్టేశాయి. ఇది పైరసీ మాఫియాకు పెద్దన్నలా వ్యవహరిస్తున్న తమిళ్ రాకర్స్ చేసిన పనే అని తెలుస్తోంది. అందుకే ఆ సైట్‌తో పాటు మరికొన్నింటిలో ఈ మూవీ థియేటర్ ప్రింట్ దర్శనమిచ్చింది. దీంతో థియేటర్లకు వెళ్లి చూడలేని చాలా మంది ఈ సైట్లను ఆశ్రయించే అవకాశం ఉంది.

    English summary
    Sharwanand Sreekaram is directed by newcomer Kishore Reddy and produced Ram Achanta and Gopichand Achanta under their banner 14 Reels Plus. The film was formally launched with a pooja ceremony on Sunday morning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X