»   » తన అక్రమ సంభంధాల గురించి సీనియర్ హీరో

తన అక్రమ సంభంధాల గురించి సీనియర్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : సినీ నటీ నటుల జీవితాల్లో అక్రమం సంభంధాలు ఉంటూంటాయని జనం నమ్ముతూంటారు. అయితే అవి ఎంత వరకూ నిజమో, లేక గాసిప్స్ అనేవి వారికి అంతులేని ప్రశ్నగానే మిగిలిపోతూంటాయి. అయితే తన గురించి జనం అలా మిస్టరీగా ఉండకూడదని అనుకున్నాడో ఏమో ... బాలీవుడ్‌ నటుడు, బిజెపి ఎంపి శతృఘ్నసిన్హా తన జీవితంలోని అక్రమ సంభంధాలు గురించి మాట్లాడారు. ఈయన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర చిత్రంలో కీలకమైన పాత్రను పోషించిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది.

శతృఘ్నసిన్హా తన బయోగ్రఫీ...'ఎనీ ధింగ్ బట్ ఖామోష్: ది శతృఘ్నసిన్హా బయోగ్రఫీ' లో ఈ విషయాలు ప్రస్దావించారు. ఈ ఆత్మకథను పూర్తి చేయడానికి రచయిత్రి భారతి ఎస్‌ ప్రధాన్‌కు ఏడేళ్లు పట్టింది. 'ఎనీ థింగ్‌ బట్‌ ఖామూష్‌'ను బిజెపి అగ్రనేతలు, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష సభ్యుల నడుమ డిల్లీలో విడుదల చేశారు.

Shatrughan Sinha opens up about the 'baharwali' in his life

శతృఘ్నసిన్హా మాట్లాడుతూ.. 'నా బయోగ్రఫీ...నా జీవితం గురించి ఉంటుంది... నేను పూనేలో చదువుకోసం ఇల్లు ఎలా వదిలిపెట్టింది..ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా స్ట్రగుల్స్ అనుభవించాను, నా జీవితంలోకి వచ్చిన అమ్మాయిలు, భార్య...ఇంకా బయిటవాళ్లు గురించి ఉంటుంది,' అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఆయన వారి పేర్లు బయిటకు చెప్పటానికి ఇష్టపడలేదు. కానీ రీనా రాయ్ తో అనుబంధ ..పూనం ని వివాహం చేసుకున్న తర్వాత కూడా కొనసాగిందని అన్నారు. తన జీవితంలోకి వచ్చిన మిగతా ఆడవాళ్ల పేర్లు చెప్పటానికి ఆయన ఇష్టపడలేదు. వారు సెటిలై పిల్లలతో సుఖంగా ఉన్నారని, వారి పేర్లు చెప్పి ఇబ్బందులకు గురి చెయ్యనని అన్నారు.

English summary
Shatrughan Sinha disclosed his other side in his biography 'Anything But Khamosh: The Shatrughan Sinha Biography' penned by senior journalist Bharathi S Pradhan. "The book has the summary of my life, from how I left home to study films at Pune, my struggle in the film industry, and then the girls who came into my life - the gharwali (wife) came and then baharwali (the other woman)," Sinha told PTI in an interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu