»   » ఐఫా అవార్డ్ ఫంక్షన్ లో శిల్పాశెట్టి ఏం చేస్తోందంటే....

ఐఫా అవార్డ్ ఫంక్షన్ లో శిల్పాశెట్టి ఏం చేస్తోందంటే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

యోగాలో శిల్పా శెట్టి కి మంచి అనుభవమే ఉంది. ఇదివరలోనే యోగా చేస్తూ చేసిన సీడీ మార్కెట్ లో విడుదలైంది కూడా. ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాతో కలిసి ఈ జనవరిలో వేదిక మీద కూడా ప్రదర్శణ ఇచ్చిన శిల్పా ఆతర్వాత రాందేవ్‌తో కలిసి యోగా సాధన చేయడం చాలా ఆనందంగా ఉందని ట్విట్టర్‌లో తన ఫొటోలని పోస్ట్ చేసింది. భారతీయ ఆహారంపై రచించిన 'ది గ్రేట్‌ ఇండియన్‌ డైట్‌' అనే పుస్తకాన్ని కూడా రాసిన శిల్పా ఇప్పూడు యోగా లో మరో మెట్టు ఎక్కింది. ఐఫా అవార్డ్ ఫంక్షన్ లోనూ యోగా మీద క్లాస్ తీసుకోనుంది శిల్పా....

Shilpa Shetty to conduct yoga class in Spain for IIFA

స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో జరుగుతున్న ఐఫా వేడుకల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకోని చేయాలనుకున్న కార్యక్రమం ఈరోజు జరగనుంది. ఈ సందర్భంగా శిల్పా శెట్టి యోగా అక్కడి వారికి క్లాసులు చెబుతుందట. పొద్దున్న 11 గంటలకు మొదలుపెట్టి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ యోగా క్లాస్ జరుగుతుంది..

Shilpa Shetty to conduct yoga class in Spain for IIFA

నాలుగు రోజుల పాటు జరగనున్న ఐఫా అవార్డుల కార్యక్రమం ఈనెల 26తో ముగియనుంది. బాలీవుడ్‌ నటుల నృత్యాలు.. సింగర్స్‌ పాటలతో ఐఫా వేదిక ఉత్సాహంగా ఉంది. ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందకు బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, దీపికా పదుకొణె, అనిల్‌ కపూర్‌, అమీషా పటేల్‌, సూరజ్‌ పంచోలితో పాటు పలువురు హాజరయ్యారు.ఇప్పుడూ వీరంతా శిల్పా చెప్పే యోగా క్లాస్ కి వెళ్తారా లేదా అన్నది చూడాలి మరి.

English summary
Actress-entrepreneur Shilpa Shetty, who has been promoting fitness, will host a special yoga masterclass in Madrid, where the International Indian Film Academy 2016 celebrations will spread the Bollywood fever this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu