»   » సెక్సీ..సెక్సీ యోగా ఇంకోసారి: శిల్పశెట్టి మరో యోగా వీడియో రెడీ చేస్తోంది

సెక్సీ..సెక్సీ యోగా ఇంకోసారి: శిల్పశెట్టి మరో యోగా వీడియో రెడీ చేస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

భార‌తదేశం పుట్టి, విదేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన యోగ‌పై ఇప్పుడు సెల‌బ్రిటీలు ఎడ తెగ‌ని మ‌క్కువ చూపుతున్నారు.. స‌నాత‌న యోగ సంప్ర‌దాయాల‌కు మాతృభూమిగా ఉన్న భార‌త్ ఇప్ప‌డు ప్ర‌త్యేక దృష్టి సారించింది.. ప్ర‌ధానిగా న‌రేంద్ర‌మోడి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఏకంగా ఏడాదిలో ఒక రోజును యోగ డే గా నిర్వ‌హిస్తున్నారు.. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో 186 దేశాల్లో యోగా ఆచ‌రిస్తున్నార‌ని తాజాగా యునెస్కో అంద‌జేసిన నివేదిక‌లు చెబుతున్నాయి.. ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, మంచి న‌డ‌వ‌డిక‌ను అందించే యోగాల‌పై భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు మోజు పెంచుకుంటున్నారు.

యువ‌త‌పై యోగా ప‌ట్ల మ‌రింత ఆస‌క్తిని పెంచేందుకు బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి యోగా అవ‌గాహ‌న త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్న‌ది.. ఎప్ప‌టిక‌ప్ప‌డు యోగా వీడియోల‌ను విడుద‌ల చేస్తున్న‌ది.. బాలీవుడ్‌ భామ శిల్పా శెట్టి చాలాకాలం క్రితం యోగాని ప్రమోట్‌ చేసే క్రమంలో ఓ యోగా వీడియో విడుదల చేసింది. అప్పట్లో అదో పెద్ద సెన్సేషన్‌ అయ్యింది. కెరీర్‌ మొదట్లో శిల్పాశెట్టి ఎలా వుందో, ఇప్పుడూ ఆమె అదే ఫిట్‌నెస్‌ని మెయిన్‌టెయిన్‌ చేస్తోంది. పెళ్ళయ్యాక, ఆ తర్వాత తల్లి అయ్యాక కూడా ఆమె ఫిజిక్‌లో ఏమాత్రం మార్పు రాలేదు.

Shilpa Shetty Yoga Exercises, Fitness Workouts

తాజాగా, శిల్పాశెట్టిని ఓ సంస్థ భారీ ఆఫర్‌తో సంప్రదించింది. సరికొత్త యోగాసనాలతో వీడియో రూపొందించదలచుకున్నామనీ, మార్కెట్‌లోకి తీసుకురానున్న ఆ యోగా సీడీ - డీవీడీ కోసం పనిచేయాలనీ ఆ సంస్థ ఆమెకు విజ్ఞప్తి చేసిందట. దాంతో, మరో ఆలోచన లేకుండా శిల్పాశెట్టి కూడా ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. తనతోపాటు తన సోదరి షమితా శెట్టితోనూ ఈ యోగా వీడియోలో నటింపజేయనుంది శిల్పాశెట్టి.

Shilpa Shetty Yoga Exercises, Fitness Workouts

ప్రస్తుతం యోగాలో చాలా కొత్త విధానాల్ని కనుగొంటున్నారు. మొత్తంగా పదికి పైగా 'మోడ్రన్‌ యోగా' విధానాలు ఈ వీడియోలో దర్శనమివ్వనున్నాయట. వచ్చే ఏడాది ప్రధమార్థంలో విడుదల చేయనున్న ఆ యోగా వీడియోని ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్‌ చేయాలనే లక్ష్యంతో ఆ సంస్థ ముందుకొచ్చింది. ఇందుకోసం శిల్పాశెట్టి అందుకోనున్న రెమ్యునరేషన్‌ కూడా చాలా భారీగా వుండనుందని తెలుస్తోంది. ఈ పాత వీడియో ఓసారి చూడండి.

English summary
Bollywood Heroyin Shilpashetty who Acted as "Mermaid" in telugu movie "Sahasaveerudu Sagarakanya" planing to release a new "YOGA" CD
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu