»   » నిజంగానే ఇబ్బంది పడ్డాడా లేక....!? లిప్ లాక్ కోసం 19 టేకులు తీసుకున్నాడట

నిజంగానే ఇబ్బంది పడ్డాడా లేక....!? లిప్ లాక్ కోసం 19 టేకులు తీసుకున్నాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బర్మా', 'జాక్సన్‌ దురై' ఫేమ్‌ ధరణిధరన్‌ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం 'రాజా రంగుస్కి'. 'మెట్రో' ఫేమ్‌ హిరీష్‌, 'విల్‌ అంబు' నాయిక శాంథిని జంటగా నటిస్తున్నారు. శక్తివాసన్‌, బర్మా టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూరుస్తున్నారు.

ఇటీవలే తొలిషెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తి చేశారు. సోమవారం నుంచి రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఇందుకోసం తరమణిలో ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేశారు. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ మేం అనుకున్నదానికన్నా సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

Shirish kisses Chandini for 19 times to get one perfect shot

50 శాతం పైచిలుకు చిత్రీకరణ పూర్తయింది. ఇదేవేగంతోనే సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని భావిస్తున్నాం. కథా నాయకుడు శిరీష్‌ తన పాత్రను అద్భుతంగా పోషిస్తున్నారు. ప్రేమ సన్నివేశాల్లో కూడా మేం ఆశించినట్లుగానే నటించారు. కానీ కథానాయికకు ముద్దుపెట్టే సన్నివేశంలో మాత్రం ఆయన చాలా ఇబ్బందికరంగా నటించారు. కానీ మేం అనుకున్నట్లుగా రాలేదు. అందువల్ల ముద్దు సన్నివేశానికి ఏకంగా 19 టేకులు తీసుకున్నాడు అంటూ చెప్పాడు.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 19 టేకులు తీసుకున్నాడంటే కచ్చితంగా ఆ షూటింగ్ బాగా ఎంజాయ్ చేసే వుంటాడు అని అనుకోకండి! ఎందుకంటే ఆ కిస్సింగ్ సీన్ సంగతెలా వున్నా... నేను మాత్రం తెగ నర్వస్ అయ్యాను అంటున్నాడు హీరో. సెట్స్‌లో హీరోయిన్ సంగతేమిటోగానీ హీరోని మాత్రం బాగా ఇబ్బంది పెట్టిందట ఈ సుదీర్ఘమైన కిస్సింగ్ సీన్ షూట్. మళ్ళీ మళ్ళీ అదే సీన్ తీస్తూ అన్ని సార్లు ముద్దు పెట్టుకోవటానికి చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా ఫీలయ్యాడట.

English summary
The team ‘RAJA RANGUSKI’ is now all set to commence their second schedule of shoot from 6th February in big sets at Taramani. RAJA RANGUSKI Hero Sirish got little nervous and he almost took 19 takes to kiss the heroine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu