»   » శివాయ్ రివ్యూ: వ్యభిచారం గురించే సినిమా...! కమాల్ ఆర్ ఖాన్ మళ్ళీ కెలికాడు

శివాయ్ రివ్యూ: వ్యభిచారం గురించే సినిమా...! కమాల్ ఆర్ ఖాన్ మళ్ళీ కెలికాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శివాయ్'... అజయ్‌ తన కలల ప్రాజెక్టుగా రూపొందించిన ఈ సినిమాలో ఆయన సరసన సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తుండగా... దిలీప్ కుమార్, సైరా భానులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 28న (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమైంది..

ఇప్పటికే మూవీ టీమ్‌ రిలీజ్‌ చేసిన 'శివాయ్‌' సినిమా ట్రైలర్స్‌ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి... మంచు కొండల్లో చిత్రీకరించిన సన్నివేశాలు, యాక్షన్‌ సీన్లే కాకుండా... ట్రైలర్‌లో చూపించిన తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సీన్స్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి... శివును పాత్ర చుట్టూ తిరిగే ఈ సినిమా దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. విడుదలకు ముందే అనేక వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా ఈ రోజు విడుదక్ల కానుంది... ఈ సినిమాలో నిజంగానే ఒక వర్గాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయా..?? అన్ని కోట్ల బడ్జెట్ పెట్టి దర్శకుడుగా తొలి ప్రయోగం చేసిన అజయ్ ప్రయత్నం ఎంతవరకూ ఫలించనుందీ అన్నది మరికొద్ది సేపట్లో తేలనుంది... హాలీవుడ్ స్థాయి సినిమా అనిపించుకున్న ఈ సినిమా మీద చిన్న లుక్...

అజయ్ దేవ్ గన్:

అజయ్ దేవ్ గన్:

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శివాయ్'. ఈ చిత్రంలో అజయ్ సరసన సాయేషా సైగల్ జంటగా నటిస్తుండగా.. దిలీప్ కుమార్, సైరా భానులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ పై కొన్ని వివాదాలు చెలరేగాయి.. హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా సినిమా పోస్టర్ ఉందంటూ అజయ్ దేవగన్ కొత్త సినిమా శివాయ్ పై ఢిల్లీ, తిలక్ నగర్ పోలీ స్టేషన్ లో కేసు నమోదైంది..

హిందూ మనోభావాలు:

హిందూ మనోభావాలు:

మంచు ప‌ర్వ‌త శ్రేణులో ఉండే శివుడి వ‌ద్ద బూట్ల‌తో షూటింగ్ చేశార‌ని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు..అయితే ఈ మూవీని హిమాల‌యాల్లో కాకుండా బ‌ల్గేరియాలోని బాల్క‌న్ ప‌ర్వ‌త శ్రేణుల్లో షూటింగ్ జ‌రిపారు.. అయిన‌ప్ప‌టికీ బూట్ల‌తో చిత్రీక‌రించ‌డం మ‌నోభావాల‌ను కించ‌ప‌ర‌చ‌డ‌మేనంటూ ఈ మూవీపై కేసులు పెడుతున్నారు.. దీనిపై ఈ చిత్రం హీరో, ద‌ర్శ‌కుడు, నిర్మాత అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇంత వ‌ర‌కూ నోరు మెద‌ప లేదు..

కరణ్ జోహార్:

కరణ్ జోహార్:

అయితే బాలీవుడ్ రియల్మ్ లైఫె కమేడియన్ గా పిలవబడే కమాల్ ఆర్ ఖాన్ మాత్రం శివాయ్ ఒక చెత్త సినిమా అంటూ ట్వీట్ చేసేసాడు. ఇతను ఇంతకుముందే 'శివాయ్‌' సినిమాపై చెత్త రివ్యూలు ఇవ్వాలని కరణ్‌ జోహార్ తనకు పెద్ద మొత్తంలో డబ్బులిచ్చాడని చెప్పి అందరినీ పేద్ద గందర గోళం లో పడేసాడు. అది తెలిసి బాలీవుడ్‌ ఒక్కసారిగా షాకైంది.ఇదే విషయమై అజయ్‌, కరణ్‌లు ముభావంగా ఉంటున్నారు.

పర్వతాలు ఎక్కటమే సినిమా:

పర్వతాలు ఎక్కటమే సినిమా:

ఇక ఆ ప్రభావమో ఏమోగానీ ఇది చాలదన్నట్లు ఈ రోజు పొద్దున్నుంచే శివాయ్‌ పై ద్వజమెత్తాడు సినిమా చెత్తలా ఉందంటూ టెవీట్ చేసాడు.''శివాయ్‌ సినిమా చూశాను. పరమచెత్తలా ఉంది. సినిమాలోని ఆఖరి అరగంటలో అజయ్‌ కేవలం పర్వతాలు ఎక్కడమే చూపించారు. కేవలం పర్వతాలు చూపించడానికే సినిమా తీశారేమో. అసలు ఈ సినిమా చూడటం సమయం వృథా, డబ్బు వృథా. చెప్పాలంటే.. శివాయ్‌ బల్గేరియాలో జరిగే వ్యభిచారం గురించే.

బాక్సాఫీలో నిలవదు:

బాక్సాఫీలో నిలవదు:

ఇప్పుడు ఈ విషయం గురించి భారతీయులు సినిమా చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సన్నివేశంలో ప్రతీ భారతీయుడు అవినీతిపరుడు అన్నట్లు చూపించారు. అజయ్‌ ఫ్యాన్స్‌ అందరికీ నేను ఛాలెంజ్‌ చేస్తున్నాను. 'శివాయ్‌' సినిమా సోమవారం వరకు బాక్సాఫీస్‌ వద్ద నిలవదు. ఒకవేళ బాగా ఆడితే.. నేను అజయ్‌ దేవగణ్‌ ఆఫీస్‌లో పనివాడిగా చేరతాను'' అని ట్వీట్‌ చేశారు. మరి ఈ విషయమై అజయ్‌ ఏమంటారో చూడాలి మరి.

పోస్టర్ మీదే:

పోస్టర్ మీదే:

శివాయ్ విడుదలకు ముందునుంచే వివాదల్లో బాగా నానింది. హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా సినిమా పోస్టర్ ఉందంటూ అజయ్ దేవగన్ కొత్త సినిమా శివాయ్ పై ఢిల్లీ, తిలక్ నగర్ పోలీ స్టేషన్ లో కేసు నమోదైంది.. ఈ సినిమా కొసం విడుదలైన పోస్టర్లు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నది వారి అప్పటి ఆరోపణ

బల్గేరియా:

బల్గేరియా:

భారత దేశం లోని హిమాలయాల లో షూట్ చేసారని చాలామంది అనుకున్నా బ‌ల్గేరియాలోని బాల్క‌న్ ప‌ర్వ‌త శ్రేణుల్లో చాలా వ‌ర‌కు షూటింగ్ చేసిన‌ట్లు తెలుస్తోంది . పోలాండ్ న‌టి ఎరికా కార్‌, గిర్నీశ్ క‌ర్నాడ్‌, వీర్ దాస్‌, సైరా బాను కూడా ఈ ఫిల్మ్‌లో నటించారు. శివాయ్ ట్రైల‌ర్‌ వచ్చినప్పుడైతే బాలీవుడ్‌ మొత్తం ఒక ఆశ్చర్యం లో మునిగి పోయింది. బాలివుడ్ పరిశ్రమలోని మేధవి వర్గం మొత్తం ట్విట్ట‌ర్‌లో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.

సింగం తప్ప:

సింగం తప్ప:

నిజానికి అజయ్ దేవ్ గన్ ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేయడంలేదు. క్యారెక్టర్ సెంట్రికే తప్ప, హీరో ఓరియెంటెడ్ మూవీస్ చేయడం మానేసి చాలా రోజులే అయింది. మధ్యలో వచ్చిన సింగం మినహాయింపు, ఐతే వైవిధ్యమైన సినిమాలు చేయడానికే మనోడి ప్రయార్టీ, శివాయ్ కూడా ఒక రకంగా అలాంటి సినిమానే అజయ్ దేవ్గన్ అనే హీరో కాదు సినిమాలోని క్యారెక్టరే హీరో.

మెలూహ అనుకున్నారు:

మెలూహ అనుకున్నారు:

ఇక ఒక పోస్టర్ లో వీపుమీద త్రిషూలం పచ్చబొట్టుతో కనిపించటం తో ... ఆ మధ్య అమిష్ అనే రచయిత రాసిన శివాట్రయాలజీ లోని "మెలూహ" ముఖ చిత్రాన్ని గుర్తుకు తేవటం తో ఆ పుస్తకానికీ ఈచ్ సినిమాకీ ఏదో సంబందం ఉందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఆ పుస్తకానికీ తన సినిమాకి ఏ సంబందమూ లేదని మొదట్లోనే స్పష్టం చేసాడు అజయ్. తన సినిమా పై వేర్తే ఏ ప్రభావమూ పడకుండా శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

కరణ్ జోహార్:

కరణ్ జోహార్:

బాలీవుడ్‌లో ఇటీవలిగా అందరి దృష్టినీ ఆకర్షించింది కరణ్ జోహార్, అజయ్ దేవ్‌గన్‌ల క్లాష్. అజయ్ సినిమా 'శివాయ్'కు వ్యతిరేకంగా కరణ్, కమాల్ ఆర్ ఖాన్ అనే నటుడికి డబ్బు ఇచ్చి మరీ ప్రచారం చేయించాడని వార్తలు గుప్పుమన్నాయి. వీరద్దరి మధ్య సాగిన సంభాషణ టేప్స్ సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కరణ్ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కాడు అజయ్.

యే దిల్ హై ముష్కిల్:

యే దిల్ హై ముష్కిల్:

వీరి మధ్య వివాదాలు ముదిరిపోయాయని అజయ్ భార్య కాజోల్ కూడా కరణ్‌తో కటీఫ్ చెప్పిందని బీటౌన్ టాక్. అజయ్-కరణ్‌ల 'శివాయ్', 'యే దిల్ హై ముష్కిల్'లు ఒకే రోజు విడుదలవుతుండడంతో వీరి విబేధాలు పీక్స్‌కు వెళ్లిపోయాయని తెలుస్తోంది. తమ చిత్రాన్ని గెలుపు బాట పట్టించేందుకు కరణ్ వివిధ ప్రయత్నాలు చేశాడని, దాంట్లో ఒకటి 'శివాయ్‌'కు వ్యతిరేక ప్రచారమని సమాచారం.

వ్యక్తుల కంటే దేశం ముందు:

వ్యక్తుల కంటే దేశం ముందు:

'యే దిల్ హై ముష్కిల్' కు ఆశించినన్ని థియేటర్స్ లభించకపోవడంతో 'శివాయ్‌' టాప్ గ్రాసర్‌గా మారే అవకాశం ఉంది. అజయ్ సినిమాలో విదేశీయులు ఉన్నా వారు పాకిస్తాన్ వాసులైతే కాదు. ఇక, పాక్ కళాకారులపై ఇటీవల చెలరేగిన రచ్చలో అతడు ఎంఎన్ఎస్‌కు మద్దతు ఇచ్చాడు. వ్యక్తుల కంటే దేశం ముందు అని అన్నాడు. ఈ ఒక్క ప్రకటనతో ప్రజలు, రాజకీయ వర్గాలనూ ఆకట్టుకున్నాడు. దీంతో అతడి సినిమాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు.

అనుమానాస్పదంగా మారింది:

అనుమానాస్పదంగా మారింది:

ఎటొచ్చీ హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తున్న 'యే దిల్ హై ముష్కిల్' చిత్రం సంగతే అనుమానాస్పదంగా మారింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎలాగూ సినిమాను ఆదరిస్తారు. ఆ హోప్స్‌తోనే కరణ్ టీమ్ దీవాలీకి దుమ్మురేపుతామని చెప్తోంది. శివాయ్ అజయ్‌ దేవ్‌గన్‌కు, యే దిల్ హై ముష్కిల్ కరణ్, ఐశ్వర్య రాయ్, రణ్‌బీర్‌ కపూర్‌లకు కీలక సినిమాలు. సంచలనాలకు దూరంగా అజయ్ తన సినిమాను కూల్‌గా పూర్తి చేసేస్తే, కరణ్ పిక్చర్ మాత్రం సెన్సేషన్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నే కనిపించింది ఒక రకంగా ఇది ప్రచారానికి పనికి వచ్చినా సక్సెస్ ని సాధిస్తుందనే నమ్మకం ఏమాత్రం లేదు.

English summary
"30 minutes gone and Ajay Devgan sir is still climbing mountains only so I really don't know if he has made #Shivaay to show mountains only." Tweeted Kamal R Khan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu