For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వివాదంలో రాజశేఖర్ కూతురు సినిమా.. ఆ పేర్లు బయటపెడుతా.. కోర్టులో కేసు!

  |

  ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్‌లో రూపొందిస్తున్న చిత్రం 2 స్టేట్స్‌. చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల 2 స్టేట్స్‌ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడ‌విశేషు, శివానీ రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్నారు. వెంక‌ట్ రెడ్డి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ (స‌త్తిబాబు) నిర్మాత‌. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ మధ్యలో దర్శకుడు నిర్మాతలకి మధ్య స్టోరీ మార్పుల విషయం లో నిర్మాత చెప్పిన మార్పులు కథకు ఏమాత్రం న్యాయం చేయలేవని నిర్మాతకు చెప్పిన వినని పక్షం లో షూటింగ్ ఆగిపోయింది. ఆ తరువాత "2స్టేట్స్" మూవీ ప్రాజెక్ట్ లో అసలేమి జరిగిందనే అనే విషయమై దర్శకుడు వెంకటరెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నారంటే

   2 స్టేట్స్ మూవీ 70 శాతం పూర్తి

  2 స్టేట్స్ మూవీ 70 శాతం పూర్తి

  నేను ముందుగా ముంబై‌లోని బాలాజీ టెలి ఫిలిమ్స్‌లో దర్శకత్వ విభాగంలో కోర్సు పూర్తి చేసుకుని తర్వాత స్టార్ దర్శకులు వి.వి. వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు చిత్రాలకు పనిచేశాను. నాకు తగిన అనుభవం రావడంతో "2స్టేట్స్ ద్వారా దర్శకుడిగా పరిచయం కావాలనుకొన్నాను. " ఈ చిత్రం మొదలవుతున్నప్పుడు హీరో హీరోయిన్ నిర్మాతలను నేను నా స్టోరీ ని పూర్తిగా వినిపించాను. అందరి అనుమతి తీసుకొన్న తర్వాతే షూటింగ్ మొదలు పెట్టాను. ఇప్పటికి మూవీ 70% పుర్తి చేసుకున్నది అని వెంకటరెడ్డి తెలిపారు.

  కథలో మార్పులు చేయాలని ఒత్తిడి

  కథలో మార్పులు చేయాలని ఒత్తిడి

  అయితే మా ఆర్టిస్టులు, నిర్మాత, మిగతా టెక్నిషన్స్ అందరూ ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ ఔట్ ఫుట్ విషయం లో చాలా ఆనందంగా ఉన్నారు, ఆ విషయాన్ని నిర్మాత కొన్నిరోజుల క్రితం న్యూస్ పేపర్స్, సోషల్ మీడియాలలో షేర్ చేయడం జరిగింది, సినిమా బాగా వస్తున్న టైంలో నా కథను కొంతమంది పక్కదోవ పట్టించే దిశగా 2స్టేట్స్ కథలో మార్పులు చేయమని నన్ను నిర్మాత అడిగారు. అందుకు నేను అంగీకరించలేదు.

  దర్శకుడిగా తొలగించాలని

  దర్శకుడిగా తొలగించాలని

  అయితే కొంతమంది కలిసి నిర్మాత ఎం.ఎల్.వి. సత్యనారాయణ నన్ను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించాలని కోరారు. న్యూస్ పేపర్స్‌లో, సోషల్ మీడియాలలో నాపై చేసిన అసత్య ప్రచారం, నన్ను 2స్టేట్స్ మూవీ దర్శకుడిగా తొలగించే ప్రయత్నం జరుగుతుంది అని తెలిసి నేను నిర్మాత పై కోర్ట్ లో కేసు వెయ్యడం జరిగింది. సివిల్ కోర్టులో ఉన్న వేకేషన్ కోర్ట్ విచారణ అనంతరం ఈ నెల 30న 2స్టేట్స్ప్రొడ్యూసర్ ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ (స‌త్తిబాబు) ని వివరణ కోరింది

  రీమేక్ హక్కులు నాకే

  రీమేక్ హక్కులు నాకే

  2స్టేట్స్ సినిమాకు నేను దర్శకత్వంతో‌పాటు సినిమా నిర్మాణంలో భాగస్వామిని. ప్రాఫిట్ హోల్డర్ని కూడా. ఈ చిత్ర హక్కులు, 2స్టేట్స్ రీమేక్ రైట్స్ ముంబైలో చేసిన అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా పూర్తిగా దర్శకత్వం వహించే హక్కులు నాకు మాత్రమే ఉన్నాయి. నేను కాకుండా ఎవరైనా ఈ చిత్రాన్ని మిగతా 30% షూటింగ్ పూర్తి చేయాలని వచ్చిన దర్శకుడు కి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని దర్శకుడు వెంకట్‌రెడ్డి తెలిపారు.

  అందరి పేర్లు బయటపెడుతాను

  అందరి పేర్లు బయటపెడుతాను

  2స్టేట్స్ మూవీ కథ మార్పులు చేసి నన్ను ప్రాజెక్ట్ నుండి దూరం చేయాలనుకున్న అందరి పేర్లు, మరికొన్ని విషయాలు కోర్టు వారితో సంప్రదించి త్వరలో బయట పెడతాను, అని "2స్టేట్స్" చిత్ర దర్శకుడు వెంకటరెడ్డి తెలిపారు. రాజశేఖర్ కుమార్తె శివానీ, హీరో అడవి శేషు జంటగా హిందీలో ఘన విజయం సాధించిన 2 స్టేట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది.

  English summary
  Hero Rajashekhar Shivani Rajashekar movie 2 States in contraversy. This movie is remake of Hindi film 2 states which written by popular writer Chetan Bhagath. Director Venkat Reddy files a case on the producer and others.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X